Corona: దేశంలో మళ్లీ కరోనా భయనాక పరిస్థితులు ఏర్పడుతున్నాయి. రోజురోజుకూ కరోనా కేసులు బాగా పెరుగుతున్నాయి. ఈ క్రమంలోనే థర్డ్ వేవ్ ఇప్పటికే వచ్చేసిందని కొందరు అభిప్రాయపడుతున్నారు. ఇకపోతే ఉభయ తెలుగు రాష్ట్రాలను కొవిడ్ మహమ్మారి వణికించేస్తోంది. రోజువారీ కొత్త కేసులు కొద్దిగా తగ్గినా, పాజిటివిటీ రేటు రికార్డు స్థాయికి చేరుకుంది. కొవిడ్ బారిన పడిన వారి మరణాల సంఖ్య కూడా ఆందోళనకరంగా మారింది. కేంద్ర ఆరోగ్య శాఖ తాజాగా విడుదల చేసిన బులిటెన్ వివరాలిలా ఉన్నాయి.
దేశంలో గడిచిన 24 గంటల్లో 14 లక్షల కొవిడ్ టెస్టులు చేయగా, కొత్తగా 3,06,064 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. మొత్తం కేసుల సంఖ్య 4కోట్లకు చేరువగా ఉంది. తెలంగాణాలో కొవిడ్ కేసులు 27 వేలు ఉండగా, పాజిటివిటీ రేటు 17 శాతం నుంచి 20.7 శాతానికి పెరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో 46,650 మందికి కొవిడ్ టెస్టులు చేయగా, 14,440 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది. ఏపీలో ఇప్పుడు 83, 610 యాక్టివ్ కేసులు ఉన్నాయి. కొవిడ్ బారిన పడి ఇప్పటి వరకు 14,542 మంది చనిపోయారు.
దేశంలోనూ కరోనా బారిన పడి చనిపోతున్న వారి సంఖ్య చూసి జనం భయపడిపోతున్నారు. దేశంలో మొత్తంగా కొవిడ్ బారిన పడి ఇప్టపి వరకు 4,89,848 చనిపోయారు. గడిచిన 24 గంటలల్లో 439 మంది ప్రాణాలు కోల్పోయారు. కొవిడ్ ఒమిక్రాన్ వేరియంట్ వలన జనం బాగా భయపడుతున్నారు. దేశంలో మొత్తం రికవరీల సంఖ్య 3.68కోట్లకు చేరగా, రికవరీ రేటు 93.07 శాతంగా ఉంది.
Also Read: సావిత్రి జీవితంలో చేసిన తప్పులు ఇవే.. అందుకే ఆమె మోసపోయింది..
రోజురోజుకూ కరోనా కేసులు భారీగా పెరుగుతుండటం చూసి జనాలు భయపడుతుననారు. దేశంలో ప్రస్తుతం సుమారుగా 22 లక్షల యాక్టివ్ కేసులున్నాయి. అయితే, కేసుల్లో రికవరీ శాతం తక్కుగా ఉండటం ఆందోళన కర విషయమని ఆరోగ్య నిపుణులు చెప్తున్నారు. దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. కర్నాటకలో ఒక్క రోజులోనే 50 వేల కేసులు నమోదయ్యాయి. కేరళ, మహారాష్ట్ర, తమిళనాడులోనూ వైరస్ తీవ్రత అధికంగా ఉంది.
మరో వైపున కొవిడ్ మహమ్మరి కట్టడికి ప్రభుత్వాలు వ్యాక్సిన్ ను విస్తృతంగా పంపిణీ చేస్తున్నారు. ఇప్పటి దాకా దేశంలో రెండు డోసుల వ్యాక్సిన్ తసీుకున్న వారు 162 కోట్లకు పైగా ఉన్నారు.
Also Read: AP government: ఏపీ సర్కార్‌కు దిమ్మదిరిగే కౌంటర్ ఇచ్చిన ఏపీ టీచర్స్.. సమ్మెలో సై