Three Airports: కేంద్రం ప్రైవేటీకరణ మంత్రాన్ని జపిస్తోంది. ఇందులో భాగంగా దేశంలోని ప్రధాన సంస్థలను లాభాలు రావడం లేదనే నెపంతో ప్రైవేటీకరించేందుకు పావులు కదుపుతోంది. ఇప్పటికే విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరింరాలని యోచిస్తోన్న కేంద్రం తాజాగా మూడు విమానాశ్రయాలను ప్రైవేటీకరించాలని ఆలోచిస్తోంది. దీంతో నిరసనలు పెరుగుతున్నాయి. ఏపీలోనే మూడు విమానాశ్రయాల ప్రైవేటీకరణకే మొగ్గు చూపడంతో ప్రజల్లో ఆందోళన పెరుగుతోంది.
2025లోగా తొలి దశలో దేశంలోని 25 ఎయిర్ పోర్టులను ప్రైవేటీకరించాలని కేంద్రం భావిస్తోంది. ఇందులో ఏపీలోని విజయవాడ, తిరుపతి, రాజమండ్రి విమానాశ్రయాలు ఉండటం గమనార్హం. ఎయిర్ పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా దేశ వ్యాప్తంగా 136 ఎయిర్ పోర్టులు ఉన్నాయి. ఆంధ్రప్రదేశ్ లో ఆరు ఉన్నాయి. ఇందులో మూడింటిని ప్రైవేటీకరించాలని ప్రయత్నాలు చేస్తుందని తెలుస్తోంది.
కేంద్రం కొన్నింటిని ప్రైవేటీకరించాలని చూస్తోంది. ఇందులో బొగ్గుగనులు కూడా ఉండటం తెలిసిందే. దీంతో ఆందోళనలు తీవ్ర స్థాయిలో పెరుగుతున్నాయి. అయినా కేంద్రం మాత్రం తన పని కానిచ్చేయాలనే చూస్తోంది. నష్టాల బారిన పడిన వాటిని ప్రైవేటీకరించాలని యోచిస్తోంది. ఇందులో భాగంగానే విశాఖ స్టీల్ ప్లాంట్ ను కూడా ప్రైవేటీకరించే విధంగా ప్రణాళికలు రచిస్తోంది. దీనిపై కూడా రాజకీయ పార్టీలు నిరసన తెలుపుతున్నాయి.
Also Read: Pawan Kalyan: విశాఖ ఉక్కు ఫ్యాక్టరీ కోసం ‘తెలంగాణ మోడల్’ సిద్ధం చేస్తున్న పవన్ కళ్యాణ్?
ఇప్పుడు విమానాశ్రయాలను ప్రైవేటీకరిస్తే వాటి భవిష్యత్ ఏమిటనే ప్రశ్నలు వస్తున్నాయి. దీనికి ఏపీలోని విమానాశ్రయాలను లక్ష్యంగా చేసుకోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నష్టాలు సాకుగా చూపి ప్రభుత్వం ప్రైవేటీకరణ మంత్రాన్ని జపించడంపై సర్వత్రా విమర్శలే వస్తున్నాయి. దీంతో కేంద్రం ఏ మేరకు ప్రైవేటీకరణ చేస్తుందో వేచి చూడాల్సిందే.
Also Read: Amaravathi: అమరావతి ఒక్కటే రాజధాని.. చంద్రబాబుతో కాదు.. జగన్ కానీయడు.. మరెట్లా?