https://oktelugu.com/

గాంధీ, నెహ్రూలను కూడ వదలని కంగనా

బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంత దూకుడుగా ఉంటుందో అందరికీ తెలుసు. మనసులో ఉన్న విషయాలను ఎవరు ఏమనుకుంటారో అనే మీమాంస లేకుండా అలాగే బయటపెట్టేస్తుంది. ఈ తత్వంతోనే ఆమె అనేక వివాదాల్లో ఇరుక్కుంది. ఈమధ్య ఆమెకు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేకు నడుమ పెద్ద వివాదమే చెలరేగింది. హిందూత్వం, వారసత్వం వంటి అంశాల్లో ఆమెకు, ముఖ్యమంత్రికి మాటల యుద్ధం నడిచింది. ఒకానొక దశలో కేంద్ర బలగాలు తోడురాగా ఆమె ముంబైలోని తన వివాసానికి వెళ్ళవలసి […]

Written By:
  • admin
  • , Updated On : November 1, 2020 10:45 am
    Follow us on

    Kangana Ranaut Sardar Patel
    బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ఎంత దూకుడుగా ఉంటుందో అందరికీ తెలుసు. మనసులో ఉన్న విషయాలను ఎవరు ఏమనుకుంటారో అనే మీమాంస లేకుండా అలాగే బయటపెట్టేస్తుంది. ఈ తత్వంతోనే ఆమె అనేక వివాదాల్లో ఇరుక్కుంది. ఈమధ్య ఆమెకు, మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఉద్దవ్ థాకరేకు నడుమ పెద్ద వివాదమే చెలరేగింది. హిందూత్వం, వారసత్వం వంటి అంశాల్లో ఆమెకు, ముఖ్యమంత్రికి మాటల యుద్ధం నడిచింది. ఒకానొక దశలో కేంద్ర బలగాలు తోడురాగా ఆమె ముంబైలోని తన వివాసానికి వెళ్ళవలసి వచ్చింది. ఇప్పటికీ ఈ వివాదం సద్దుమణగలేదు.

    మరిన్ని సినిమా వార్తల కోసం బాలీవుడ్ న్యూస్

    ఈలోపే కంగనా మరొక వివాదాన్ని కొని తెచ్చుకుంది. ఈరోజు భారత మాజీ ఉప ప్రధాని దివంగత సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతి. వేడుకలను దేశం మొత్తం జరుపుకుంటోంది. కంగనా కూడా వల్లభాయ్ పటేల్ ను కీర్తిస్తూ ట్వీట్ వేసింది. కానీ ఆ పొగడ్తల్లో గాంధీ, నెహ్రూలను తీవ్రంగా విమర్శించింది. కంగనా తన ట్వీట్లలో గాంధీజీ కోసమే వల్లభాయ్ పటేల్ భారత్ తొలి ప్రధాని పదవిని నెహ్రూకు త్యాగం చేశారని చెప్పుకొచ్చింది కంగనా.

    Also Read: పవర్ స్టార్ పవన్ ప్యాకేజీ.. తెలిస్తే కళ్లు బైర్లు కమ్మాల్సిందే..!

    గాంధీజీని సంతోషపెట్టేందుకే సర్దార్ వల్లభాయ్ పటేల్ ప్రధాని అయ్యే అవకాశాన్ని త్యాగం చేశారు. నెహ్రూ అయితే ఇంగ్లిష్ బాగా మాట్లాడగలరని ఆయన నమ్మకం. ఈ నిర్ణయం వలన పటేల్ బాధపడలేదు కానీ దేశం మాత్రం కొన్ని దశాబ్దాల పాటు ఇబ్బందులు పడింది. అందుకే మనకి దక్కాల్సిన దాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోకూడదు అంటూ బలహీన మనస్తత్వం కలిగిన నెహ్రూను అడ్డుపెట్టుకుని గాంధీ పాలించాలని అనుకోవడంలో తప్పులేదు. కానీ ఆయన చంపబడిన తర్వాత దేశం కష్టాల్లో పడింది అంటూ తన అభిప్రాయాన్ని చెప్పుకొచ్చింది. ఆమె ఆలోచనతో ఏకీభవించని అనేకమంది ఆమెపై విమర్శలు గుప్పిస్తున్నారు.