https://oktelugu.com/

డ్రగ్స్ కేసులో రకుల్ ప్రీత్ సింగ్ సాక్ష్యం? ఏం చెప్పిందంటే?

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ ఫుత్ ఆత్మహత్య కేసు మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే. ఈ కేసు బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖలందరినీ ఇరుకునపెడుతోంది. నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు తొలినాళ్లలో వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో దర్యాప్తు ఆ దిశగా కొనసాగుతోంది. తీగలాగితే డొంక కదిలిన చందంగా బాలీవుడ్లోని చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి. Also Read: చదరంగం’కే నితిన్ ఫిక్స్.. దసరాకి ఎనౌన్స్ మెంట్ […]

Written By: , Updated On : September 29, 2020 / 04:14 PM IST
Follow us on

బాలీవుడ్ నటుడు సుశాంత్ రాజ్ ఫుత్ ఆత్మహత్య కేసు మిస్టరీగా మారిన సంగతి తెల్సిందే. ఈ కేసు బాలీవుడ్ ఇండస్ట్రీలోని ప్రముఖలందరినీ ఇరుకునపెడుతోంది. నెపోటిజం కారణంగానే సుశాంత్ ఆత్మహత్య చేసుకున్నాడనే ఆరోపణలు తొలినాళ్లలో వచ్చాయి. అయితే ఆ తర్వాత ఈ కేసులో డ్రగ్స్ లింకులు బయటపడటంతో దర్యాప్తు ఆ దిశగా కొనసాగుతోంది. తీగలాగితే డొంక కదిలిన చందంగా బాలీవుడ్లోని చీకటి బాగోతాలు ఒక్కొక్కటిగా వెలుగు చూస్తున్నాయి.

Also Read: చదరంగం’కే నితిన్ ఫిక్స్.. దసరాకి ఎనౌన్స్ మెంట్ !

ఈకేసులో ఇప్పటికే పలువురు స్టార్ హీరోహీరోయిన్ల పేర్లు తెరపైకి వచ్చాయి. సుశాంత్ మాజీ ప్రియురాలు రియా చక్రవర్తి డ్రగ్స్ కేసులో పీకల్లోతు కష్టాల్లో ఇరుక్కుపోయింది. ఎన్సీబీ పోలీసులు విచారణలో రియా చక్రవర్తి డ్రగ్స్ కేసుతో సంబంధం ఉన్న 25మంది పేర్లు చెప్పినట్లు గుసగుసలు విన్పించాయి. ఇందులో రకుల్ ప్రీత్ సింగ్ పేరు కూడా తెరపైకి వచ్చింది.

ఈ నేపథ్యంలో రకుల్ ప్రీత్ సింగ్ కు ఎన్సీబీ పోలీసులు విచారణకు హాజరు కావాలని నోటిసులు పంపించారు. ఇందులో భాగంగా రకుల్ ప్రీత్ సింగ్ ఎన్సీబీ ముందు విచారణకు హాజరైంది. దాదాపు 4గంటలపాటు ఆమెను ఎన్సీబీ పోలీసులు విచారించినట్లు తెలుస్తోంది. డ్రగ్స్ కేసుతో సంబంధం రియా చక్రవర్తితో పరిచయం.. ఆమెతో వాట్సాప్ చాటింగ్ గురించి పోలీసులు ఆరా తీసినట్లు వార్తలు వస్తున్నాయి.

కాగా ఈ కేసుపై తాజాగా రకుల్ ఓ జాతీయ ఛానల్ తో మాట్లాడుతూ తనను ఎన్సీబీ కేవలం సాక్షిగానే విచారణకు పిలిచిందని చెప్పినట్లు తెలుస్తోంది. తనకు డ్రగ్స్ లావాదేవీలతో ఎలాంటి సంబంధం లేదని తెలిపింది. అయితే డ్రగ్స్ కేసులో రకుల్ పేరు మీడియాలో ప్రముఖంగా వస్తుండటంతో ఆమె ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించింది. తనపై తప్పుడు వార్తలు ప్రసారం చేయకుండా నియంత్రించాలని కోర్టును కోరింది.

Also Read: వైరల్ పిక్స్: ‘స్నేహ’తో అల్లు అర్జున్ సెలబ్రేషన్స్..!

అయితే ఎన్సీబీ విచారణలో రియా కోరిక మేరకు తన ఫ్లాట్లో డ్రగ్స్ దాచినట్టు రకుల్ అంగీకరించిందని.. మరో నలుగురు స్టార్ల పేర్లు కూడా వెల్లడించిందని ‘టైమ్స్ నౌ’ ఛానల్ పేర్కొనడం గమనార్హం. రకుల్ చెబుతున్నట్టు డ్రగ్స్ కేసులో ఆమె సాక్ష్యం ఎన్సీబీకి ఏమేరకు కీలకంగా మారుతుందో వేచి చూడాల్సిందే..!