https://oktelugu.com/

ప్రభుత్వం ఫెయిల్యూర్సే టీడీపీ అస్త్రాలా?

ఏపీ ఎన్నికల కమిషనర్ విషయం ఏపీ రాజకీయాల్లో కాకరేపింది. సీఎం జగన్ వర్సెస్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారం సెగలు కక్కింది. ఈ వివాదంతో ఏపీలో చివరికి స్థానిక సంస్థల ఎన్నికలకు కొద్ది రోజుల పాటు దూరంగా ఉండాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల జరపాలని భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో అటు హైకోర్టు వ్యాఖ్యలు.. ఇటు కమిషనర్‌‌ తీరును బట్టి చూస్తుంటే రాష్ట్రంలో ఇక స్థానిక […]

Written By:
  • NARESH
  • , Updated On : November 1, 2020 / 11:02 AM IST
    Follow us on

    ఏపీ ఎన్నికల కమిషనర్ విషయం ఏపీ రాజకీయాల్లో కాకరేపింది. సీఎం జగన్ వర్సెస్ ఎన్నికల కమిషనర్ నిమ్మగడ్డ వ్యవహారం సెగలు కక్కింది. ఈ వివాదంతో ఏపీలో చివరికి స్థానిక సంస్థల ఎన్నికలకు కొద్ది రోజుల పాటు దూరంగా ఉండాలని వైసీపీ ప్రభుత్వం నిర్ణయించింది. మరోవైపు ఎస్‌ఈసీ నిమ్మగడ్డ రమేష్‌ కుమార్‌‌ మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ ఎన్నికల జరపాలని భావిస్తున్నారని తెలుస్తోంది. దీంతో అటు హైకోర్టు వ్యాఖ్యలు.. ఇటు కమిషనర్‌‌ తీరును బట్టి చూస్తుంటే రాష్ట్రంలో ఇక స్థానిక సంస్థల ఎన్నికలు జరుగబోతున్నాయనే అర్థమవుతోంది. అయితే.. ఈ ఎన్నికలను జరపాలంటూ టీడీపీ కూడా పదేపదే కోరుతోంది. మరి ఈ ఎన్నికలు టీడీపీ లాభాన్ని చేకూరుస్తాయా..? వైసీపీకి మెజార్టీని తెచ్చిపెడుతాయా..?

    మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్

    జగన్‌ ప్రభుత్వం అధికారంలోని వచ్చా ఏడాదిన్నర కావస్తోంది. అయితే.. అప్పుడే వైసీపీ ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత పెరిగిపోయిందని టీడీపీ భావిస్తోంది. మరోవైపు కరోనాతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఏపీలో కరోనాను కట్టడి చేయడంలో ప్రభుత్వం విఫలమైందని టీడీపీ ఆరోపిస్తోంది. జగన్ చేతకానితనం వల్లనే కరోనా దేశంలో అగ్రస్థానానికి చేరుకుందని కూడా ఆరోపిస్తోంది.

    Also Read: ప్రధాని మోడీకి సీఎం జగన్ మరో సంచలన లేఖ

    అయితే.. జగన్‌ కూడా సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అభివృద్ధిపై పెద్దగా దృష్టి సారించడం లేదు. దీనికి ప్రధానంగా టీడీపీ తన అస్త్రంగా మార్చుకుంది. జగన్‌ వైఖరితో గ్రామాల నుంచి పట్టణాల వరకూ సమస్యలు పేరుకుపోతున్నాయి. ఇది స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు అనుకూలంగా మార్చుకోవాలని టీడీపీ చూస్తోంది. రాష్ట్రానికి పెట్టుబడులు కూడా రాకపోవడంతో ఉపాధి అవకాశాలు పూర్తిగా దెబ్బతిన్నాయని, దీంతో యువత కూడా జగన్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉందని టీడీపీ భావిస్తూనే ఉంది.

    Also Read: విశాఖ రాజధాని: అక్కడ ప్రభుత్వ భూమిని కొల్లగొట్టింది ఎవరు?

    వీటికితోడు మూడు రాజధానుల అంశాన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లనున్నారు. వీటన్నింటితో స్థానిక సంస్థల ఎన్నికల్లో బయటపడొచ్చని టీడీపీ అధినేత చంద్రబాబు సైతం అభిప్రాయపడుతున్నారు. కోస్తాంధ్రలో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తమ గెలుపు ఖాయమని నమ్మకంగా ఉన్నారు. అందుకే తిరిగి మొత్తం ఎన్నికలను షెడ్యూల్ చేయాలని టీడీపీ కోరుతోందట. మొత్తం మీద ఈ స్థానిక ఎన్నికల్లో మెజార్టీ సీట్లు సాధించి తమ పార్టీకి పూర్వవైభవం తీసుకురావాలని చంద్రబాబు చూస్తున్నారట. మరి ఈ ఎత్తులకు జగన్‌ ఎలాంటి పై ఎత్తులు వేస్తారో చూడాలి.