ఏపీలో అనుకోని సంఘటనలు కలవరపెడుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ లో వరుసగా ఆలయాలపై వస్తున్న వార్తలు చర్చనీయాంశమవుతున్నాయి. కొన్ని రోజుల నుంచి వరుస ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి.ఇప్పటికే అంతర్వేది, పిడింగొయ్యి ఘటనలతో ఏపీ రాజకీయాల్లో వేడి పెరిగిపోయింది. ఏపీలో అధికార వైసీపీ ప్రభుత్వంపై ప్రతిపక్షాలు విమర్శలు గుప్పిస్తున్నాయి. జగన్ పాలనలో ఇలా జరుగుతున్నాయని రాద్ధాంతం చేస్తున్నాయి. జగన్ సర్కార్ పై వ్యూహాత్మకంగా జరుగుతున్న ఈ దాడులను నిగ్గుతేల్చాలని కూడా వైసీపీ సర్కార్ పట్టుదలగా ఉంది. తాజాగా దాడుల వెనుక గల కారణాలను ఏపీ పోలీస్ శాఖ బయటపెట్టింది.
Also Read: అగ్రి గోల్డ్ బాధితులకు శుభవార్త చెప్పిన జగన్ సర్కార్..?
రాష్ట్రంలోని వివిధ దేవాలయాలపై జరిగిన దాడి విషయంలో ఎలాంటి కుట్ర లేదని ఏపీ పోలీసులు తేల్చారు. ఏపీలో దాదాపు 19 సంఘటనలకు ఎలాంటి కుట్రకోణం లేదని, వాటి మధ్య ఎలాంటి సంబంధం లేదని ఏపీ పోలీసులు స్పష్టంగా చెప్పారు. ఓ మతంపై దాడి చేసే కుట్రలో భాగం కాదని, ఈ సంఘటనలలో ఎటువంటి కుట్ర కోణం బయటపడలేదని తాజాగా పోలీసులు తెలిపారు. విధ్వంసానికి ఉద్దేశ్యాలు వైవిధ్యభరితంగా ఉన్నాయని, మతపరమైనవి కాదని వారు స్పష్టం చేశారు.
సమాజంలోని వివిధ వర్గాలలో ఇబ్బందులను రేకెత్తించడానికి మరియు అసమ్మతిని సృష్టించడానికి హానికరమైన ప్రచారం జరుగుతోందని పోలీసు శాఖ ఒక ప్రకటనలో తెలిపింది.. ఇందుకు ఉదాహరణలు కూడా వారు వివరించారు. ఒక సంఘటనలో శ్రీకాకుళంలో ఒక విగ్రహం చేయి విరిగిందని.. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా తేమ ఎక్కువై దేవత విగ్రహం విరిగిందని విచారణలో తేలిందన్నారు. ఇక మరొక సంఘటనలో, ఒక వ్యక్తి పిల్లలను పుడతాడనే ఆశతో దేవత విగ్రహం భాగాన్ని తీసుకున్నాడని విచారణలో తేలిందట..
Also Read: టీడీపీ ఏపీ నూతన అధ్యక్షుడు అతడేనా?
రాష్ట్రంలోని అన్ని ప్రార్థనా స్థలాలను ప్రభుత్వం మ్యాప్ చేస్తోందని, 28,567 హిందూ ప్రార్థనా స్థలాలతో సహా 47,593 ప్రార్థనా స్థలాలను గుర్తించామని పోలీస్ శాఖ తెలిపింది. 2016 లో ప్రార్థనా స్థలాలపై 290 దాడులు జరిగాయని పోలీసులు చెప్పారు. ఇలాంటి 322 కేసులు ఉన్నాయి. 2018 లో 305 కేసులు నమోదయ్యాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 228 కేసులు నమోదయ్యాయని తెలిపారు.