https://oktelugu.com/

ఆ 30 మంది ఎమ్మెల్యేలు ఎవరు..? టీఆర్‌‌ఎస్‌లో షివరింగ్‌

బీజేపీ తెలంగాణ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ కుమార్‌‌ మైకు పట్టుకున్నప్పుడల్లా తమతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ చెబుతున్నారు. దీంతో టీఆర్‌‌ఎస్‌ అధిష్టానానికి ముచ్చెమటలు పడుతున్నాయి. రాజకీయాల్లో ఒక్కోసారి ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయనేది ఎంత వాస్తవమో.. ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌ పరిస్థితీ అలానే ఉంది. మొన్నటివరకు ఏకఛత్రాధిపత్యంతో ఏలిన టీఆర్‌‌ఎస్‌కు బీజేపీ నుంచి అనూహ్య షాక్‌ ఎదురైంది. రాష్ట్రంలో పరిస్థితులు ఎప్పుడూ తమకు అనుకూలంగానే ఉంటాయని, తమకు ఎదురు లేదని, తాము తప్ప ఇంకెవరు […]

Written By:
  • Srinivas
  • , Updated On : January 4, 2021 1:05 pm
    Bandi Sanjay
    Follow us on

    Bandi Sanjay and KCR
    బీజేపీ తెలంగాణ స్టేట్‌ చీఫ్‌ బండి సంజయ్‌ కుమార్‌‌ మైకు పట్టుకున్నప్పుడల్లా తమతో 30 మంది ఎమ్మెల్యేలు టచ్‌లో ఉన్నారంటూ చెబుతున్నారు. దీంతో టీఆర్‌‌ఎస్‌ అధిష్టానానికి ముచ్చెమటలు పడుతున్నాయి. రాజకీయాల్లో ఒక్కోసారి ఓడలు బండ్లు.. బండ్లు ఓడలవుతాయనేది ఎంత వాస్తవమో.. ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌ పరిస్థితీ అలానే ఉంది. మొన్నటివరకు ఏకఛత్రాధిపత్యంతో ఏలిన టీఆర్‌‌ఎస్‌కు బీజేపీ నుంచి అనూహ్య షాక్‌ ఎదురైంది.

    రాష్ట్రంలో పరిస్థితులు ఎప్పుడూ తమకు అనుకూలంగానే ఉంటాయని, తమకు ఎదురు లేదని, తాము తప్ప ఇంకెవరు అధికారం సాధించలేరని, ఇలా ఎన్నో ఊహించుకుంటూ ముందుకు వెళ్తున్న తెలంగాణ అధికార పార్టీ టీఆర్ఎస్‌కు ఇప్పుడు చోటు చేసుకుంటున్న పరిణామాలు కోలుకోకుండా చేస్తున్నాయి. ఒకవైపు ప్రజల్లో ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత, మరోవైపు రాజకీయ ప్రత్యర్థులు రోజురోజుకూ బలం పెంచుకుంటూ సవాలు విసిరే స్థాయికి ఎదగడం, ఇవన్నీ టీఆర్ఎస్‌ను ఆందోళనకు గురిచేస్తున్నాయి. ముఖ్యంగా బీజేపీ తెలంగాణలో బలపడుతున్న తీరుతో టీఆర్ఎస్‌కు రాబోయే ఎన్నికల్లో భారీ నష్టం తప్పదనే విషయం స్పష్టమవుతోంది.

    Also Read: అన్నదమ్ముల సవాల్.. కోమటిరెడ్డి వర్సెస్ కోమటిరెడ్డి..!

    ఇప్పుడు రాష్ట్రంలో టీఆర్‌‌ఎస్‌ వ్యూహాలన్నింటికీ బీజేపీ చెక్‌ పెడుతోంది. తన రాజకీయ వ్యూహాలను రోజురోజుకూ వినూత్నంగా అమలు చేస్తోంది. అందుకే.. టీఆర్‌‌ఎస్‌కు చెందిన కీలక నాయకులు, అసంతృప్త నేతలను గుర్తించి బీజేపీలో చేర్చుకునేందుకు వ్యూహానికి తెరతీసింది. ఇప్పటికే కొంతమంది టీఆర్ఎస్‌లో చేరిపోగా, మరెంతో మంది చేరేందుకు సిద్ధంగా ఉన్నారంటూ చెబుతోంది. ఇటీవల జరిగిన గ్రేటర్ ఎన్నికల్లో టీఆర్ఎస్ నుంచి గెలిచిన కార్పొరేటర్లు తమతో నడిచేందుకు సిద్ధంగా ఉన్నారంటూ బండి సంజయ్ వ్యాఖ్యానించిన తర్వాత, కొంతమంది టీఆర్ఎస్ నాయకులు బీజేపీలో చేరడం చర్చనీయాంశంగా మారింది . అదీ కాకుండా టీఆర్ఎస్‌కు చెందిన 30 మంది ఎమ్మెల్యేలు తమతో టచ్‌లో ఉన్నారంటూ సంజయ్ వ్యాఖ్యానించడం కలకలం సృష్టిస్తోంది.

    Also Read: కేసీఆర్ మాట విన్నందుకు ‘ఫలితం’ అనుభవిస్తున్నారా?

    అయితే.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు సంజయ్‌ ఏ వ్యాఖ్యలు చేసినా అవి ఆషామాషీ కాదు. తనకు బలమైన సమాచారం ఉంటే తప్ప మాట్లాడరు అనేది టాక్‌. అందుకే.. సంజయ్‌ మాట్లాడిన వ్యాఖ్యలు ఇప్పుడు టీఆర్‌‌ఎస్‌ గుబులు పుట్టిస్తున్నాయి. అంతేకాదు.. ఖచ్చితంగా కొంతమంది ఎమ్మెల్యేలు బీజేపీలో చేరేందుకు వ్యూహం పన్నుతున్నారని కేసీఆర్‌‌కు సైతం సమాచారం ఉందట. ఇప్పటికే పార్టీకి చెందిన కీలక నాయకులు, ఎమ్మెల్యేలపైన నిఘా పెట్టినట్లు ప్రచారం జరుగుతోంది. మరీ ముఖ్యంగా ఆ 30 మంది ఎమ్మెల్యేలు ఎవరా అని ఆరా తీస్తున్నారట గులాబీ బాస్.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్