Homeఎంటర్టైన్మెంట్టాలీవుడ్ ఒక్కటే ఫుల్ బిజీ.. కారణం అదే !

టాలీవుడ్ ఒక్కటే ఫుల్ బిజీ.. కారణం అదే !

Hyderabad City is Busy with Shootings

తమిళనాడులో కరోనా మహమ్మారి ఇంకా తన ప్రభావం చూపిస్తూనే ఉంది. అందుకే మళ్ళీ తమిళనాడులో లాక్ డౌన్ ను రెండు వారాల పాటు పెంచారు. ఆ తర్వాత కూడా ఇంకా పొడిగించే అవకాశం ఉంది. ఇక కేరళలో కేసులు కూడా పెరుగుతున్నాయి కాబట్టి.. అక్కడ కూడా తమిళనాడు పరిస్థితే ఉంది. థియేటర్లు ఓపెన్ చేయలేదు. ఇప్పటో కర్ణాటకలో కూడా సినిమా థియేటర్లు ఓపెన్ అయ్యేలా లేవు.

అలాగే స్టూడియోలు కూడా ఓపెన్ చేయలేదు. దాంతో ఇతర సినిమా రంగాల హీరోలు, డైరెక్టర్లు అదేవిధంగా సాంకేతిక నిపుణులు మొత్తం హైదరాబాద్ కి మకాం మార్చుకుని ఇక్కడ షూట్స్ ప్లాన్ చేసుకుంటున్నారు. ప్రస్తుతం హైదరాబాద్ లోని వివిధ స్టూడియోలు ఫుల్ బిజీగా ఉన్నాయి. నిజానికి స్టూడియోల్లో అన్ని లొకేషన్లలో షూటింగ్ జరుగుతుంది. రామోజీ ఫిల్మ్ సిటీలో కూడా గ్యాప్ లేకుండా షూటింగ్స్ జరుగుతున్నాయి.

ప్రస్తుతం హైదరాబాద్ లో షూట్ జరుపుకుంటున్న సినిమాలు దాదాపు 90 వరకు ఉన్నాయట. ఈ 90 సినిమాల్లో తెలుగు సినిమాలతో పాటు మలయాళ, తమిళ, హిందీ సినిమాలున్నాయి. ఇక ఎలాగూ చిన్నాచితకా వెబ్ సిరీస్ లు, రెగ్యులర్ టీవీ సీరియల్స్ కూడా షూట్స్ తో బిజీగా ఉన్నాయి. అందుకే, ఇప్పుడు హైదరాబాద్ లో ప్యాడింగ్ ఆర్టిస్ట్ లకు కావాల్సిన వ్యానిటీ వ్యాన్లు దొరకడం లేదు.

అలాగే కెమెరా డిపార్ట్మెంట్ కి సంబంధించిన వస్తువులు కూడా అందుబాటులో ఉండటం లేదు. మొత్తానికి మిగిలిన ఇండస్ట్రీలు ఖాళీగా ఉంటే.. ఒక్క టాలీవుడ్ మాత్రం ఫుల్ బిజీగా ఉంది. అయితే, మిగిలిన ఇండస్ట్రీల నుండి హైదరాబాద్ లోనే షూటింగ్ జరుపుకోవడానికి ముఖ్యం కారణం.. స్టూడియోలు, లొకేషన్స్ తో పాటు ఇక్కడ ఫైవ్ స్టార్ హోటల్స్ రేట్స్ కూడా భారీగా తగ్గాయట.

admin
adminhttps://oktelugu.com/
Editor, He is Working from Past 3 Years in this Organization, He is the incharge of News content and Looks after the overall Content Management.
Exit mobile version