Central Budget: బడ్జెట్ సమావేశాలపై అందరి అంచనాలు పెరుగుతున్నాయి. కరోనా వేళ ఏదైనా తీపి కబురు ఉంటుందా అని చూస్తున్నారు. దీంతో కేంద్రం ప్రవేశపెట్టే దేశ బడ్జెట్ పై అందరిలో ఆసక్తి నెలకొంది. ప్రజాసంక్షేమం కోసం ఏం తీసుకొస్తున్నారు? రైతులకు ఏం తీపి కబురు అందజేస్తారు? అనే వాటిపైనే అందరికి కన్ను ఉంది. ఈ నేపథ్యంలో కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టే బడ్జెట్ ఎలా ఉంటుందో అనే ఉత్సుకత వస్తోంది. మరో రెండేళ్లలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో బీజేపీ ఏం పథకాలు ప్రజలకు వడ్డిస్తుందో వేచి చూడాల్సిందే. త్వరలో జరిగే అయిదు రాష్టాల ఎన్నికలను పరిగణనలోకి తీసుకుని వాటికి ఏం తాంబూలాలు ఇవ్వనున్నారో అని సగటు పౌరుడిలో ఆలోచన వస్తోంది.

మరోవైపు దేశంలో నిత్యావసర సరుకుల ధరలు అమాంతం పెరిగిపోయాయి. పెట్రో ధరలు మండిపోతున్నాయి. దీంతో సామాన్యుడు విలవిలాడుతున్నాడు. పెట్రోభారంపై ఏదైనా ఆసక్తి కలిగించే వార్త ఉంటుందో ఏమోననే భావనలో సగటు మానవుడున్నాడు. గ్యాస్, పెట్రో ధరలు విపరీతంగా పెరిగాయి. దీంతో కేంద్రం జీఎస్టీ తగ్గించినా రాష్ట్రాలు మాత్రం తగ్గించలేదు. ఫలితంగా సగటు పౌరుడిపైనే భారం పెరుగుతోంది. మోయలేని ధరాభారంతో సతమతమయ్యే వారికి కేంద్రం ఏం వడ్డిస్తుందో చూడాల్సిందే.
Also Read: తెలంగాణలో ఈసారి అధికారం ‘కాంగ్రెస్’దే: రేవంత్ రెడ్డి ధీమా వెనుక కారణాలివీ!?
అయితే ఈసారి ద్విచక్ర వాహనాల పై జీఎస్టీ తగ్గిస్తుందనే వార్తలు వస్తున్నాయి. దీంతో టూ వీలర్ ధరలు తగ్గుతాయని తెలుస్తోంది. ఇన్నాళ్లు వీటిపై మోపిన భారంతో కొందరు కొనుగోలు దారులు వెనుకంజ వేశారు.దీంతో కేంద్రం టూ వీలర్ ధరలు తగ్గిస్తే అవి కొనేవారికే ప్రయోజనం దక్కుతుంది కానీ మిగతా వారికి నిరాశే ఎదురయ్యే అవకాశం ఉంది. అందుకే అందరికి ప్రయోజనాలు కలిగేలా ఏదైనా చేస్తారా లేదా అనే సందేహాలు అందరిలో వస్తున్నాయి.
పార్లమెంట్ సమావేశాలు రెండు విడతలుగా జరగనున్నాయి. మొదటి విడతగా జనవరి 31 నుంచి ఫిబ్రవరి 11 వరకు రెండో విడత మార్చి 11 నుంచి ఏప్రిల్ 8 వరకు సాగనున్నాయి. ఇందులో మొదటి విడతలోనే ఫిబ్రవరి 1న బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఇందులోనే ఆర్థిక మంత్రి బడ్జెట్ ప్రవేశపెట్టనున్నట్లు తెలుస్తోంది. దీంతో బడ్జెట్ పై అందరికి అంచనాలు ఎక్కువయ్యాయి.
Also Read: డ్రగ్స్ మాఫియాపై ఉక్కుపాదం మోపక తప్పదా?