కరోనా వైరస్ పుట్టుక ఎక్కడ?

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ పుట్టుకకు కారణాలేంటి? దాని పుట్టు పూర్తోత్తరాలపై స్పష్టత కనిపించడం లేదు. వూహాన్ ల్యాబ్ లో చైనా కరోనా వైరస్ వ్యాప్తి చేసిందని ప్రపంచం కోడై కూస్తున్నా చైనా మాత్రం తనకు సంబంధం లేదని బుకాయిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని వుహాన్ వైరస్ అని అభివర్ణించారు. అయితే ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవని శాస్ర్తవేత్తలతోపాటు అమెరికా గూఢచారి సంస్థలు చెప్పాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టలేక ట్రంప్ ఓడిపోయిన సంగతి […]

Written By: NARESH, Updated On : May 21, 2021 11:13 am
Follow us on

ప్రపంచాన్ని భయపెడుతున్న కరోనా వైరస్ పుట్టుకకు కారణాలేంటి? దాని పుట్టు పూర్తోత్తరాలపై స్పష్టత కనిపించడం లేదు. వూహాన్ ల్యాబ్ లో చైనా కరోనా వైరస్ వ్యాప్తి చేసిందని ప్రపంచం కోడై కూస్తున్నా చైనా మాత్రం తనకు సంబంధం లేదని బుకాయిస్తోంది. అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ దీన్ని వుహాన్ వైరస్ అని అభివర్ణించారు. అయితే ఆయన ఆరోపణలకు ఆధారాలు లేవని శాస్ర్తవేత్తలతోపాటు అమెరికా గూఢచారి సంస్థలు చెప్పాయి. వైరస్ వ్యాప్తిని అరికట్టలేక ట్రంప్ ఓడిపోయిన సంగతి తెలిసిందే. కరోనా వైరస్ ను జీవాయుధంగా మార్చడానికి అయిదేళ్ల క్రితమే ప్రయత్నించారంటూ ది ఆస్ర్టేలియన్ అనే పత్రిక కథనాన్ని ప్రచురించింది.

చైనా సైన్యానికి చెందిన ఇద్దరు శాస్ర్తవేత్తలు 2015లో ప్రచురించిన పరిశోధనాత్మక విలేకరి షారీ మార్క్ సన్ రాసిన ఒక పుస్తకంలోని భాగాలను ప్రచురించింది. 1950 నాటి నాటి కొరియా యుద్ధంలో అమెరికా తమపై జీవాస్ర్తాలు ప్రయోగించిందని చైనీయుల విశ్వాసం. ఇటీవల కాలంలో చైనా, ఆస్ర్టేలియా మధ్య వాణిజ్య యుద్ధం నడుస్తోంది.

అమెరికాపై తోసేసేందుకే..
కరోనా వైరస్ పుట్టుకకు కారణం అమెరికాయే అని చైనా ప్రయత్నాలు ప్రారంభించింది. కరోనా వైరస్ గురించి ప్రపంచానికి తెలియకుండా చేసినందుకే నష్టం సంభవించింది. 2019లో వుహాన్ లో ప్రపంచ సైనక క్రీడోత్సవంలో పాల్గొన్న అమెరికా సైనిక అథ్లెట్లు ఈ వైరస్ ను వ్యాపించారని చైనా ఆరోపించింది. దీంతో వైరస్ పుట్టుకపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. తప్పు మీదే అంటే మీదని అమెరికా, చైనా పరస్పరం ఆరోపణలు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో కరోనా వైరస్ ఆవిర్భావం గురించి ఇప్పటికీ మిస్టరీగానే మిగిలింది.