CM KCR: తెలంగాణ అసెంబీ ఎన్నికలకు సమయం దగ్గర పడుతోంది. ఈసారి ఎన్నికలు మూడు పార్టీల మధ్య జరుగనున్నాయి. భారత రాష్ట్ర సమితి, కాంగ్రెస్, బీజేపీ మధ్య ముక్కోణపు పోటీ ఖాయంగా కనిపిస్తోంది. అయితే ప్రధాన పోటీ మాత్రం బీఆర్‌ఎస్, కాంగ్రెస్ మధ్య మాత్రమే ఉండేల కనిపిస్తోంది. మరోవైపు బీజేపీ బీఆర్‌ఎస్, కాంగ్రెస్ ఓట్లను చీల్చే అశకాశం ఎక్కువగా ఉంది. మరోవైపు సర్వేలు ఈసారి తెలంగాణలో కాంగ్రెస్‌కు ఎడ్జ్ ఇస్తున్నాయి. కేసీఆర్ గెలుపు ఈసారి అంత ఈజీకాదని చెబుతున్నాయి.
అభ్యర్థుల ఎంపికే కీలకం..
కర్ణాటక గెలుపు తర్వాత తెలంగాణ కాంగ్రెస్‌లో మంచి ఊపు వచ్చింది. దీంతో కర్ణాటక ఫార్ములానే తెలంగాణలో ఫాలో అవుతోంది. ఇప్పటి వరకు ఆరు గ్యాంరెటీ స్కీంలు మంచి ఫలితాలు ఇస్తున్నట్లే కనిపిస్తున్నాయి. ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే కాంగ్రుస్ కచ్చితంగా 40 నుంచి 50 సీట్లు గెలుస్తుందని సర్వేలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే 55 మందితో తొలి జాబితా ప్రకటించిన కాంగ్రెస్.. త్వరలో ప్రకటించే రెండో జాబితా కీలకంగా మారనుంది. అభ్యర్థుల ఎంపిక ఆధారంగా గెలిచే సీట్లు పెరుగుతాయని విశ్లేషకులు అంటున్నారు.
త్వరలో రెండో జాబితా..
దసరా తర్వాత రెండో జాబితా అని కాంగ్రెస్ ఇప్పటికే నిర్ణయించింది. మరోవైపు రెండో విడత బస్సుయాత్రకు కూడా సిద్ధమవుతోంది. తొలివిడత యాత్రకు మంచి రెస్పాన్స్ వచ్చింది. దీంతో రెండో విడత యాత్రకు రూట్‌మ్యాప్ సిద్ధం చేస్తోంది. ఇదే సమయంలో రెండో జాబితాపైనా తీవ్ర కసరత్తు చేస్తోంది. అన్నీ అనుకున్నట్లు జరిగితే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడే అవకాశం ఉంటుందని విశ్లేషకులు లెక్కలు వేస్తున్నారు.
బీజేపీ ప్రభావం అంతంతే..
ఇక తెలంగాణలో బీజేపీ ప్రభావం పెద్దగా ఉండదని పేర్కొంటున్నారు. మహా అయితే 10 సీట్లు వరకు గెలిచే అవకాశం ఉంటుందని పేర్కొంటున్నారు. అయితే బీజేపీ ప్రభావంతో కాంగ్రెస్ ఓట్లు చీలితే మాత్రం నష్టం జరుగుతుందని అంటున్నారు.
ప్రభావం చూపని కేసీఆర్..
2014, 2018 ఎన్నికల్లో కేసీఆర్ అత్యంత ప్రభావం చూపారు. అన్నీ నియోజకవర్గాల్లో కేసీఆర్ బరిలో ఉన్నట్లుగా తన మాటలతో ఓటర్లను మెస్మరైజ్ చేయగలిగారు. సంక్షేమ పథకాలతో పార్టీని గెలిపించారు. అయితే ఈసారి కేసీఆర్ ప్రభావం పెద్దగా కనిపించడం లేదు. ఇప్పటికే ఐదారు సభలు నిర్వహించినా కేసీఆర్ మార్కు రాజకీయాలు, ప్రభావితం చేసే మాటలు పెద్దగా కనిపించలేదు. దీంతో ఈసారి కేసీఆర్ ప్రభావం తగ్గుతున్నట్లు అంచనా వేస్తున్నారు. మరోవైపు పదేళ్లు అధికారంలో ఉండి అవే మాటలు మళ్లీ చెప్పడం వలన ప్రజలు పెద్దగా పట్టించుకోవడం లేదని తెలుస్తోంది.