ప్రస్తుతం సినీ ఇండస్ట్రీలో ఏదైనా హాట్ టాపిక్ అంటే అది డ్రగ్స్ వ్యవహారమే. సుశాంత్ సింగ్ రాజ్ పుత్ మరణంతో ఒక్కో విషయం వెలుగులోకి వస్త్తు డ్రగ్స్ వ్యవహారం బయటపడింది. డ్రగ్స్ విషయంలో తవ్వేకొద్దీ నిజాలు బయటపడిన సమయంలోనే కన్నడ నటి సంజన విషయం వెలుగులోకి వచ్చింది. నటి సంజనను అదుపులోకి తీసుకొని విచారిస్తున్న పోలీసులకు ఇప్పటి వరకు సినిమా వారి పట్ల అనుమానం ఉండగా ఇప్పుడు ఆ అనుమానం పొలిటికల్ టర్న్ తీసుకుంది.
Also Read : బిగ్ బాస్ 4 : హౌస్ లో నోయల్ క్రష్ తనే…?
ఇక ఈ నేపథ్యంలోనే సంజన ఒకప్పటి జేడీఎస్ నేత, ప్రస్తుత కాంగ్రెస్ ఎమ్మెల్యే అహ్మద్ జమీర్ తో శ్రీలంకకు ట్రిప్ వెళ్లిందని సెలబ్రెటీల మేనేజర్ గా వ్యవహరించే ఓ వ్యక్తి వ్యాఖ్యానించడం ప్రస్తుతం రాజకీయంగా సంచలనంగా మారింది. ఇప్పటికే ఆమెకు భారీ ఆస్తులు ఉన్నట్టు విచారణ సంస్దలు మీడియాకు వెల్లడించాయి.
కేవలం బెంగుళూరులోనే ఆమెకు పది ప్లాట్లు ఉన్నట్టు ఆ సంస్దలు తేల్చాయి. అయితే చిన్న చిన్న సినిమాల్లో నటించే ఆమెకు అన్ని ఆస్తులు ఎలా వచ్చాయని అందరూ షాక్ తిన్నారు. అలాంటిది ఆమె ఓ రాజకీయ నేతతో ఫారెన్ టూర్ వెళ్లడం ప్రస్తుతం రాజకీయంగా అలజడి సృష్టిస్తుంది. ఇక్కడ మరో ట్విస్ట్ ఏంటంటే?
ఆ రాజకీయ నేత ఎన్నో సార్లు కొలంబోకు వెళ్లినట్టు ఒప్పుకున్నాడట. కానీ సంజనను తీసుకెళ్లినట్టు మాత్రం అతను ఒప్పుకోలేదట. గతంలో జేడీఎస్ వ్యూహాత్మక సమావేశాలు కొలొంబోలో ఒకసారి జరిగినట్టు ఆ సయమంలో కొలొంబోను ఎక్కువసార్లు సందర్శించినట్టు అతడు చెప్తున్నాడు. మరి ఆ నేత సంజనతో వెళ్లాడా? లేదా అనేది తెలియాలి అంటే వేచి చూడాల్సిందే.
కాగా కర్ణాటకలో పేకాట పిచ్చి ఉన్న వారు ఎక్కువ మంది శ్రీలంకకు వెళ్తారట. అక్కడ భారీగా ఖర్చు పెట్టి వస్తారట.. అంతేకాదు అక్కడ క్యాసినోల్లో ఖర్చు పెట్టినవారికి ఉచితంగా విమాన టికెట్లు ఆఫర్ చేస్తారట. అలా కేవలం సెలబ్రెటీలు మాత్రమే కాదు సామాన్యులు కూడా అలాంటి చోటికి వెళ్లేలా కొందరు ఏజెంట్లు మాయమాటలు చెప్తారని సమాచారం.
Also Read : ‘బాలయ్య’ హీరోయిన్ ఆడిషన్స్.. ఇది పెద్ద బాధే !