ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బీజేపీ ప్రధాన కార్యదర్శి విష్ణువర్ధన్‌రెడ్డిపై మూడు రోజుల క్రితం ఓ చానల్‌లో చర్చ సందర్భంగా అమరావతి నేత శ్రీనివాసరావు దాడిచేసిన విషయం తెలిసిందే. ఈ దాడి వ్యవహారం చినికి చినికి రాజకీయ దుమారంగా మారిపోయింది. అయితే.. ఇదే విషయమై ఆ ఛానల్ దినపత్రికలో వచ్చిన కథనం ద్వారా అసలు గుట్టు బయటపడిందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.
Also Read: అచ్చెన్నకు మరో భారీ పంచ్..
‘‘కేంద్రంలోని నరేంద్ర మోదీ ప్రభుత్వాన్ని చూసుకుని రాష్ట్రంలో అందరినీ బెదిరించి బతకడానికి రాష్ట్ర బీజేపీలో కొందరు అలవాటు పడిపోయారు. అలాంటి వారిలో సోము వీర్రాజు, విష్ణువర్ధన్‌రెడ్డి, జి.వి.ఎల్ నరసింహారావు తదితరులు ఉన్నారు. వీరికి ఏపీ పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్ సునీల్ దేవధర్ అండగా ఉంటున్నారనే ప్రచారం జరుగుతోంది’’ అని ఆ పత్రికలో రాసుకొచ్చారు. అయితే.. ఇక్కడ గుర్తించాల్సిన విషయం ఏమంటే.. జగన్‌రెడ్డి ప్రయోజనాలను కాపాడుతున్నారు అని రాసుకొచ్చిన ఆ నలుగురిలో విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఉన్నాడు.
Also Read: భారీ డైలాగులు.. పనిచేయనికి వ్యూహాలు..
ఈ విష్ణువర్ధన్ పైనే శ్రీనివాసరావు దాడిచేశాడు. అయితే.. దాడిచేయడం తప్పుఅని ఒక్కమాట కూడా చెప్పని సదరు పత్రికాధిపతి.. శ్రీనివాసరావుకు మంచి కండక్ట్ సర్టిఫికెట్ ఇచ్చే ప్రయత్నం చేయడం విశేషం. ‘‘విష్ణువర్ధన్ రెడ్డిపై చెప్పు విసిరిన డాక్టర్ శ్రీనివాసరావు గతంలో ఎన్నడూ ఆ విధంగా ప్రవర్తించలేదు. అర్థవంతంగా చర్చలలో పాల్గొంటారని ఆయనకు పేరు ఉంది. అయినా, ఆయన నిగ్రహం కోల్పోయే పరిస్థితి ఎందుకొచ్చిందో విష్ణువర్ధన్ రెడ్డి కూడా ఆత్మపరిశీలన చేసుకుంటే మంచిది’’అని ఆ పేపరు కథనంలో రాయడం గమనించాల్సిన అంశం.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్
ఈ రాతల ద్వారా.. విష్ణువర్ధన్‌రెడ్డిపై దాడిని సదరు పత్రికాధిపతి బహిరంగంగా సమర్థిస్తున్నట్టు చెప్పేశారు. ఈ రాతల ద్వారా.. సదరు పత్రికా యాజమాన్యం మనసులో బీజేపీకి చెందిన ఆ నలుగురు నేతలపై ఎంత కక్ష ఉందో అర్థమవుతోందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఎంతోకాలంగా తన మనసులో ఉన్న విషపు భావాలను ఈరోజు ఇలా బయటపెట్టారని చెప్పుకుంటున్నారు. విష్ణుపై దాడి నేపథ్యంలో ఆ పత్రికాధిపతి నైజం మొత్తం బయటపడుతోందని అంటున్నారు. చివరకు కులం కార్డును కూడా పైకి తెచ్చి, మరోసారి తన మనస్తత్వాన్ని బయటపెట్టుకుంటున్నారని చెబుతున్నారు. ఓసారి ఇంటర్వ్యూలో సినీనటుడు మోహన్ బాబు నేరుగా ఆయనతోనే చెప్పినట్టుగా.. సదరు పత్రికాధిపతికి కులపిచ్చి మామూలుగా లేదనే విషయం మరోసారి బహిర్గతమైందని అంటున్నారు.
తన చానల్‌లో బీజేపీ రాష్ట్ర నేతలపై దాడి జరగడంపై సదరు ఛానల్ అధిపతి కనీసం పశ్చాత్తాపం వ్యక్తంచేయకపోగా.. దాడిచేసిన శ్రీనివాసరావును ట్రాక్ రికార్డ్ అద్బుతం అని చెప్పడం.. ఎందుకు కొట్టారో ఆలోచించుకోవాలని బాధితుడికి సూచించడం ద్వారా.. ఆయన నైజం ప్రజలకు అర్థమైందని అంటున్నారు.
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Who is behind the chappal attack on vishnu vardhan reddy
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com