Chandrababu Arrest: తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, మాజీ సిఎం అయినా చంద్రబాబు నాయుడుని స్కిల్ డెవలప్మెంట్ కేసులో అరెస్ట్ చేసిన విషయం మనందరికీ తెలిసిందే. ఇక ఈయనని రాజమండ్రి జైల్లో పెట్టీ కనీస వసతులు కూడా కల్పించకుండా ఇబ్బంది పెడుతూ ఆయన చేత జైలు జీవితాన్ని అనుభవించేలా చేస్తున్నారు…ఇక ఈ విషయం మీద ఇప్పటికే చాలామంది ప్రముఖులు మేధావులు సైతం స్పందించినప్పటికీ కొంతమంది మాత్రం స్పందించడం లేదు. చంద్రబాబు ద్వారా లబ్ధి పొందిన చాలా మంది ఆయన అరెస్టును నిరసిస్తూ పోస్టులు పెట్టడం కామెంట్స్ చేయడం లాంటివి చేశారు
ఇక రీసెంట్ గా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి అయిన తలసాని శ్రీనివాస్ యాదవ్ కూడా చంద్రబాబు అరెస్టు పైన స్పందించాడు రాజకీయాల్లో పోటీ ఉండాలి కానీ, ఇలా కక్ష సాధింపు వ్యవహారాలు ఉండకూడదు అంటూ ప్రభుత్వాన్ని చాలా గట్టిగా విమర్శించాడు…ఇదిలా ఉంటే తెలుగుదేశం కార్యకర్తలు మాత్రం జూనియర్ ఎన్టీఆర్ చంద్రబాబు నాయుడు అరెస్ట్ పైన స్పందించకపోవడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు.ఎందుకంటే బాలయ్య బాబు తర్వాత నందమూరి వంశాన్ని ముందుకు తీసుకెళుతున్న హీరోల్లో ఎన్టీఆర్ ఒక్కడే ఇప్పుడు నందమూరి ఫ్యామిలీ నుంచి యాక్టిివ్ లో ఉన్నాడు.ఇలా చంద్రబాబు లాంటి ఒక గొప్ప వ్యక్తి ని జైలులో ఉంచడం పట్ల ఎన్టీయార్ ఏ విధంగా స్పందించకపోవడాన్ని కొంతమంది అభిమానులు మాత్రం తప్పు పడుతున్నారు…
అయితే మరి కొంతమంది మాత్రం దీంట్లో ఉన్న ఆంతర్యాన్ని బయటికి తీసే ప్రయత్నం చేస్తున్నారు. అదేంటంటే మొదటి నుంచి నందమూరి హరికృష్ణ అనుచరుడు అయిన కొడాలి నాని అప్పట్లో హరికృష్ణ తోనే ఎక్కువ సానిహిత్యం గా ఉండేవాడు ఇక ఇలాంటి టైం లో జూనియర్ ఎన్టీయార్ వాళ్ల అమ్మ బయట వేరే చోట ఉండేవారు. దాంతో వాళ్లు బతకడానికి కావాల్సిన డబ్బులని వాళ్లకి ఇవ్వమని హరి కృష్ణ కొడాలి నాని కి ఇచ్చి ఆయన చేత వాళ్ళకి డబ్బులు పంపించేవాడు. ఇక అప్పటి నుంచి జూనియర్ ఎన్టీఆర్ కి కొడాలి నాని కి మధ్య చాలా సంవత్సరాల నుంచి మంచి సన్నిహిత్యం ఉంది ఇక అందులో భాగంగానే జూనియర్ ఎన్టీఆర్ హీరో అయినప్పుడు ఎలాంటి సినిమాలు చేస్తే బాగుంటుంది అనే విషయం మీద కూడా కొడాలి నాని చాలా స్టోరీలను విని, ఆయనే ఫైనల్ చేసి ఎన్టీఆర్ తో ఈ సినిమాలు చేస్తే బాగుంటుంది అని చెప్పి ఆయన చేత ఆ సినిమాలు చేయించి అలా ఎన్టీఆర్ కెరీయర్ ని హీరో గా నిలబెట్టడానికి కొడాలి నాని చాలా ప్రయత్నాలు చేస్తూ చాలా మంది డైరెక్టర్లతో ఎన్టీయార్ కి సినిమాలు సెట్ చేశాడు…
ఆ తర్వాత కొన్ని కారణాల వల్ల ఆయన వైసీపీ పార్టీలోకి వెళ్లిపోయారు…అయితే అంతకు ముందు ఎన్టీయార్ ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో నాని కోసం నేను ప్రాణం ఇస్తా అని ఎన్టీయార్ చెప్పాడు.ఇక ఇప్పుడు మాత్రం ఎన్టీఆర్ కొడాలి నాని కి నాకు ఏ సంబంధం లేదు అని చెప్పినప్పటికీ అదంతా అబద్దం ఇప్పటికీ కూడా ఎన్టీఆర్ కొడాలి నాని చెప్పినట్టుగానే చేస్తుంటాడు అని బాలయ్య బాబు, చంద్రబాబు ఇద్దరు నమ్ముతుంటారు.ఆ విషయానికి స్పష్టత వచ్చేలా ఇప్పుడు చంద్రబాబు అరెస్ట్ అయిన కూడా ఆ విషయం మీద కొడాలి నాని ఏ విధంగా స్పందించకు అని చెప్పడం వల్లే ఎన్టీఆర్ చంద్రబాబు అరెస్టు పైన ఏ రకంగా స్పందించడం లేదు అంటూ చాలామంది నందమూరి అభిమానులు సైతం ఇదే విషయాన్ని వెలిబుచ్చుతున్నారు…ఇక రీసెంట్ గా బాలయ్య లాంటి హీరో ఎన్టీయార్ స్పందించకపోతే ఐ డోంట్ కేర్ అంటూ కామెంట్ చేసినప్పటికీ కూడా ఎన్టీయార్ ఇంకా మౌనంగానే ఉన్నారు…