Homeఆంధ్రప్రదేశ్‌Keshineni Nani : కేశినేని నాని దారెటు?

Keshineni Nani : కేశినేని నాని దారెటు?

Keshineni Nani : కేశినేని నాని టిడిపికి దూరమయ్యారు. త్వరలో రాజీనామా చేస్తానని ప్రకటించారు. ఆయన కుమార్తె శ్వేత సైతం కార్పొరేటర్ పదవితో పాటు పార్టీకి రాజీనామా చేస్తారని తేల్చేశారు. అయితే ఆయన ఏ పార్టీలో చేరుతారన్నది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. వైసీపీలో చేరుతారా? లేకుంటే బీజేపీ నుంచి ఆహ్వానం ఉందా? ఇప్పుడు ఇదే హాట్ టాపిక్. కానీ నాని మాత్రం ఫిబ్రవరి వరకు ఆగాలని చెబుతుండడంతో.. సస్పెన్స్ కొనసాగుతోంది.

అయితే ఆయన బిజెపిలో చేరేందుకు మొగ్గు చూపుతారని ప్రచారం జరుగుతోంది. రెండోసారి గెలిచిన తర్వాత టిడిపి కంటే బిజెపి నేతలతోనే ఎక్కువ సాన్నిహిత్యం పెంచుకున్నారు. ఢిల్లీ రాజకీయాలు అంటే ఎక్కువగా ఆసక్తి చూపారు. గత ఎన్నికల్లో ఎంపీగా గెలిచిన వెంటనే కేంద్రమంత్రి నితిన్ గడ్కరిని కలిశారు. అప్పటికే టిడిపి, బిజెపిల మధ్య పప్పు, నిప్పులా వ్యవహారం ఉంది. ఆ సమయంలో నాని వ్యవహరించిన తీరుతో చంద్రబాబు కూడా ఇబ్బంది పడ్డారు. హర్ట్ అయ్యారు. అంతటితో ఆగకుండా కుటుంబ సమేతంగా ప్రధాని మోదీని కలిశారు. నిర్మలా సీతారామన్ తో సమావేశమయ్యారు. ఇలా ఏ విషయంలోనూ టిడిపి నాయకత్వానికి భయపడకుండా బీజేపీతో తన సన్నిహిత సంబంధాలను కొనసాగించారు. అందుకే ఇప్పుడు టిడిపికి దూరమైతే కచ్చితంగా నాని బిజెపిలో మాత్రమే చేరతారని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు వైసీపీ సైతం కేశినేని నాని కోసం ప్రయత్నిస్తోంది. కానీ నాని మనసంతా బీజేపీ వైపు ఉంది. ఆయన జాతీయ రాజకీయాలపైనే ఎక్కువ ఆసక్తి చూపుతున్నారు. పైగా తన మనస్తత్వానికి వైసీపీ సూట్ కాదని అనుచరుల వద్ద చెబుతున్నారు. బిజెపిలోకి వెళ్లడం ద్వారా స్వతంత్రంగా వ్యవహరించవచ్చని ఆలోచన చేస్తున్నారు. అయితే ఎన్నికల ముందే బిజెపిలో చేరాలా? లేకుంటే ఇండిపెండెంట్ గా పోటీ చేసి.. ఎంపీగా గెలుపొందిన తర్వాత చేరాలా? అని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ఆయన తప్పకుండా బిజెపిలో మాత్రమే చేరతారని.. అక్కడ తనకు కావలసిన నాయకులు సైతం ఉన్నారని.. కాషాయ దళం లోనే తనకు అనువుగా ఉంటుందని కేశినేని నాని ఒక స్థిర నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం. అయితే ఫిబ్రవరి వరకు అందుకు ఆగాల్సిందే.

NARESH
NARESHhttps://oktelugu.com/
Naresh Ennam is a Editor who has rich experience in Journalism and had worked with top Media Organizations.He has more than 19 years experience in Journalism. He has good Knowledge on political trends and can do wonderful analysis on current happenings on Cinema and Politics. He Contributes Politics, Cinema and General News.

Most Popular

loan charges : లోన్ తీసుకుంటున్నారా.. వడ్డీ రేటు మాత్రమే కాదు.. ముందుగా ఈ ఛార్జీల గురించి తెలుసుకోండి!

loan charges G అత్యవసర అవసరాలు, ఇల్లు కొనుగోలు ఇతర వ్యక్తిగత అవసరాల కోసం చాలామంది బ్యాంకులు, ఇతర ఆర్థిక సంస్థల నుంచి రుణాలు తీసుకుంటుంటారు. అయితే లోన్ తీసుకునే సమయంలో చాలామంది...

Infertility : 35 ఏళ్ల వయసు దాటిందా… అయితే ఇలా చేయండి..

Infertility : ప్రస్తుతం చాలా మంది దంపతులు సంతానలేమి సమస్యను ఎదుర్కొంటున్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ప్రకారం.. జీవితంలో ఏదో ఒక దశలో సుమారు ప్రతి ఆరుగురిలో ఒకరికి సంతానలేమి సమస్య...

Monsoon Cars : వర్షంతో రోడ్లు చెరువుల్లా ఉన్న పర్వాలేదు.. ఈ కార్లలో ప్రయాణం సురక్షితం.. ఎందుకంటే..

Monsoon Cars : ప్రస్తుతం కొన్ని ప్రాంతాల్లో వర్షాలు మొదలయ్యాయి. ఇలాంటి సమయంలో రహదారులు చెరువులను తలపిస్తుంటాయి. మోకాళ్ల లోతు నీటిలో సాధారణ హ్యాచ్‌బ్యాక్ లేదా సెడాన్ కార్లు నడపడం...

Revanth Reddy : మల్లారెడ్డిని మళ్లీ టార్గెట్ చేసిన రేవంత్ రెడ్డి..

ఇటీవల అందెశ్రీ సంస్మరణ సభ జరిగింది. ఆ సభకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చీఫ్ గెస్ట్ గా వచ్చారు. అందెశ్రీ గురించి మాట్లాడారు. ఆయనకు జరిగిన అన్యాయం గురించి ఏ కరువు పెట్టారు....

Kajal Aggarwal : బాలీవుడ్ లోకి వెళ్తే పనికిమాలిన పాత్రలే ఇస్తారు అంటూ కాజల్ అగర్వాల్ హాట్ కామెంట్స్..

Kajal Aggarwal : నేటి తరం యూత్ ఆడియన్స్ లో తిరుగులేని స్టార్ ఇమేజ్ ని సొంతం చేసుకున్న కాజల్ అగర్వాల్ , పెళ్లి తర్వాత తన సెకండ్ ఇన్నింగ్స్ ని చాలా...
Oktelugu Epaper
Exit mobile version