Also Read: డిగ్రీ పూర్తి చేస్తే 50వేలు.. ఇంటర్ పాసైతే 25వేలు..
అలా తన వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరిస్తూ ముఖేశ్ అంబానీ కోట్లకు పడగలెత్తారు. అపర కుబేరుడిగా ఘనత సాధించారు. ప్రపంచ కుబేరుల్లో ఆరో స్థానంలో నిలిచారు. భారతదేశంలో అత్యంత ధనవంతుడిగానూ కొనసాగుతున్నారు. బడా వ్యాపార వేత్త.. బిలియనీర్‌గా ప్రఖ్యాతలు గడించిన అంబానీ ఫ్యామిలీ ఎంత లగ్జరీగా ఉంటుందో మన అందరికీ తెలిసిందే..
ముఖేశ్ అంబానీ బిజినెస్ వ్యవహారాల మాట అటుంచితే.. ఆయన తమ్ముడు అనిల్ అంబానీ పరిస్థితి మాత్రం ఘోరంగా తయారైంది. ఆయన పీకల్లోతు అప్పుల్లో కూరుకుపోయి.. ఆయన సొంత ఖర్చులు కూడా భార్యే భరించేస్థాయికి దిగజారాడట.. ఈ విషయం స్వయంగా అనిల్ అంబానీయే తెలిపాడు. అనిల్ అంబానీ తన ఆవేదనను కోర్టు ఎదుట బయటపెట్టాడు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టుకు హాజరైన అనిల్ అంబానీ అప్పులతో కంపెనీలన్నీ పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయాయని.. ఇప్పుడున్న పరిస్థితుల్లో తన ఖర్చులను సైతం నా భార్య భరిస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కోర్టుల్లో చట్టపరమైన ఖర్చుల కోసం 9 కోట్ల రూపాయల విలువైన ఆభరణాలను కూడా విక్రయించానని పేర్కొన్నాడు.
మూడు చైనా బ్యాంకులకు రుణాలు చెల్లించకపోవడంతో అనిల్ అంబానీ శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా లండన్లోని యుకే కోర్టుకు హాజరయ్యారు. అనిల్ అంబానీ యొక్క మొత్తం అప్పులు 716,917,681 డాలర్లు (రూ .5,281 కోట్లు) మేరకు పేరుకుపోయాయి. యుకే కోర్టుకు హాజరైన అనిల్ అంబానీ మాట్లాడుతూ ప్రస్తుతానికి తన వద్ద అప్పు చెల్లించడానికి ఏమీ లేదని వాపోయాడు.
Also Read: నిరుద్యోగులకు ప్రధాని మోదీ శుభవార్త..?
2012 లో అనిల్ అంబానీ తన రిలయన్స్ టెలికామ్ వ్యాపారం విస్తరణ కోసం మూడు చైనా బ్యాంకుల నుండి 700 మిలియన్ డాలర్ల రుణం తీసుకున్నాడు, దీనికి వ్యక్తిగత హామీ ఇచ్చాడు. ప్రస్తుతం రిలయన్స్ టెలికామ్ కంపెనీ దివాలా తీసింది. దీంతో అప్పులు తీర్చే మార్గం లేదు. ఆ బ్యాంకులు అంతర్జాతీయ కోర్టులను ఆశ్రయించడంతో అనిల్ అంబానీ విచారణను ఎదుర్కొంటున్నారు. అప్పు తీర్చడానికి తన వద్ద చిల్లి గవ్వా లేదని అనిల్ అంబానీ వాపోవడం దేశ పారిశ్రామికవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అపర కుబేరుడి నుంచి అత్యంత అప్పుల్లోకి అనిల్ అంబానీ మారిన వైనం అందరినీ దిగ్భ్రాంతికి గురిచేస్తోంది.