Chalaki Chanti: బిగ్ బాస్ హౌస్ లో చలాకీ చంటి జర్నీ త్వరగానే ముగిసింది. టాప్ సెలబ్రెటీలలో ఒకడిగా షోకి వెళ్లిన చంటి హౌస్లో చెడుగుడు ఆడేస్తాడని అందరూ అనుకున్నారు. అయితే చంటి అంచనాలు అందుకోలేకపోయారు. జబర్దస్త్ షోలో చంటి చూపించి ఎనర్జీ బిగ్ బాస్ హౌస్లో కనిపించలేదు. హౌస్లో ఉండాలంటే కాంట్రవర్సీ క్రియేట్ చేయాలి లేదంటే ఫుల్ గా ఎంటర్టైన్ చేయాలి. వయసులో పెద్దవాడిగా ఇంటి సభ్యులతో ఆయన సత్సంబంధాలు కొనసాగించారు. బిగ్ బాస్ హౌస్ వాతావరణం, నిర్వహిస్తున్న గేమ్స్, టాస్క్స్ చంటికి సెట్ కాలేదు. ఏది ఏమైనా ఐదవ వారం చంటి ఇంటిని వీడటం జరిగింది.

కాగా తాజా ఇంటర్వ్యూలో చంటి బిగ్ బాస్ షో గురించి అనేక ఆసక్తికర విషయాలు తెలియజేశారు. అదే సమయంలో జబర్దస్త్ కమెడియన్స్ తనకు ఎలాంటి సపోర్ట్ ఇవ్వలేదని ఆయన బాధపడ్డారు. జబర్దస్త్ వాళ్ళలో కొందరు చిన్న చిన్న సహాయాలు చేశారు. అయితే నేను నమ్మిన వాళ్ళు నా అనుకున్న వాళ్ళు మోసం చేశారు. వీడు బిగ్ బాస్ షోకి వెళ్ళాడు, త్వరగా తిరిగొచ్చేస్తాడని కామెంట్ చేశారు. సమయం వచ్చినప్పుడు ప్రూఫ్స్ సహా బయటపెట్టి కడిగిపారేస్తాను అన్నాడు.
హౌస్ మేట్స్ లో రేవంత్, గీతూ, కీర్తి అంటే చంటి ఏమాత్రం ఇష్టం లేదు. గీతూ గురించి మాట్లాడుతూ.. మొదటివారం ఆమె చేసిన ఓ మిస్టేక్ గురించి చెప్పినందుకు గీతూతో నాకు గ్యాప్ వచ్చిందన్నారు. ఇక రేవంత్, కీర్తి గురించి చంటి మాట్లాడటానికి కూడా ఇష్టపడలేదు. అసహనంగా ఇంటర్వ్యూ నుండి లేచి వెళ్ళిపోయాడు. కెప్టెన్ గా ఉన్న కీర్తి చంటిని సీజన్ మొత్తం కెప్టెన్ కాకుండా చేసింది. కీర్తి కెమెరా కోసం పని చేస్తుందని చంటి అన్నాడని ఆమెకు ఒకరు చెప్పారు.

చంటి ఏ అర్థంలో ఆ మాట అన్నాడో తెలుసుకోకుండా కీర్తి చంటికి పెద్ద శిక్ష వేయడం జరిగింది. అక్కడ నుండి చంటి పెర్ఫార్మన్స్ మరింత దిగజారింది. అతడు గేమ్ పట్ల ఆసక్తి చూపడం తగ్గించేశాడు. ఇక ఐదు వారాలున్న చంటి రూ. 5 లక్షల నుండి 7 లక్షల వరకు పారితోషికంగా తీసుకున్నట్లు సమాచారం. అదే సమయంలో ఇకపై చంటి జబర్దస్త్ లో కనిపించకపోవచ్చు. జబర్దస్త్ వాళ్ళు తిరిగి రావడానికి అంగీకరించినా స్టార్ మా అగ్రిమెంట్ ప్రకారం ఒక ఏడాది కాలం వరకు ఇతర ఛానల్స్ లో షోస్ చేయడానికి వీలుండదు.