cold and smoke : చలికాలం చలి చంపేస్తుంది కదా. వామ్మో పొద్దున ముసుగు తీయాలి అంటే వణకాల్సి వస్తుంది. చెద్దరి కాస్త కదిలిస్తే చాలండీ బాబు ఫుల్ గా చలి పెడుతుంది. మరి ఈ చలిలో మీ డే ఎలా గడుస్తుంది? రాత్రి త్వరగా ఇంటికి రావడం, సాయంత్రం బయట ఉండాలంటే భయపడటం, ఇక వేడి వేడి భోజనం చేసి త్వరగా పడుకోవడం వంటివి మాత్రం ఈ సమయంలో చాలా మంది పాటిస్తుంటారు. లేదంటే చలికి స్వెర్టర్లు వేసుకొని ఉండాల్సిందే. ఇక ఇన్ని రోజులు చలితో వణికారా? కానీ ఇప్పుడు మరో వాతావరణ మార్పు మిమ్మల్ని భయపెట్టడానికి సిద్ధం అయింది. అదేనండి పొగ మంచు.
ఇన్నాళ్లు చలి.. ఇప్పుడు పొగమంచు అంటూ ప్రజలను ఇబ్బంది పెట్టడానికి మరో వెదర్ ప్రాబ్లం వచ్చింది. తెలుగు రాష్ట్రాలను దట్టమైన పొగమంచు కమ్మేసింది. ఈ పొగ మంచువల్ల ఉదయం, సాయంత్రం చాలా ఇబ్బంది అవుతుంది. ఉదయం గ్రామాల్లోని ప్రజలు పొలాలకు వెళ్లాలి అన్నా, సాయంత్రం పనులు చేసుకోవాలన్నా కష్టంగానే ఉంది. దీంతో రైతులు, ఉద్యోగాలు చేసేవారు తీవ్ర ఇబ్బందుల పడుతున్నారు. పొగమంచు కారణంగా రోడ్డుపై వాహనాలను కూడా గుర్తించడం కష్టంగానే మారింది. వాహనదారులు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు.
తెలుగు రాష్ట్రాలు చలి తీవ్రత ఈ సారి మరింత పెరిగి గజగజలాడిస్తుంది. రాత్రి ఉష్ణోగ్రతలు గణనీయంగా పడిపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు. ఉమ్మడి ఆదిలాబాద్, నల్గొండ, కోనసీమ శ్రీకాకుళం జిల్లాల్లో ఈ సమస్య మరింత ఎక్కువగా కనిపిస్తుంది. అక్కడ కనీష‌్ణ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. దీంతో జనం గజగజ వణికిపోతున్నారు. పొగమంచు, చలితో ప్రజలు ఇళ్లనుంచి బయటకు రావడం లేదు. ఇప్పుడే ఇలా ఉంటే.. ఇంకా జనవరి నెలలో ఎలా ఉంటుందో అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు ప్రజలు.
పొగ మంచు ప్రకృతి ప్రేమికులను ఆకట్టుకంటోంది. తెల్లవారుజామును కురుస్తున్న మంచు వల్ల ప్రకృతి ప్రేమికులు చాలా ఎంజాయ్ చేస్తున్నారు. ఏజెన్సీలో ఉన్నామా? కాశ్మీరులోనా? అని ఎంజాయ్ చేస్తున్నారు. అటు ఉత్తరాదిని మంచు దుప్పటి కప్పేసిందనే చెప్పాలి. జమ్మూకశ్మీర్, హిమాచల్‌లో అయితే ఈ మంచు గురించి చెప్పాల్సిన అవసరం లేదు. అక్కడి ప్రాంతాలు కనుచూపు మేర శ్వేత వర్ణంతో నిండి ఎంతో మందిని ఆకట్టుకుంటున్నాయి. ఎటుచూసినా మంచు దుప్పటి పరిచినట్టుగా ఉంది. ఆహ్లాదంగా కనిపిస్తుండటంతో ప్రకృతి ప్రేమికులు ఎంజాయ్ చేస్తున్నారు. అడుగుల మేర పేరుకుపోయిన మంచుతో పర్యాటకులను ఎంజాయ్ చేస్తే ఈ వెదర్ ను ఆహ్వానిస్తున్నారు. ఆనందిస్తున్నారు. పర్యాటకులు ఈ శీతల వాతావరణాన్ని ఆస్వాదిస్తూ మంచులో ఆటలాడుతున్నారు కూడా.
కానీ ఈ పొగమంచులో ఎక్కువగా ఉండటం వల్ల ఎన్నో అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి. ఎంజాయ్ కోసం ఆలోచిస్తే మీరు అనారోగ్య బారిన పడాల్సి వస్తుందనే విషయాన్ని కచ్చితంగా గమనించాలి. వాతావరణం మారుతున్న కొద్ది చలితో పాటు పొగమంచు కూడా మరింత ఎక్కువగా పెరుగుతుంది.