TRS MLC: ఎమ్మెల్సీ ఎన్నికల కోసం సీఎం కేసీఆర్ కసరత్తు చేస్తున్నారు. అభ్యర్థుల ఎంపిక ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో ఈరోజే చివరి రోజు కావడంతో అటు అభ్యర్థుల్లో ఇటు ప్రభుత్వంలో అలజడి కలుగుతోంది. ప్రభుత్వ నిర్ణయంపై అందరిలో ఆశలు రేకెత్తుతున్నాయి. సోమవారం అర్థరాత్రి వరకు మంతనాలు జరిపినా అభ్యర్థుల ఎంపికపై స్పష్టత కానరావడం లేదు. దీంతో ఆశావహుల్లో సైతం ఆందోళన పుట్టిస్తోంది. తమకు బెర్త్ ఖరారవుతుందో లేదో అనే అనుమానాలు వస్తున్నాయి.

గుత్తా సుఖేందర్ రెడ్డి, కడియం శ్రీహరి, తక్కళ్లపల్లి రవీందర్ రావు, కౌశిక్ రెడ్డి, కోటిరెడ్డి, ఆకుల లలిత, ఎర్రోళ్ల శ్రీనివాస్, మధుసూదనచారి పేర్లు పరిశీలించారు. సుదీర్ఘంగా చర్చించినా ఒకటి రెండు స్థానాలపై మార్పులు చేసినట్లు తెలుస్తోంది. కానీ ఇంతవరకు ఏకాభిప్రాయం కుదరలేదు. దీంతో గవర్నర్ కోటాలో సిద్దిపేట మాజీ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి పేరు సైతం పరిశీలించినట్లు సమాచారం.
వడపోత అనంతరం అభ్యర్థుల ప్రకటన వెలువడే అవకాశం కనిపిస్తోంది. దీంతో కేసీఆర్ అభ్యర్థుల ఎంపికను ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్లు సమాచారం. కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్, మంత్రులు హరీశ్ రావు, ప్రశాంత్ రెడ్డి, ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్ తదితరుల సమక్షంలో అభ్యర్థుల ఎంపికపై చర్చించినట్లు తెలుస్తోంది.
ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికల కోసం నామినేషన్ల గడువు మంగళవారంతో ముగియనుండటంతో అభ్యర్థుల్లో టెన్షన్ పట్టుకుంది. ఈనెల 29న ఎన్నికలు నిర్వహించి అదే రోజు లెక్కిస్తారు. స్థానిక సంస్థల కోటాలో 12 స్థానాలకు మంగళవారం నుంచి 23 వరకు నామినేషన్ల ప్రక్రియ జరగనుంది. డిసెంబర్ 10న పోలింగ్ నిర్వహించి లెక్కింపు చేపట్టనున్నారు.
Also Read: తెలంగాణ లో రాజకీయాలు బీజేపీ vs టీఆర్ఎస్