Chandrababu: ఆంధ్రప్రదేశ్ విపక్ష నేత నారా చంద్రబాబు నాయుడి విషయంలో ప్రమాది మోదీ తప్పు చేశారా? అంటే అవుననే అంటున్నారుకొంత మంది. మరి ఏవిషయంలో తప్పు చేశారు? కొంత మంది వాదన ఏంటి అన్న చర్చ జరుగుతోంది.
బీజేపీతో పొత్తుకు టీడీపీ తహతహ
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుంచి నేటి వరకు టీడీపీ బీజేపీతో పొత్తుకు తహతహలాడుతోంది. బీజేపీకి బలం లేదని కొంతమంది చెబుతున్నా.. బీజేపీ ఏనాడూ టీడీపీతో పొత్తుకు ముందుకు రాలేదు. 1999లో టీడీపీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయకుడు బీజేపీతో పొత్తు పెట్టుకుంది. ఈ ఎన్నికల్లో బీజేపీ ఏడు ఎంపీ సీట్లు గెలుచుకుంది. దేశమంతా బీజేపీ గాలి వీస్తుందని గుర్తించిన చంద్రబాబు పొత్తు కోసం వెళ్లాడు. దీంతో కేంద్రంలో అధికారంలోకి వచ్చిన బీజేపీ చంద్రబాబుకు అపామైన విలువ కూడా బీజేపీ ఇచ్చింది. అసెంబ్లీ ఎన్నికల్లోనూ 12 ఎమ్మెల్యే సీట్లు గెలిచింది. ఆ తర్వాత 2004లో చంద్రబాబు కోసం ముందస్తున్న ఎన్నికలకు వెళ్లిన బీజేపీ ఘోరంగా దెబ్బతిన్నది. ఈ ప్రభావంతో 10 ఏళ్లు అధికారానికి దూరమైంది.
బీజేపీతో తెగదెంపులు..
ఆ తర్వాత బీజేపీనే తిట్టిపోశారు చంద్రబాబు. మతతత్వం పార్టీ అని, ఎప్పటికీ ఆ పార్టీలో పొత్తు పెట్టుకోనని ప్రకటించారు. తెగదెంపులు కూడా చేసుకున్నారు. మళ్లీ 2014లో పొత్తు పెట్టుకున్నారు. చంద్రబాబే బీజేపీ దగ్గరకు వెళ్లి కలిసి పోటీ చేద్దామని ప్రకటించారు. బీజేపీ నిరాకరించినా కొంతమంది పెద్దల సహకారంతో పొత్తు పెట్టుకుని గెలిచారు. ఏపీలో టీడీపీని అధికారంలోకి తీసుకురావడానికి పరోక్షంగా బీజేపీ సహకరించింది.
2018లో మళ్లీ తెగదెంపులు..
ఇక 2018లో కూడా మళ్లీ బీజేపీతో టీడీపీ తెగదెంపులు చేసుకుంది. ఆంధ్రాకే మోదీ అన్యాయం చేశారని ఆరోపించారు. ప్రత్యేక హోదా ఇవ్వలేదని ఆరోపించారు. తిరుపతిలో హోం మంత్రి అమిత్‌షాపై దాడి కూడా చేయించారు. ఆ తర్వాత ఎన్నికలకు వెళ్లి ఘోరంగా ఓడిపోయింది.
తెలంగాణలో భారీగా పెరిగిన బీజేపీ బలం..
2018లో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా పోటీ చేసింది. అందులోకేవలం 6 శాతం ఓట్లు మాత్రం సాధించింది. ఇక 2019 లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం 18 శాతం ఓట్లు సాధించి నాలుగు ఎంపీ స్థానాలు గెలిచింది. దీనికి కొంతమంది టీడీపీ పొత్తు లేనందు వల్లే బీజేపీ తెలంగాణలో దెబ్బతిన్నదని వాదించారు. కానీ లోక్‌సభ ఎన్నికల్లోనూ ఒంటరిగానే చేసింది కదా. ఇక ఆంధ్రప్రదేశ్‌లో కూడా ఇలాంటి పరిస్థితే టీడీపీ 2019లో ఒంటరిగా పోటీ చేసి కేవలం 2 స్థానాలే గెలిచింది. అంటే బీజేపీతో బలపడేది టీడీపీనే. అందుకు ఇప్పుడు కూడా చంద్రబాబు నాయకుడు బీజేపీతో పొత్తు కోరుకుంటున్నారు.
చంద్రబాబు అరెస్ట్‌తో శాపనార్థాలు..
చంద్రబాబు అరెస్ట్ నేపథ్యం ఇప్పడు తెలంగాణ, ఆంధ్రతోపాటు, మహరాష్ట్రలో బీజేపీ ఘోరంగా దెబ్బతింటుందని ఆరోపించారు. చంద్రబాబును అరెస్ట్ చేయించి మోదీ పెద్ద తప్పు చేశారని వాదిస్తున్నారు. ఈసారి టీడీపీతో పొత్తు పెట్టుకోకుంటే ఘోరంగా బీజేపీ దెబ్బతింటుందని కథనాలు రాస్తున్నారు. కానీ అసలు విషయం ఏమిటంటే.. టీడీపీని దెబ్బతీయడమే లక్ష్యంగా మోదీ అడుగులు వేస్తున్నారు.