AP Govt Employees: ఏపీ ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య లొల్లి ఏంటి?

AP Govt Employees: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య పొసగడం లేదు. దీంతో అటు సీఎం ఇటు ఉద్యోగులు అనే ధోరణిగా మారిపోయింది. ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లుగా ఉద్యోగులు పరిస్థితి మారిపోయింది. ఇన్నాళ్లు ప్రభుత్వమే తమను ఆదుకుంటుందని భావించిన ఉద్యోగులకు నిరాశే మిగులుతోంది. ఉద్యోగులు లంచగొండులని ప్రచారం చేస్తూ వారిపై బురద జల్లుతున్నారు దీంతో వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ […]

Written By: Srinivas, Updated On : January 24, 2022 1:39 pm
Follow us on

AP Govt Employees: ఆంధ్రప్రదేశ్ లో ప్రభుత్వానికి ఉద్యోగులకు మధ్య పొసగడం లేదు. దీంతో అటు సీఎం ఇటు ఉద్యోగులు అనే ధోరణిగా మారిపోయింది. ఏరు దాటేదాకా ఓడ మల్లయ్య ఏరు దాటాక బోడ మల్లయ్య అన్నట్లుగా ఉద్యోగులు పరిస్థితి మారిపోయింది. ఇన్నాళ్లు ప్రభుత్వమే తమను ఆదుకుంటుందని భావించిన ఉద్యోగులకు నిరాశే మిగులుతోంది. ఉద్యోగులు లంచగొండులని ప్రచారం చేస్తూ వారిపై బురద జల్లుతున్నారు దీంతో వారికి ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఈ నేపథ్యంలో వైసీపీ ఉద్దేశం ఏమిటనే ప్రశ్న అందరి ఉద్యోగుల్లో వస్తోంది.

AP Employees strike

 

మరోవైపు ఉద్యోగులను పనిదొంగలుగా ముద్ర వేస్తోంది. పని చేతకాక రియల్ ఎస్టేట్ వ్యాపారాలు చేసుకుంటూ ప్రజలను పట్టించుకోవడం లేదనే ప్రచారం మొదలుపెట్టారు. దీంతో ఉద్యోగుల్లో ఆందోళన పెరుగుతోంది. తాము పెంచి పోషించిన మొక్కే తమను దహిస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వ వైఖరితో ఎటూ తేల్చుకోలేని స్థితిలోకి వెళ్లిపోయారు. ఎందుకింత దుర్మార్గమైన చర్యకు పూనుకున్నారని ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.

Also Read: Fruits and Vitamins: ఈ పండ్లు తింటే.. రోగాలు తగ్గుతాయి.

ఉద్యోగులకు నెలనెల జీతాలు సైతం సక్రమంగా ఇవ్వకపోగా నిందలు వేస్తూ తమ పబ్బం గడుపుకోవాలని చూస్తోంది. అసలు సీఎం జగన్ మదిలో ఏముందో ఎవరికి అర్థం కావడం లేదు. ఉద్యోగులను లంచగొండులు, పనిదొంగలు, రియల్ ఎస్టేట్ వ్యాపారులు చిత్రీకరిస్తున్నారు. అసలు ఎందుకు ఇదంతా చేస్తున్నారు? ఉద్యోగులను ఏం చేయాలని భావిస్తున్నారో? అనే ప్రశ్నలు ఉద్యోగుల్లో తలెత్తుతున్నాయి. దీంతో ఏపీలో ఏదో జరుగుతుందనే వాదన మాత్రం తెరమీదకు వస్తోంది.

CM YS Jagan

ఒక విధంగా రాజకీయ పార్టీలపై చేసే విమర్శలకు మల్లే ఉద్యోగులపై చేస్తోంది. దీంతో వారు ఎక్కడ? ఎవరికి చెప్పుకోవాలో అంతుచిక్కడం లేదు. స్థానిక సంస్థల ఎన్నికల్లో బ్రహ్మాండమైన మెజార్టీ ఇచ్చినా ప్రభుత్వం మాత్రం ఉద్యోగులను పరాయివారిగానే చూస్తోంది. దీంతో వారి భవిష్యత్ అంధకారంలో పడిందనే తెలుస్తోంది. టీచర్లనైతే తమ ఇష్టానుసారంగా తిడుతూ వైసీపీ తన సహజ గుణాన్ని ప్రదర్శిస్తోంది.

Also Read: ప్రముఖ డాక్టర్ తో తమన్నా పెళ్లి… క్లారిటీ ఇచ్చిన మిల్కీ బ్యూటీ

Tags