https://oktelugu.com/

వైసీపీలో తిట్లే వారి పదవులకు మెట్లు?

నేతిబీరకాయలో నేతి ఉండదన్నది ఎంత నిజమో రాజకీయ నాయకులకు విలువలుండవనేది అంతే నిజం. నాయకుడు అంటే హుందాతనమే. దాన్ని చూసే జనం మర్యాద చేస్తారు. రానురాను రాజుగారి గుర్రం గాడిందయిందన్నట్లు మన నేతి విలువలకు శిలువ వేస్తున్నారు. మర్యాద అనేది మరిచిపోతున్నారు. ఫలితంగా తమ నోటి వెంట బూతు పురాణం వల్లె వేస్తున్నారు. తమ తప్పేమీ లేదన్నట్లు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భాషా ప్రయోగంలో సామాన్యుడిని దాటి పోతున్నారు. అసభ్య పదజాలంతో ఎదుటివారిని భయపెడుతున్నారు. గతంలో అసెంబ్లీలో ఎమ్మెల్యే […]

Written By: , Updated On : June 7, 2021 / 08:44 AM IST
Follow us on

YSRCP vs TDP

నేతిబీరకాయలో నేతి ఉండదన్నది ఎంత నిజమో రాజకీయ నాయకులకు విలువలుండవనేది అంతే నిజం. నాయకుడు అంటే హుందాతనమే. దాన్ని చూసే జనం మర్యాద చేస్తారు. రానురాను రాజుగారి గుర్రం గాడిందయిందన్నట్లు మన నేతి విలువలకు శిలువ వేస్తున్నారు. మర్యాద అనేది మరిచిపోతున్నారు. ఫలితంగా తమ నోటి వెంట బూతు పురాణం వల్లె వేస్తున్నారు. తమ తప్పేమీ లేదన్నట్లు తప్పించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. భాషా ప్రయోగంలో సామాన్యుడిని దాటి పోతున్నారు. అసభ్య పదజాలంతో ఎదుటివారిని భయపెడుతున్నారు.

గతంలో అసెంబ్లీలో ఎమ్మెల్యే జోగి రమేశ్ ఎంపీ రఘురామను విమర్శించిన తీరు చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఆయన అసభ్య పదజాలం వింటే మనకే అసహ్యం వేస్తుంది. అలాంటిది ఆయనను సీఎం జగన్ ఏమీ అనలేదు. పైగా ఆయన ఆవేశంలో అర్థం ఉంది అని వకాల్తా పుచ్చుకున్నారు. ఇదంతా చూస్తుంటే సీఎం సమక్షంలోనే జరుగుతున్నా పట్టించుకోవడం లేదన్నది స్పష్టం అవుతోంది. తిట్ల పురాణం అందుకుంటే సభా మర్యాదు ఏం కావాలి? అని సగటు పౌరుడి ఆవేదన. నాయకులే ఇలాఉంటే ఇక ప్రజలెలా ఉంటారన్నదే పాయింట్.

ఎమ్మెల్యే జోగి రమేశ్ రఘురామను విమర్శించిన తరువాత తన ప్రసంగంలో అసభ్య పదజాలం ఉంటే తొలగించాలని స్పీకర్ ను కోరారు. మొదట తిట్టటడం ఎందుకు తరువాత తీసేమనడం ఎందుకని పలువురు ప్రశ్నిస్తున్నారు. సభా మర్యాద పాటించని వారిని సభ నుంచే బహిష్కరించడం సబబు. కానీ ముఖ్యమంత్రి సైతం ఆయన మాటలకు మద్దతు పలకడం సంచలనం. ఆయన ఆవేదనో నిజాయితీ ఉందని మాట్లాడడం అవివేకం. ఎమ్మెల్యేల చేత బూతులు మాట్లాడిస్తున్న జగన్ భారీ మూల్యం చెల్లించుకుంటారని పలువురు చెబుతున్నారు.

ఎవరు ఎక్కువగా విపక్షం మీద విరుచుకుపడితే వారికి మంత్రి పదవి ఇస్తారనే టాక్ వినిపిస్తోంది. దీంతో నాయకులు మంచి మాటలు మరిచిపోయి తిట్ల దండకాన్నే జపిస్తున్నారని తెలుస్తోంది. జగన్ మెప్పుకోసం దిగజారి మాట్లాడడం చూస్తుంటే అదే నిజమనిపిస్తోంది. టీడీపీ నేతలను తమ ఇష్టం వచ్చినట్లుగా వైసీపీ నేతలు తిడుతున్నారు. నోరుంది కదాని బూతులతోనే కాలం గడుపుతున్నారు. అధినేత ప్రాపకం కోసం తమ నైతికతను పాతరేస్తున్నారు. దీంతో వారి మనుగడ కష్టమేనని నిపుణులు చెబుతున్నారు.