కరోనా మహమ్మారి విజృంభణపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. ఏపీలో కరోనా నిరోధానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదని టీడీపీ విమర్శలు చేస్తుండగా వైసీపీ నేతలు సైతం ఎదురుదాడి చేస్తున్నారు. ఎవరి స్వార్థ ప్రయోజనాల కోసం వారు పాల్పడుతున్నారు కాని ప్రజాప్రయోజనాలను పట్టించుకోవడం లేదు. ఫలితంగా కరోనా రోజురోజుకు రెట్టింపవుతోంది. నారీ నారీ నడుమ మురారి అన్నట్లుగా వైసీపీ, టీడీపీ మధ్య అంచనాలకందని విధంగా విమర్శలు చేసుకుంటున్నాయి. ప్రజా సమస్యలు గాలికొదిలేసి తమ పార్టీ ప్రయోజనాలకే పెద్దపీట వేస్తున్నారు. ఫలితంగా ఏపీలో విచిత్రకరమైన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రాజకీయాలపై రాద్దాంతం చేస్తూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తున్నాయి. ఇదే అదనుగా తమ గళాన్ని వినిపిస్తున్నాయి.
ఆర్డర్లు పెట్టుకున్న వారికే…
కరోనా వ్యాక్సిన్ కోసం ఏ రాష్ర్టం ఆర్డర్ పెడితే దానికే టీకాలు పంపుతామని కేంద్రం చెబుతోంది. ఇప్పటికే ఆర్డర్ పెట్టుకున్న స్టేట్లకు వ్యాక్సిన్ సరఫరా చేస్తోంది. ఏపీ ప్రభుత్వం వ్యాక్సినేషన్ కోసం ఆర్డర్ పంపలేదని స్పష్టం చేస్తోంది. దీంతో వ్యాక్సినేషన్ ఆలస్యమవుతోందిన ప్రతిపక్షాలు గగ్గోలు పెడుతున్నాయి. కేంద్రం మాత్రం ఏపీ సర్కారు ఏ రకమైన ఆర్డర్ పెట్టలేదని చెబుతున్నా ప్రభుత్వం మాత్రం కేంద్రం తప్పుడు ఆరోపణలు చేస్తోందని మండిపడుతోంది. దీంతో కరోనా వ్యాక్సిన్ పై రోజుకో రకమైన వాదనలు వినిపిస్తున్నాయి.
ప్రతిపక్షాల గొంతు నొక్కే..
ఏపీలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు గొంతు నొక్కే పని చేస్తున్నాయి. వైసీపీ నేత సజ్జల రామకృష్ణారెడ్డి చంద్రబాబుపై నిప్పులు చెరుగుతున్నారు. ఆయనను అరెస్టుచేసే చర్యలు తీసుకుంటామని చెబుతున్నారు. దీంతో ప్రజాసమస్యలు గాలికొదిలేసి తమ పబ్బం గడుపుకునేందుకే ప్రాధాన్యం ఇస్తున్నారు. కరోనా వేళ ప్రజలకు ఆరోగ్య పరిరక్షణపై దిశానిర్దేశం చేయాల్సిన నాయకులు స్వార్థ ప్రయోజనాలకే ప్రాధాన్యం ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ రాజకీయ పరిస్థితులపై ప్రజలు సైతం నిర్లిప్తంగానే ఉన్నారు. కరోనా వ్యాక్సినేషన్ వేగవంతం చేసి ప్రజాప్రయోజనాలను పరిరక్షించాల్సిన పార్టీలపై గురుతర బాధ్యత ఉంటుందని చెబుతున్నారు.