Nitish Kumar: మీరు విక్రమార్కుడు సినిమా చూశారా!? అందులో చంబల్ ప్రాంతాన్ని ఒకతను ఏలుతూ ఉంటాడు. అతనికి తగ్గట్టుగానే ఒక సోదరుడు ఉంటాడు. అన్న కంటే పది ఆకులు ఎక్కువే చదివి ప్రజలను హింసిస్తూ ఉంటాడు. వీరిని సంహరించేందుకు ఓ పోలీస్ అధికారి వస్తాడు. ఇలాంటి స్టోరీ బీహార్లో ఒకప్పుడు జరిగింది. చంబల్ లాంటి ప్రాంతాలు బీహార్లో కోకొల్లలు. అలాంటి వారి ఆట కట్టించేందుకు పోలీసులకు చాలా సమయం పట్టింది. మొన్నటిదాకా బీహార్లో ప్రశాంత వాతావరణం ఉండేది. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని దశాబ్దాల క్రితం చూసిన ఆటవిక రాజ్యాన్ని ఇప్పుడు ప్రజలకు మళ్లీ పరిచయం చేసే బాధ్యతను నితీష్ కుమార్, తేజస్వి యాదవ్ తలకు ఎత్తుకున్నారు. ఏంటి ఒక్కసారి అంత పెద్ద మాట అన్నారు అని అనుకుంటున్నారా?! అయితే ఈ కథనం ఒక్కసారి చదవండి.

ప్రయాణికుల రూపంలో వచ్చి..
ట్రైన్ నెంబర్ 12274 న్యూ ఢిల్లీ –హౌరా దురంతో ఎక్స్ప్రెస్ మీద దొంగల దాడి చేశారు. బీహార్ లోని నితీశ్ కుమార్, లాలూప్రసాద్ యాదవ్ ల సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడి మూడు నెలలు అయిందో లేదో మొదటి ఫలితాన్ని చవి చూశారు ఢిల్లీ , బెంగాల్ ప్రజలు. ఎప్పుడో 90 వ దశకం మొదట్లో బీహార్ లో రైలు దోపిడీ ఘటనలు తరుచూ జరిగినట్లు వార్తా పత్రికలలో చదివేవాళ్ళం ! 30 సంవత్సరాల తరువాత అదే తరహా రైలు దోపిడీ ఘటన ని మళ్ళీ చూస్తున్నాం ! లాలూ ప్రసాద్ యాదవ్ ప్రభుత్వం లో భాగస్వామి కాగానే జరిగిన మొదటి ఘటన ఇది. ఇక మీదట అప్పటిలాగానే మళ్ళీ తరుచూ చూస్తామేమో!
గత ఆదివారం రాత్రి 2 గంటలకు న్యూ ఢిల్లీ నుంచి కలకత్తా కి వెళుతున్న 12274 దురంతో ఎక్స్ప్రెస్ ని దోపిడీ దొంగలు రైలుని ఆపి ప్రయాణీకులని దోచుకొని పారిపోయారు ! ఈ సంఘటన బీహార్ లోని ఖుష్రుపూర్, మంజ్ హౌలీ స్టేషన్ల మధ్య జరిగింది. ఈ ప్రాంతం ఈస్ట్ సెంట్రల్ రైల్వే లోని దానాపూర్ డివిజన్ కిందకి వస్తుంది.
ఈ దోపిడీ ఘటనలో ప్రయాణీకులు ఎవరూ గాయపడలేదు కానీ నగదు,బంగారం దోచుకొని వెళ్లిపోయారు. దానాపూర్ డివిజన్ సీనియర్ కమాండెంట్ ప్రకాష్ కుమార్ పాండా మాట్లాడుతూ నలుగురు ప్రయాణీకులు తమ డబ్బు,బంగారం దుండగులు దోచుకున్నట్లు ఫిర్యాదు చేశారని తెలిపారు. దొంగలని పట్టుకోవడానికి ప్రత్యేక ఆర్ పీ ఎఫ్ టీం ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు.
లాలూప్రసాద్ యాదవ్ హయాంలో వ్యవస్థీకృత లేదా కో & ఆర్డినేటెడ్ క్రైమ్స్ ఎక్కువగా జరిగేవి. అప్పట్లో లాలూ బీహార్ ని జంగ్లీ రాజ్ అని ముద్దుగా పిలిచేవారు.
దొంగలు,దోపిడీ దారులు, రైల్వే పోలీస్ అధికారులు, రైల్వే స్టేషన్ల లో ఉండే గవర్నమెంట్ రైల్వే పోలీస్ అధికారులు, రాజకీయ నాయకులు కలిసి ఉమ్మడిగా నేరాలకి పాల్పడే వాళ్ళు. దొంగలు ఎవరో రైల్వే పోలీసులకి తెలుసు. అలాగే ఆయా రైల్వే స్టేషన్ల లో ఉండే గవర్నమెంట్ రైల్వే పోలీసులకి తెలుసు. కానీ దోపిడీలు మాత్రం అంతా కలిసి ప్లాన్ చేసి చేసేవాళ్ళు. వీళ్ళు వాటాలు పంచేది ఆర్జేడీ నాయకులకి కాబట్టి ఉద్యోగాలు పోవడం లేదా సస్పెండ్ అవడం లాంటివి జరగవు.

ఆదివారం న్యూ ఢిల్లీ – కలకత్తా దురంతో ఎక్స్ప్రెస్ దోపిడీ కూడా ఇలా ఆర్గనైజేడ్ గా జరిగిందే! రైలు పాట్నా కి చేరుకోగానే.. దొంగలు పాట్నా లోనే రైలు లోకి ఎక్కారు ప్రయాణీకుల లాగా ! సరిగ్గా రాత్రి 2 గంటలకి రైలు ఖుష్రుపూర్, మంజ్ హౌలీ స్టేషన్ల మధ్య ప్రాంతానికి చేరుకోగానే దొంగలు చైన్ లాగి రైలుని ఆపారు. దానికి ముందే రెండు కంపార్ట్మెంట్ లలో ఉన్న ప్రయాణీకులని దోచుకున్నారు కత్తులు,నాటుతుపాకులు చూపించి! ట్రైన్ ఆగగానే చీకటిలో పారిపోయారు ! దురంతో ఎక్స్ప్రెస్ లో బాగా డబ్బున్న ప్రయాణీకులు ఏ కోచ్ లలో ఉన్నారో ముందు ఒక టీమ్ రెక్కీ చేసింది ప్రయాణీకుల లాగా ! వాళ్ళు పాట్నాలో దిగిపోయారు తమ వాళ్ళకి మొబైల్ ఫోన్లలో కోచ్ వివరాలు ఇచ్చేసి ! దొంగలకి ఆర్ పీ ఎఫ్ జవాన్లు ఎక్కడ షిఫ్ట్ మారతారో సమాచారం ఉంది కాబట్టి పాట్నా లో దిగిపోయిన ఆర్ పీ ఎఫ్ జవాన్లు మళ్ళీ కొత్త వాళ్ళు డ్యూటీలో లోకి వచ్చేది పాట్నా తరువాతి స్టేషన్ లో కాబట్టి రైల్లో ఎవరూ ఉండరు. ఇదంతా ప్లాన్ ప్రకారమే జరిగింది.
90వ దశకంలో..
90 వ దశకంలో మొబైల్ ఫోన్లు లేవు కానీ ఆర్ పీ ఎఫ్, జీ ఆర్ పీ అధికారుల నుంచి సమాచారం సేకరించి ఏ స్టేషన్ల మధ్య పోలీసులు ఉండరో ముందే సమాచారం తీసుకొని ప్లాన్ ని అమలుచేసి దోపిడీలు, హత్యలు కూడా చేసి దోచుకునేవారు. వీళ్ళు ఎప్పటికీ దొరికేవాళ్ళు కారు. లాలూ ప్రసాద్ అధికారం కోల్పోయి నితీశ్ కుమార్ ముఖ్యమంత్రిగా వచ్చిన తరువాత క్రమేపీ రైళ్ల దోపిడీలు తగ్గిపోయాయి.
నితీశ్ కుమార్ ఢిల్లీ లో రాజకీయాలు చేయడానికి గాను అధికారం లాలూ కొడుకు తేజస్వి ప్రకాష్ యాదవ్ కు అప్పచెప్పి తాను ప్రధాన మంత్రి పదవికి పోటీలో ఉండాలని చూస్తున్నాడు. ఇప్పటికే తేజస్వి ప్రకాష్ యాదవ్ ముఖ్యమంత్రి అనేలా ప్రచారం జరుగుతున్న వేళ రైలు దోపిడీ ఒక చిన్న ప్రకటన లాంటిది టీవి లో వచ్చే సినిమాకి ముందు !లాలూ గ్యాంగ్ మళ్ళీ వసూళ్లు మొదలుపెట్టేశారు ! వీళ్ళు దేనినీ,ఎవరినీ వదలరు! లా అండ్ ఆర్డర్ అనేది కేవలం కాగితాల మీద మాత్రమే ఉంటుంది ! ఈ నితీశ్ కుమార్ ప్రధానమంత్రి అవడు తిరిగి బీహార్ వచ్చేసరికి ముఖ్యమంత్రి పదవీ ఉండదు ! వచ్చిన అవకాశాన్ని లాలూ ప్రసాద్ కొడుకులు వదులుకోరు! ప్రశాంతంగా ఉంది అనుకున్న బీహార్ ని మళ్ళీ ఆటవిక రాజ్యంగా మార్చడంలో లాలూ ప్రసాద్ విజయం సాధిస్తాడు.