గత ఎన్నికల్లో వైసీపీ 151 నియోజకవర్గాల్లో విజయం సాధించింది. ఇది వైసీపీకి అనూహ్యంగా వచ్చిన విజయమే. కానీ రెండేళ్లుగా జిల్లాల్లో నేతలు మౌనవ్రతం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీ ఏమన్నా పట్టించుకోవడం లేదు. ఖండించడం కనిపించడం లేదు. 13 జిల్లాల్లో కూడా ఇదే పరిస్థితి. స్థానిక సంస్థల ఎన్నికలు, తిరుపతి ఉప ఎన్నిక ముగిసిపోయింది. ఇక ఇప్పట్లో ఎన్నికలు లేవు. ప్రతిపక్ష నేత చంద్రబాబు మాత్రం వైఎస్ జగన్ ను టార్గెట్ చేసుకుంటున్నారు. ప్రతి విషయంలో జగన్ పై విమర్శలు గుప్పిస్తున్నారు. కర్నూలులో ఎన్440 కే వేరియంట్ వ్యాప్తి చెందిందని పేర్కొన్నారు. ఇది ప్రమాదకరమని చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. కర్నూలు నేతలు మాత్రం స్పందించడం లేదు.
కర్నూలు ప్రాంతంపై చంద్రబాబు ఆరో పణలు చేస్తున్నా ఆ ప్రాంత నేతలు ఎందుకు స్పందించడం లేదు. నిజానికి కర్నూలులో గత ఎన్నికల్లో వైసీపీ క్లీన్ స్వీప్ చేససింది. అన్ని అసెంబ్లీ నియోజకవర్గాలతోపాటు రెండు పార్లమెంట్ స్థానాలను కైవసం చేసుకుంది. ఇక్కడ ఇద్దరు మంత్రులున్నారు. సీనియర్ నేతలున్నారు. కానీ కర్నూలు పై చంద్రబాబు ఆరోపణలు చేసినా నేతలు మాత్రం మౌనంగానే ఉండడం సందేహాలకు తావిస్తోంది.
రాబోయే రోజుల్లో మంత్రి వర్గ విస్తరణ ఉండడంతో వైసీపీ నేతలు మౌనంగా ఉన్నారా? అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చంద్రబాబుపై విమర్శలు చేయడం వల్లే వచ్చే నష్టం లేకపోయినా వైసీపీ నేతలు స్పందించకపోవడానికి కారణాలు వేరే ఉన్నాయని అంటున్నారు. ఇక్కడ రెండు గ్రూపులు ఉన్నా అధిష్టానం పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వెలువడుతున్నాయి. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమమాట చె ల్లుకాకపోవడంపై కూడా వారు మౌనం వహిస్తున్నారని తె లుస్తోంది.