https://oktelugu.com/

తెలంగాణలో స్కూళ్లు తెరిచేది ఎప్పుడంటే?

దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. కరోనా ఎఫెక్ట్ తో చాలా రంగాలు కుదేలయ్యాయి. కేంద్రం ఇటీవల ఆన్ లాక్ విధిస్తుండటంతో ఆయా రంగాలు తిరిగి పుంజుకుంటున్నాయి. అయితే విద్యారంగం, సినిమా, డిస్ట్రిబ్యూషన్, రైలు, విమాన రంగాలపై మాత్రం కరోనా ప్రభావం తీవ్రపడింది. ప్రధానంగా విద్యారంగం కరోనా ఎఫెక్ట్ తో కుదేలైంది. ప్రతీయేటా జూన్లో ప్రారంభం కావాల్సిన విద్యా వ్యవస్థ నేటికి గాడిలో పడలేదు. ఇటీవలే కేంద్రం విద్యారంగంపై కేంద్రం విధించిన ఆంక్షలు […]

Written By:
  • NARESH
  • , Updated On : September 15, 2020 7:31 pm
    Follow us on


    దేశంలో కరోనా ఎంట్రీతో కేంద్రం లాక్డౌన్ విధించిన సంగతి తెల్సిందే. కరోనా ఎఫెక్ట్ తో చాలా రంగాలు కుదేలయ్యాయి. కేంద్రం ఇటీవల ఆన్ లాక్ విధిస్తుండటంతో ఆయా రంగాలు తిరిగి పుంజుకుంటున్నాయి. అయితే విద్యారంగం, సినిమా, డిస్ట్రిబ్యూషన్, రైలు, విమాన రంగాలపై మాత్రం కరోనా ప్రభావం తీవ్రపడింది. ప్రధానంగా విద్యారంగం కరోనా ఎఫెక్ట్ తో కుదేలైంది. ప్రతీయేటా జూన్లో ప్రారంభం కావాల్సిన విద్యా వ్యవస్థ నేటికి గాడిలో పడలేదు. ఇటీవలే కేంద్రం విద్యారంగంపై కేంద్రం విధించిన ఆంక్షలు ఎత్తివేసింది.

    Also Read: కేంద్ర విద్యుత్ చట్టాన్ని కడిగేసిన కేసీఆర్

    పాఠశాలలు, కళాశాలలను ఆయా రాష్ట్రాలు తెరుచుకునేందుకు కేంద్రం అనుమతి ఇచ్చింది. కొన్ని రాష్ట్రాలు పాఠశాలలు తెరుచుకున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో కరోనా ప్రభావం అధికంగా ఉండటంతో పాఠశాలలు, కళాశాలలను తెరిచేందుకు ఆయా ప్రభుత్వాలు వెనుకాడుతున్నారు. కరోనా తొలినాళ్లలోనే పదో తరగతి పరీక్షలు ఉండగా వాటిని రాష్ట్ర ప్రభుత్వాలు వాయిదా వేశారు. వారందరినీ ప్రమోట్ చేసి విద్యార్థులు విద్యా సంవత్సరం నష్టపోకుండా చూశాయి. అయితే డిగ్రీ చివరి సంవత్సరం విద్యార్థులను ప్రమోట్ చేసేందుకు వీల్లేకపోవడంతో వారికి పరీక్షలు నిర్వహించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు సన్నహాలు చేస్తున్నాయి.

    కరోనాతో తెలంగాణలో మూసివేసిన పాఠశాలలు, కళాశాలలను తెరిచేందుకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. నర్సరీ విద్యార్థులకు మినహా మిగతా వారందరికీ ఆన్ లైన్లో తరగతులను నిర్వహించేందుకు ప్రభుత్వం సన్నాహాలు చేసింది. ఈ మేరకు అన్ని పాఠశాలల్లో శానిటైజర్లలో శుభ్రం చేయించారు. విద్యార్థులకు ఇప్పటికే పుస్తకాలను పంపిణీ చేశారు. దూరదర్శన్, టీశాట్ యాపుల ద్వారా ఆన్ లైన్ క్లాసులను ప్రభుత్వం నిర్వహించనుంది. అయితే ఆఫ్ లైన్ భౌతికంగా తరగతుల నిర్వహాణకు మరింత సమయం పట్టే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.

    Also Read: తెలంగాణ యోగి ఆదిత్యనాథ్ ఎక్కడ?

    రాష్ట్రంలో ఎంతమంది విద్యార్థుల ఇంట్లో స్మార్ట్ ఫోన్లు.. టీవీలు ఉన్నాయో విద్యాశాఖ సర్వే చేసింది. దాదాపు 85మందికి స్మార్ట్ ఫోన్లు, టీవీలు అందుబాటులో ఉన్నాయని తేలిందట. దీంతో మిగిలిన వారిని పక్కవారితో అనుసంధానించడం లేదా అంగన్ వాడీల్లో టీవీలు ఏర్పాటు చేసి విద్యార్థులు అక్కడికి వచ్చే చర్యలు చేపడుతున్నారు. విద్యార్థుల కోసం ప్రత్యేకంగా 48వేల వాట్సాప్ గ్రూపులను ఏర్పాటు చేసి ఆన్ లైన్లో బోధన చేయనున్నారు.

    ఇక ప్రైవేట్ పాఠశాలలు అధికంగా ఫీజులు వసూలు చేస్తే ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి స్పష్టం చేశారు. అయితే ఆన్ లైన్ విద్యావిధానం వల్ల అనేక ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని ఉపాధ్యాయులు, విద్యా నిపుణులు చెబుతుండటం గమనార్హం. దీంతో ఆఫ్ లైన్ తరగతుల ప్రారంభంపై ప్రభుత్వం ఆచితూచి ముందుకెళుతున్నట్లు తెలుస్తోంది.