Prakash Raj: విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ గురించి కొత్తగా పరిచయం చేయాల్సిన అవసరం లేదని చెప్పాలి. గత కొంత కాలం ముందు వరకు మూవీ ఆర్టిస్టు అసోసియేషన్ ఎన్నికల్లో బిజీగా ఉన్న ప్రకాశ్ రాజ్ ఇప్పుడు సినిమాల్లో బిజీ అవుతూ ఉన్నారు. ‘మా’ ఎన్నికల్లో అధ్యక్ష పదవి కోసం పోటీ చేసిన ప్రకాష్ రాజ్ మంచు విష్ణుపై ఓడిపోయారు. కాగా రెండు నెలల క్రితం ఓ తమిళ సినిమా షూటింగ్ లో ప్రకాష్ రాజ్ యాక్సిడెంట్ కి గురయ్యారని అందరికీ తెలిసిందే.
అయితే ఆ ప్రమాదంలో ప్రకాశ్ రాజ్ చేతికి దెబ్బతగలడంతో హైదరాబాద్ లోనే సర్జరీ చేయించుకున్నారు. అప్పటి నుంచి తన హెల్త్ కండిషన్ గురించి అభిమానులకు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తూ ఉన్నారు. ‘మా’ ఎన్నికల హడావుడిలో బిజీగా ఉన్న ప్రకాశ్ రాజ్ తాజాగా మరోసారి ఆరోగ్య పరీక్షలు చేయించుకున్నారు. ఈ మేరకు తన ఆరోగ్య పరిస్థితిపై అప్ డేట్ చేస్తూ ట్వీట్ చేశారు.
Had a complete check up with the doctors.. I’m rocking .. only my vocal chords need complete rest for a week. So “Mouna vratha “ .. will bask in silence..Bliss
— Prakash Raj (@prakashraaj) November 15, 2021
అయితే ఇప్పుడు తాజాగా తాను పూర్తిగా కోలుకున్నట్లు వైద్యులు తెలిపారని ప్రకాష్ రాజ్ వెల్లడించారు. కానీ వారం రోజుల పాటు మౌనవ్రతం పాటించాల్సి ఉందని తెలుపుతూ ఒక పోస్ట్ చేశారు. ఆ పోస్ట్ లో ”డాక్టర్స్ వద్ద కంప్లీట్ హెల్త్ చెకప్ చేయించుకున్నాను. ఐయామ్ రాకింగ్. అయితే వోకల్ కార్డ్స్ కి మాత్రం ఓ వారంపాటు విశ్రాంతి అవసరం. అందుకే మౌనవ్రతం చేయబోతున్నా. మౌనం ఆనందాన్ని ఇస్తుంది” అని ప్రకాష్ రాజ్ ట్వీట్ చేశారు. ప్రస్తుతం పలు సినిమాలతో బిజీగా ఉన్న ప్రకాశ్ రాజ్… ఇటీవల ‘జై భీమ్’, ‘పెద్దన్న’ చిత్రాల్లో నటించి ప్రేక్షకులను అలరించాడు.
Sekhar is an Manager, He is Working from Past 6 Years in this Organization, He Covers News on Telugu Cinema Updates and Looks after the overall Content Management.
Read MoreWeb Title: Actor prakash raj sensational tweet about his health condition
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com