ap alchohol
ఈ కొత్త ఎక్సైజ్ విధానం వచ్చేనెల 1 నుంచి అమల్లోకి రానుంది. దీనిప్రకారం ఏపీ వ్యాప్తంగా ఉన్న 2,934 మద్యం షాపులు కూడా నడుస్తాయి. ప్రస్తుతం ఏపీలో ప్రభుత్వ ఆధ్వర్యంలోనే దుకాణాలు నడుస్తున్నాయి. ఇక ముందు కూడా అలాగే నడుస్తాయి. లిక్కర్ మాల్స్‌ను కూడా ప్రభుత్వమే నిర్వహించనుంది. పెద్ద పెద్ద దుకాణాలను అద్దెకు తీసుకుని వీటిని నిర్వహించే అవకాశం ఉంది. ఇప్పటివరకు మామూలు మద్యం దుకాణాల్లో పాపులర్ బ్రాండ్లను విక్రయించడం లేదు. దానికి కారణాలపై అనేక రకాల ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు లిక్కర్ మాల్స్ పెట్టాలనుకున్న ప్రభుత్వం అక్కడ మాత్రం అన్ని రకాల మద్యం అందుబాటులో ఉంచాలని భావిస్తున్నట్లుగా చెబుతున్నారు.
Also Read: జగన్ సంచలన నిర్ణయం… ఏపీ మహిళలకు శుభవార్త!
కరోనా విజృంభించినప్పటి నుంచి రాష్ట్ర ఆదాయం పూర్తిగా పడిపోయింది. ఇక ఆదాయం పెంచుకునే విషయం మీదే దృష్టి పెట్టిన జగన్ సర్కార్ తాజాగా ఈ నిర్ణయం చేసింది. లిక్కర్‌తోనే ఆదాయం పొందొచ్చని భావించింది.ఆదాయం పెంపులో భాగంగా ఎక్సైజ్ శాఖలోనూ భారీగా కసరత్తు జరిగింది. కోరుకున్న బ్రాండ్లు దొరకక రాష్ట్ర ఆదాయం కాస్త ఇతర రాష్ట్రాలకు వెళ్తోంది. అందుకే..ఇక్కడే ఖరీదైన మద్యం అమ్మితే ఆ ఆదాయం కూడా రాష్ట్రానికే వస్తుంది కదా అని అనుకుంటున్నారట. అలా చేయడం వల్ల ఇతర రాష్ట్రాల నుంచి స్మగ్లింగ్ కూడా ఆగిపోతుందని అంటున్నారు. ఒకటో తేదీ నుంచే లిక్కర్ మాల్స్ ప్రారంభమయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి.