ఆంధ్రప్రదేశ్ లో జగన్ పాదయాత్ర సమయంలో మద్యనిషేధం చేస్తామని హామీ ఇచ్చారు. ప్రతి ఏడాది మద్యం దుకాణాలు తగ్గిస్తామని చెప్పారు. అన్నట్లుగానే రెండేళ్లలో మద్యం దుకాణాలు తగ్గించారు. రేట్లు కూడా పెంచారు. లాక్ డౌన్ సమయంలో 13 శాతం మద్యం షాపులను తగ్గించారు. కానీ మద్య నిషేధం మాత్రం చేయడం లేదు. ఎందుకంటే ప్రభుత్వానికి వచ్చే ఆదాయంలో ఎక్కువ శాతం మద్యానిదే. దీంతో సీఎం జగన్ మద్య నిషేధంపై మాట్లాడటం లేదు.

ఈ నేపథ్యంలో కొత్త మద్యం పాలసీని తీసుకొచ్చారు. ప్రస్తుతం ఏపీలో 2934 ప్రభుత్వ మద్యం దుకాణాలు ఉన్నాయి. వీటికితోడు పర్యాటక ప్రదేశాల్లో వాక్ ఇన్ స్టోర్ ల ఏర్పాటుకు ప్రభుత్వం సంకల్పించింది. మద్యం దుకాణాలను ప్రభుత్వం పెంచుకుంటోంది. దీంతో ఆదాయం రాబట్టుకోవాలని భావిస్తోంది. ప్రతి నెల ప్రభుత్వానికి రికార్డు స్థాయిలో ఆదాయం వస్తూనే ఉంది. ప్రతి నెల ప్రభుత్వానికి మద్యం ద్వారా రూ.1500 కోట్ల వరకు ఆదాయం సమకూరడం గమనార్హం.
రాష్ర్టంలో మద్యం ద్వారా ప్రభుత్వం మనుగడ ఆధారపడి ఉంటోంది. ఈ క్రమంలో మద్య నిషేధంపై పెదవి విప్పడం లేదు. అసలే ఆర్థిక వ్యవస్థ కుదేలవుతున్న సందర్భంలో మద్యం ద్వారా కలిగే ప్రయోజనంతోనే ప్రభుత్వం నడుస్తున్న నేపథ్యంలో మద్య నిషేధం హామీ మరిచిపోయింది. దీంతో రాష్ర్టంలో మద్యం విధానంతో లాభం పొందుతోంది.
మద్యం రేట్లను పెంచినా ప్రభుత్వానికే ఆదాయం పెరుగుతోంది. ఈ నేపథ్యంలో జగన్ తన పాదయాత్ర సమయంలో ఇచ్చిన హామీ ఏమైందనే ప్రశ్నలు వస్తున్నాయి. దీంతో ప్రభుత్వంపై ప్రజల్లో అనుమానం పెరుగుతోంది. మద్య నిషేధం చేస్తామని చెప్పినా ఆ దిశగా చర్యలు చేపట్టకపోవడం గమనార్హం. ఈ క్రమంలో రాబోయే ఎన్నికల్లో మద్య నిషేధంపై ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే.