
నటీనటులు: సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్య హోప్ తదితరులు
దర్శకుడు: గురు పవన్
నిర్మాత: మహేష్ గొల్లా
సినిమాటోగ్రఫీ: సి. రామ్‌ప్రసాద్
సంగీత దర్శకుడు: సునీల్ కశ్యప్
ఎడిటర్: జునైద్ సిద్దిఖీ
గురు పవన్ దర్శకత్వంలో మహేష్ గొల్లా నిర్మాణంలో సుమంత్ అశ్విన్, శ్రీకాంత్, భూమికా చావ్లా, తాన్యా హోప్ ప్రధాన పాత్రల్లో వచ్చిన రోడ్ జర్నీ చిత్రం “ఇదే మా కథ”. రోడ్ జర్నీ అడ్వెంచర్‌గా తెరకెక్కిన ఈ సినిమా ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో రివ్యూ చూద్దాం.
కథ :
అజయ్ (సుమంత్ అశ్విన్) ఒక రైడర్ అండ్ రేసర్. అది పేరెంట్స్ కి ఇష్టం ఉండదు. దాంతో ఇంట్లో నుంచి బయటకు వచ్చేసి రైడ్ కి వెళ్తాడు. మరోపక్క లక్ష్మి (భూమికా చావ్లా), మహేంద్ర ( శ్రీకాంత్), మేఘన (తాన్య హోప్) కూడా ముగ్గురు ఎవరికి వారు జర్నీ స్టార్ట్ చేస్తారు. ఒకరికి ఒకరు పరిచయ లేని ఈ నలుగురు రోడ్ జర్నీలో అనుకోకుండా ఎలా కలిశారు ? ఈ జర్నీలో ఒకరికి ఒకరు ఎలా సాయపడ్డారు ? ఈ మధ్యలో మేఘన – అజయ్ మధ్య ప్రేమ ఎలా పుట్టింది ? చివరకు మహేంద్ర జీవితం ఎలాంటి మలుపు తిరిగింది ? లక్ష్మి అనుకున్నది సాధించిందా ? లేదా ? అనేది మిగిలిన కథ.
విశ్లేషణ :
నాలుగు క్యారెక్టర్స్ మధ్య దర్శకుడు గురు పవన్ కొన్ని బలమైన ఎమోషన్స్ పెట్టి.. సినిమాని ఎమోషనల్ జర్నీగా మలిచాడు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రల్లో కనిపించిన శ్రీకాంత్, భూమికా చావ్లా తమ నటనతో ఆకట్టుకున్నారు. అలాగే తాన్యా హోప్ కూడా తన అందంతో పాటు తన నటనతోనూ ఆకట్టుకుంది. సప్తగిరి, పృథ్విరాజ్ తమ కామెడీ టైమింగ్ తో బాగా నవ్వించారు. ఇక మిగిలిన నటీనటులు కూడా తమ పాత్ర పరిధి మేరకు బాగా నటించారు.
అయితే, మంచి ఎమోషన్స్ తో కూడుకున్న కాన్సెప్ట్ తీసుకున్న దర్శకుడు ఆ కాన్సెప్ట్ కి తగ్గట్టు సన్నివేశాలను రాసుకోలేకపోయాడు. కాకపోతే కొన్ని సీన్స్ ను తెర మీదకు ఆసక్తికరంగా మలిచినప్పటికీ.. స్లో నేరేషన్ కారణంగా కొన్ని చోట్ల సినిమా చాలా బోర్ గా సాగుతుంది. ఇక హీరోయిన్ క్యారెక్టరైజేషన్ కూడా నమ్మశక్యంగా ఉండదు. అలాగే హీరో పాత్ర కూడా చాలా బలహీనంగా ఉంది.
సాంకేతిక విభాగం విషయానికి వస్తే.. సునీల్ కశ్యప్ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. అలాగే సినిమాటోగ్రఫీ కూడా బాగుంది. నిర్మాత మహేష్ గొల్లా ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా ఈ చిత్రాన్ని నిర్మించారు. నిర్మాణ విలువలు చాలా బాగున్నాయి. కానీ జునైద్ సిద్దిఖీ ఎడిటింగ్ సినిమాకి మైనస్ అయింది.
ప్లస్ పాయింట్స్ :
నటీనటుల నటన,
విజువల్స్,
కొంత జర్నీ డ్రామా,
మైనస్ పాయింట్స్ ;
కథాకథనాలు,
ఓవర్ బిల్డప్ డ్రామా,
ఇంట్రెస్టింగ్ సాగని సీన్స్,
రెగ్యులర్ కంటెంట్,
ల్యాగ్ ప్లే,
సినిమా చూడాలా ? వద్దా ?
‘రోడ్ జర్నీ అడ్వెంచర్స్’ను ఇష్టపడే ప్రేక్షకులు ఈ చిత్రాన్ని ఒకసారి చూడొచ్చు. ఇక మిగిలిన ప్రేక్షక మహాశయులకు వినమ్రంగా విజ్ఞప్తి చేస్తూ తెలియజేస్తోంది ఏమనగా దయచేసి ఈ రొటీన్ జర్నీ తతంగాన్ని చూసి విసిగి పోవద్దు అని మా మనవి.