Teenamar Mallanna: క్యూ న్యూస్ యూట్యూబ్ ఛానెల్ పేరుతో తెలంగాణలో అధికారంలో ఉన్న సీఎం కేసీఆర్ ను చీల్చిచెండాడుతూ ఫేమస్ అయ్యాడు చింతపండు నవీన్ కుమార్ అలియాస్ తీన్మార్ మల్లన్న.. తెలంగాణలో తీన్మార్ మల్లన్న పేరుయే ఒక బ్రాండ్. ఆయన కేసీఆర్ పై వెసే పంచులు, సెటైర్లు ఒక ట్రెండ్ సెట్టర్. అయితే కేసీఆర్ ఆగ్రహ జ్వాలల్లో తీన్మార్ మల్లన్న జైలుపాలయ్యాడు.

ఒకటి కాదు.. రెండు కాదు.. ఏకంగా 30కిపైగా కేసులు పెట్టి రెండున్నర నెలల పాటు ఆయనను జైల్లో ఉంచింది టీఆర్ఎస్ సర్కార్. ఒక కేసులో బెయిల్ రాగానే మరో కేసులో అరెస్ట్ చూపడం.. రిమాండ్ కు పంపడం.. ఇలా మొత్తం 30కిపైగా కేసులు తీన్మార్ మల్లన్నపై బుక్ అయ్యాయి.
ఎట్టకేలకు 30కి పైగా కేసుల్లో తీన్మార్ మల్లన్నకు బెయిల్ వచ్చింది. మరో 6 కేసులు కొట్టివేశారు. దీంతో తీన్మార్ మల్లన్న సోమవారం విడుదలయ్యాడు. దీంతో తెలంగాణ రాజకీయాల్లో ఆయన కార్యచరణ కేసీఆర్ పై ఎలా ఉండబోతున్నది ఆసక్తి రేపుతోంది.
జైల్లో ఉండగానే విడుదల కోసం తీన్మార్ మల్లన్న భార్య బీజేపీ నేతలను వేడుకుంది. తీన్మార్ మల్లన్న సైతం తాను బీజేపీలో చేరుతానని.. విడుదలయ్యేలా చూడాలని కోరాడు. దీంతో ఎంపీ అరవింద్.. స్వయంగా తీన్మార్ మల్లన్నను తీసుకెళ్లి కేంద్రహోంమంత్రి అమిత్ షాను కలిపించి భర్త తీన్మార్ మల్లన్న విడుదల కోసం ప్రయత్నించింది.
ఇప్పుడు ఎట్టకేలకు తీన్మార్ మల్లన్న ఆలస్యంగానే విడుదల కావడంతో ఈయన బీజేపీలో చేరుతారా? కేసీఆర్ సర్కార్ పై పోరాడుతాడా? అన్నది వేచిచూడాలి.