https://oktelugu.com/

Janasena Power: పవన్ కల్యాణ్ ‘పవర్’ చూపించాల్సిన టైం వచ్చిందా?

Janasena Power: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఏడేళ్లు గడుస్తోంది. మరో రెండున్నేర్లలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అయితే ఈసారి ఏపీలో ముందస్తు ఎన్నికల వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. ఇదే ఫార్మూలాను ఏపీలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసే ఎక్కువగా  కన్పిస్తోంది. జగన్ అధికారంలో వచ్చే సంక్షేమ కార్యక్రమాలను విరివిగా అమలు చేస్తున్నారు. అదే సమయంలో […]

Written By:
  • NARESH
  • , Updated On : December 21, 2021 5:28 pm
    Follow us on

    Janasena Power: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ జనసేన పార్టీని స్థాపించి ఏడేళ్లు గడుస్తోంది. మరో రెండున్నేర్లలో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు రానున్నాయి. అయితే ఈసారి ఏపీలో ముందస్తు ఎన్నికల వస్తాయనే ప్రచారం జోరుగా సాగుతోంది. తెలంగాణలో సీఎం కేసీఆర్ ప్రతిపక్షాలు బలహీనంగా ఉన్నప్పుడే ఎన్నికలకు వెళ్లి విజయం సాధించారు. ఇదే ఫార్మూలాను ఏపీలో జగన్మోహన్ రెడ్డి అమలు చేసే ఎక్కువగా  కన్పిస్తోంది.

    Janasena Power

    Janasena

    జగన్ అధికారంలో వచ్చే సంక్షేమ కార్యక్రమాలను విరివిగా అమలు చేస్తున్నారు. అదే సమయంలో ప్రత్యర్థి పార్టీలను బలహీనపర్చే కార్యక్రమాలు చేస్తున్నారు. ఇప్పటికే టీడీపీకి చెందిన పలువురు ఎమ్మెల్యేలు వైసీపీ కండువాను కప్పుకున్నారు. కొందరు టీడీపీలో ఉంటూనే వైసీపీకి లోపాయికారిగా పని చేస్తున్నారు. అలాగే జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ సైతం జగన్ కే జై కొట్టాడు.

    ప్రస్తుతం జనసేనలో పవన్ కల్యాణ్, నాదెండ్ల భాస్కర్ మినహా మిగిలిన నేతలెవరూ చెప్పుకోగిన స్థాయిలో లేరు. గత ఎన్నికల్లో జనసేన దారుణ పరాజయం అయిన తర్వాత పార్టీని బలోపేతం చేసే చర్యలు పవన్ కల్యాణ్ పెద్దగా చేయలేదు. అయితే ఓవైపు సినిమాలు చేస్తూ ప్రజా సమస్యలపై తనదైన శైలిలో స్పందిస్తూ ముందుకెళుతున్నారు.

    ఈక్రమంలోనే స్థానిక సంస్థల ఎన్నికల్లో జనసేనకు ఓటింగ్ శాతం భారీగా పెరిగింది. అసెంబ్లీ ఎన్నికల్లో జనసేనకు 5నుంచి 6శాతం ఓట్లు రాగా స్థానిక సంస్థల నాటికి ఓటింగ్ శాతం 25శాతానికి పైగా పెరిగింది. ఈ ఉత్సాహంతో పవన్ కల్యాణ్ ప్రజా సమస్యలపై విరివిగా పోరాటాలు చేస్తూ ప్రజలను తనవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తున్నారు.

    Also Read: కాపుల రాజ్యాధికారం సరే.. నడిపించే నాయకుడు ఎవరు?

    జనసేన పార్టీకి నియోజకవర్గాల్లో సరైన నాయకులు కరువయ్యారనే ప్రచారం జరుగుతోంది. దీంతో క్యాడర్ అయోమయానికి గురవుతోంది. ప్రస్తుతం పవన్ కల్యాణ్ బీజేపీతో పొత్తుతో ఉన్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకోవాలని భావిస్తున్నారు. ఒకవేళ ఈ పార్టీతో పొత్తు కుదుర్చుకున్నా పోటీ చేసే స్థానాల్లో జనసేన బలమైన అభ్యర్థిని ఎంపిక చేయాల్సి ఉంటుంది.

    కేవలం పవన్ కల్యాణ్ ఇమేజ్ మీద ఆధారపడి అభ్యర్థులను ఎంపిక చేస్తే ఇబ్బందులు ఎదురయ్యే ప్రమాదం ఉంది. స్వతంత్రులు బరిలో దిగితే గెలుపొటములపై ప్రభావం చూపుతోంది. ఈనేపథ్యంలోనే పవన్ ఇప్పటి నుంచే నియోజకవర్గ స్థాయిలో బలమైన నాయకులను తయారు చేయాల్సి ఉంటుంది. అప్పుడే జనసేన పొత్తులో భాగంగా ఎక్కువ సీట్లు దక్కించుకొని కింగ్ మేకర్ గా మారే అవకాశం ఉండనుంది. ఆ దిశగా పవన్ కల్యాణ్ ప్రయత్నాలు చేయాలని జనసైనికులు కోరుతున్నారు.

    Also Read: మొత్తానికి ఏపీ ఉద్యోగుల కడుపు సల్లబడింది.. కానీ ట్విస్ట్ ఇదే..