దుర్గగుడిలో ఎన్ని వివాదాలు వచ్చినా ప్రభుత్వం పట్టించుకోలేదు. చివరికి రథం సింహాలు పోయినా పెద్దగా లెక్కలోకి తీసుకోలేదు. చివరికి ఎవరినో పట్టుకుని వెండి కరిగించేశారని.. కొంత వెండిని రికవరీ చూపించి.. ఛేదించామని పోలీసులు ప్రకటించారు. దాన్ని ప్రజలు నమ్మాల్సిన పరిస్థితే ఏర్పడింది. వాటి కంటే ముఖ్యంగా.. ఆలయంలోని ప్రతీ విభాగంలోనూ కమీషన్ల ప్రక్రియ నడుస్తోందన్న ఆరోపణలు ఉన్నాయి. మంత్రి వెల్లంపల్లికి దుర్గగుడిలో కొబ్బరికాయలు సేకరించే కాంట్రాక్ట్ ఉంది. అమ్మవారి ప్రసాదాల తయారీ, చీరల కౌంటర్లు, ప్రొవిజన్స్ స్టోర్, చీరల స్టోర్, డొనేషన్ కౌంటర్ ఇలా ప్రతీ విభాగంలోనూ రేట్లు ఫిక్సయ్యాయన్న ఆరోపణలు ఉన్నాయి.
Also Read: ఆ నేతలు మారరా..?: ఇలా అయితే బెజవాడలో గట్టెక్కేదెలా..?
ఇక్కడ అవినీతి అంతా బహిరంగ రహస్యమే. చాలా కాలంగా ప్రభుత్వానికి ఫిర్యాదులు వెళ్తున్నాయి. కానీ.. ఎప్పుడూ పట్టించుకోలేదు. అనూహ్యంగా కార్పొరేషన్ ఎన్నికల వేళ ఏసీబీ అధికారులు రెయిడ్ చేశారు. సుదీర్ఘంగా సోదాలు చేస్తున్నారు. అయితే.. ఇదంతా అవినీతిపై పోరాడుతున్నాం అనిచిత్రీకరించుకునే వ్యూహంలోభాగమనేనని.. అవినీతిలేదని పక్కన పెట్టేయడమో లేకపోతే.. అసలు పట్టించుకోకపోవడమో చేస్తారని కొంత మంది ఊహిస్తున్నారు.
విజయవాడ దుర్గ గుడిలో ఏసీబీ అధికారులు సుదీర్ఘసోదాలు జరిపారు. అన్ని డిపార్టుమెంట్లలోనూ అవినీతి జరిగిందన్నట్లుగా ఏసీబీ అధికారులు మీడియాకు లీకులు ఇచ్చారు. అంత వరకూ బాగానే ఉంది కానీ.. అసలు ఈ సోదాలన్నీ మంత్రి వెల్లంపల్లిని టార్గెట్ చేసి చేశారన్న చర్చ విజయవాడ వైసీపీలో జరుగుతోంది. వైసీపీ అధికారంలోకి రాగానే వెల్లంపల్లి దేవాదాయ మంత్రి అయ్యారు. వెంటనే.. ఈవోగా నియమించడానికి అవసరమైన స్థాయి క్యాడర్ కాకపోయినా సురేశ్ అనే అధికారిని తెచ్చి పెట్టారు.
Also Read: వారి ఆశలన్నీ గల్లంతే..!
అప్పట్నుంచి వెల్లంపల్లి ఏది చెబితే అదిచేయడమే సురేశ్ పనిగా చెబుతుంటారు. ఈ కారణంగా గుడి మొత్తాన్ని వెల్లంపల్లి అధీనంలోకి తీసుకుని పనులు చక్క బెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. అందుకే.. ఆయనపై ముందు నుంచి పలు ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. ఇక ఇప్పుడు తాజాగా వరుసగా సోదాలు నిర్వహిస్తుండడంతో ఏం జరుగుతోందోనని అందరికీ ఆసక్తికరంగా మారింది. వైసీపీలో మాత్రం.. మంత్రి వెల్లంపల్లికి గడ్డు పరిస్థితులు ప్రారంభమయ్యాయన్న చర్చ జరుగుతోంది.
మరిన్ని ఆంధ్ర రాజకీయ వార్తల కోసం ఏపీ పాలిటిక్స్