KCR BRS: తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత చంద్రశేఖర్ రావు మూడో కూటమి ఏర్పాట్లలో తలమునకలయ్యారు. పార్టీని విస్తరించే పనిలో పడిపోయారు. ఇప్పటికే నిన్న దసరా సందర్భంగా పార్టీ పేరును ప్రకటించిన ఆయన ఇక కదనరంగంలో దూకాలని చూస్తున్నారు. పార్టీని విస్తరించే క్రమంలో మన పక్కనే ఆనుకుని ఉన్న రాష్ట్రాల్లో తనదైన శైలిలో రాణించాలని చూస్తున్నారు. నిజాం ప్రభుత్వంలో మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీలో కొన్ని ప్రాంతాలు ఉండటంతో కేసీఆర్ వాటిని తమ ప్రాంతాలుగానే పరిగణిస్తున్నారు. దీంతో ఇక్కడి నుంచే తన ప్రభావం చూపించాలని తాపత్రయ పడుతున్నారు.

నిజాం ప్రభుత్వంలో కర్ణాటకలోని గుల్బార్గా, మహారాష్ట్రలోని కొన్ని ప్రాంతాలు నాందేడ్ వంటివి ఇందులోకి వస్తాయి. దీంతో అవి పూర్వం తమ భూభాగాలే అనే ఉద్దేశంతో ఇక్కడ ప్రతిష్ట చూపించుకోవాలని చూస్తున్నారు. దీనికి గాను అక్కడి ప్రజలను తమకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తున్నారు. భారత రాష్ట్ర సమితి(బీఆర్ఎస్) ముందుగా ఇక్కడి నుంచే విస్తరించాలని ఆలోచిస్తున్నారు. ఇందుకోసం ఇక్కడ ప్రజలపై ఫోకస్ చేసినట్లు చెబుతున్నారు. బీఆర్ఎస్ పార్టీతో దేశవ్యాప్తంగా తమ ప్రభావం చూపించాలని ఆరాటపడుతున్నారు.
Also Read: KCR National Party : కొత్త పార్టీ పెట్టాలంటే కేసీఆర్ ఏమి చేయాలి?
మరోవైపు బీఆర్ఎస్ పార్టీ ప్రకటనతో టీఆర్ఎస్ వర్గాల్లో హర్షం వ్యక్తం అవుతోంది. ఇప్పటికే దేశ్ కీ నేత కేసీఆర్ అంటూ నినాదాలు చేస్తున్నారు. భవిష్యత్ లో భావి భారత ప్రధానమంత్రి అని చెబుతున్నారు. దీంతో తెలంగాణ పథకాలను అక్కడ అమలు చేయాలని భావిస్తున్నారు. కర్ణాటకలో కొందరు తెలంగాణ పథకాలకు ఆకర్షితులై ఇక్కడ చేరతామని గతంలో చెప్పడంతో కేసీఆర్ ఉత్సాహం పెరుగుతోంది. ఈ ప్రాంతాలను తమకు అనుకూలంగా మలుచుకుని తరువాత ఉత్తరాదిపై పట్టు సాధించాలని చూేస్తున్నారని చెబుతున్నారు.
బీఆర్ఎస్ పార్టీని విస్తరించే క్రమంలో ముందు చుట్టుపక్కల రాష్ట్రాలైన కర్ణాటక, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ లపై గురిపెట్టినట్లు చెబుతున్నారు. ఇందులో రెండు బీజేపీ పాలిత రాష్ట్రాలు కాగా (కర్ణాటక, మహారాష్ట్ర), ఒకటి బీజేపీయేతర రాష్ట్రం (ఏపీ), కేసీఆర్ తన కొత్త పార్టీని దేశం నలుమూలల వ్యాపింపజేసేందుకు ఈ మూడు రాష్ట్రాల నుంచే ముందుకెళ్లాలని నిర్ణయించుకున్నారు. ముందు పక్క రాష్ట్రాల్లో బలం చూపించుకుని తరువాత దేశం మొత్తం విస్తరించే చర్యలకు ఉపక్రమించాలని అనుకుంటున్నారు. ఇందుకోసమే కేసీఆర్ రంగం సిద్ధం చేసుకున్నారు. దీనికి సంబంధించిన కార్యాచరణ ప్రణాళిక అమలు చేయనున్నారు. దీనికి గాను పటిష్ట చర్యలు తీసుకునేందుకు పావులు కదుపుతున్నారు.

జాతీయ రాజకీయాల్లో తన పాత్ర పోషించాలని చూస్తున్నారు. బీజేపీయేతర ప్రభుత్వం కోసం ఇప్పటికే పలుమార్లు పలు రాష్ర్టాలు తిరిగి అందరి అభిప్రాయాలు సేకరించారు. మూడో కూటమి ఏర్పాటుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. పార్టీ పేరు ప్రకటించి తరువాత జెండా, ఎజెండా రూపకల్పనపై దృష్టి సారిస్తున్నారు. రైతుల సమస్యలే తమ లక్ష్యంగా ముందుకు కదులుతున్నారు. మహారాష్ట్ర, కర్ణాటక, ఏపీల తరువాత దేశవ్యాప్తంగా విస్తరించి అధికారం చేజిక్కించుకోవాలనే ఆలోచనతో ఉన్నారనే విషయం అర్థమవుతోంది.
Also Read:KCR BRS – Harish Rao: కేసీఆర్ బీఆర్ఎస్.. ఫ్లెక్సీల్లో ఎక్కడా కనపడని హరీష్ రావు ఫొటో?