Chandrababu: ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అన్నది సామెత. కుప్పంలో ఓటమి తరువాత చంద్రబాబు దానిపై ప్రత్యేక దృష్టి సారించనున్నారు. ప్రతి సంక్రాంతికి మూడు రోజుల పాటు కుప్పంలో పర్యటించే బాబు ఈసారి కూడా వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. అక్కడ రోడ్ షోలతో పాటు పార్టీని కూడా ప్రక్షాళన చేయనున్నారని తెలుస్తోంది. పార్టీ ఓటమికి కారణాలు అన్వేషించి లోపాలను సరిచేసేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. కుప్పం ఎమ్మెల్యేగా చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో గెలుస్తారా? లేక స్థానిక ఎన్నికల్లో మాదిరి ఓటమిని మూటగట్టుకుంటారో తెలియడం లేదు.

టీడీపీని ఓడించడానికి అధికార పార్టీ వైసీపీ ప్రలోభాలు, బెదిరింపులకు పాల్పడినట్లు గుర్తించారు. దీంతో పార్టీని గాడిలో పెట్టేందుకు ప్రణాళికలు రచిస్తున్నారు. ఇన్నాళ్లు కుప్పంలో ఏ కార్యక్రమం చేపట్టినా విజయవంతం చేసేందుకు ఎంతో శ్రమించేవారు. కానీ ఓటమి తరువాత అటు వైపు వెళ్లేందుకు ముందుకు రావడం లేదు. నేతల్లో జోష్ నింపుతూ పార్టీని విజయతీరాలకు చేర్చిన చంద్రబాబుకు గత స్థానిక ఎన్నికలు చేదు అనుభవాన్ని చవిచూపాయి. దీంతో ఆయన మళ్లీ అక్కడ విజయం సాధించే దిశగా పావులు కదపాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.
Also Read: చంద్రబాబు బాధ పగోడికి రావద్దట?
కుప్పంలో పరిస్థితిని మార్చేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. తన సొంత నియోజకవర్గంలో ఎదురుదెబ్బలు తగలడంతో మీమాంసలో పడిపోయారు. ఇన్నాళ్లు తనకు రక్షణగా నిలిచిన నేతలు అధికార పార్టీకి దాసోహమై పార్టీ ఓటమికి బాటలు వేయడాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. నాయయత్వాన్ని పూర్తిగా మార్చేందుకే సిద్ధపడినట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం చంద్రబాబు పార్టీ విషయంల సీరియస్ గా ఉన్నట్లు సమాచారం. రాబోయే ఎన్నికల్లో టీడీపీని విజయతీరాలకు చేర్చాలని భావిస్తున్నారు. దీని కోసం పటిష్ట యంత్రాంగాన్ని రూపొందించే క్రమంలో అన్వేషణ ప్రారంభించారు. పార్టీని మోసం చేసిన వారిని గుర్తించి కొత్త వారికి అవకాశాలు ఇవ్వాలని చూస్తున్నారు. దీంతో టీడీపీకి పూర్వ వైభవం వస్తుందో లేదో వేచి చూడాల్సిందే.
Also Read: చంద్రబాబుతో పొత్తు.. అసలు పవన్ కళ్యాణ్ అభిప్రాయం ఏమిటీ?