https://oktelugu.com/

అసలు జీహెచ్ఎంసీపై కేసీఆర్ ప్లాన్ ఏంటి?

దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నిక తరువాత కేసీఆర్ ఎంతో కాలం సమయం తీసుకోకుండా వెంటనే హైదరాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే దుబ్బాకలో గెలిచిన బీజేపీ.. ఊపు మీదుండడంతో ఎన్నికలకు కమలదళం కూడా సై అంటోంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత తొందరగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడంపై రకరకాల వాదనలు వస్తున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ వ్యతిరేకత అంటూ ప్రచారం జరుగుతున్నా.. హైదరాబాద్ లో వరదసాయంపై ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నా ఎన్నికలకు వెళ్లాలనే […]

Written By:
  • NARESH
  • , Updated On : November 13, 2020 / 10:08 AM IST
    Follow us on

    దుబ్బాకలో జరిగిన ఉప ఎన్నిక తరువాత కేసీఆర్ ఎంతో కాలం సమయం తీసుకోకుండా వెంటనే హైదరాబాద్ గ్రేటర్ మున్సిపాలిటీ ఎన్నికలపై సమావేశం ఏర్పాటు చేశారు. ఇప్పటికే దుబ్బాకలో గెలిచిన బీజేపీ.. ఊపు మీదుండడంతో ఎన్నికలకు కమలదళం కూడా సై అంటోంది. అయితే ముఖ్యమంత్రి కేసీఆర్ ఇంత తొందరగా జీహెచ్ఎంసీ ఎన్నికలపై నిర్ణయం తీసుకోవడంపై రకరకాల వాదనలు వస్తున్నాయి. ఓ వైపు టీఆర్ఎస్ వ్యతిరేకత అంటూ ప్రచారం జరుగుతున్నా.. హైదరాబాద్ లో వరదసాయంపై ప్రభుత్వాన్ని తిట్టిపోస్తున్నా ఎన్నికలకు వెళ్లాలనే ధోరణిలోనే టీఆర్ఎస్ ప్రణాళిక రచిస్తోంది. అయితే కొందరు విశ్లేషకులు చెబుతున్న ప్రకారం కేసీఆర్ గ్రేటర్ ఎన్నికలకు మొగ్గు చూపడానికి కారణం ఇవేనంటున్నారు.

    Also Read: పదో తరగతి విద్యార్థులకు శుభవార్త చెప్పిన తెలంగాణ విద్యాశాఖ..?

    దుబ్బాకలో టీఆర్ఎస్ ఓటమి తరువాత కేసీఆర్ అప్రమత్తమయ్యారు. అక్కడ బీజేపీ గెలిచినా అది పెద్ద విషయం కాదన్నారు. ఈమేరకు ఆయన గురువారం మంత్రులతో సమావేశమైన సందర్భంగా పలు విషయాలు చర్చించినట్లు తెలుస్తోంది. దుబ్బాకలో బీజేపీ ప్రత్యేక పరిస్థతుల్లో మాత్రమే గెలుపొందిందన్నారు. ప్రజల్లో టీఆర్ఎస్ పై వ్యతిరేకత రాలేదన్నారు. బీజేపీ నాయకుల మాటలే తప్ప ఏ ఒక్క పని రాష్ట్రానికి చేయలేదన్నారు. ప్రజల్లో టీఆర్ఎస్ పై విశ్వాసం ఉందన్నారు.

    ఇప్పటికే బీజేపీకి బలం పెరుగుతుందన్న వార్తలు వస్తున్నాయి. ఈ తరుణంలో ఎక్కువ సమయం తీసుకోకుండా టీఆర్ఎస్ పథకాలు ప్రచారం చేయాలని నిర్ణయించారు. ముఖ్యంగా వరదసాయంపై టీఆర్ఎస్ నాయకులను ప్రజలు తమ కాలనీల్లోకి రానీయకుండా చేస్తున్నారు. ఇదే సందర్భంలో ఇంటింటికి వెళ్లి వారికి వరద సాయం అందిస్తూ పథకాలపై వివరించేలా యత్నిస్తున్నారు. పొగొట్టుకున్న చోటే రాబట్టుకోవాలన్న సామెతను ద్రుష్టిలో పెట్టకొని వ్యతిరేకత వస్తున్న కాలనీలపై ప్రత్యేక ద్రుష్టి సారించాలని చూస్తున్నారు. లేకపోతే అలాంటి కాలనీల్లో బీజేపీ ఆధ్వర్యంలో ఆందోళనలు చేసే అవకాశం ఉందని, దీంతో ప్రభుత్వంపై మరింత చెడ్డపేరు వచ్చే అవకాశం ఉంది. ఈ నేపథ్యలో ఎంత తొందరగా ఎన్నికలు నిర్వహిస్తే అంతమంచిదనే అభిప్రాయానికి కేసీఆర్ వచ్చినట్లు సమాచారం.

    Also Read: దుబ్బాకలో బీజేపీ విజయంపై తొలిసారి స్పందించిన కేసీఆర్

    అయితే జీహెచ్ఎంసీ ఎన్నికల కోసం కేసీఆర్ కొన్ని విషయాలను మంత్రులకు సూచించినట్లు తెలుస్తోంది. జీహెచ్ఎంసీ పరిధిలోని ప్రతి ఇంటికి వెళ్లి టీఆర్ఎస్ చేపడుతున్న పథకాలపై వివరించాలన్నారు. కేంద్రంలో ఉన్న బీజేపీ రాష్ట్రానికి ఏమీ చేయలేదని, పైగా ఆ పార్టీ ఇక్కడ పాగా వేస్తే మతకల్లోలాలకు ఆస్కారం ఉంటుందని వివరించాలన్నారు. తాజా లెక్కల ప్రకారం 104 సీట్లలో టీఆర్ఎస్ ప్రభంజనం ఉందని, కచ్చితంగా ఈ సీట్లలో టీఆర్ఎస్ గెలుపునకు ప్రయత్నించాలని కేసీఆర్ తన సర్వే రిపోర్టును బయటపెట్టినట్టు తెలిసింది.

    మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

    గతంలో ఎంపీ ఎన్నికల్లో గెలిచిన బీజేపీని ఆ తరువాత స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎవరూ పట్టించుకోలేదన్నారు. ఇప్పడు కూడా దుబ్బాకలో గెలిచినా హైదరాబాద్ లో గెలిచే అవకాశం లేదన్నారు. జీహెచ్ఎంసీ ఎన్నికలతో ఏ పార్టీ బలమైనదో తేలుతుందన్నారు. దీపావళి తరువాత నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉన్నా.. ఆ విషయాన్ని కేసీఆర్ అధికారికంగా వెల్లడించలేదు. అయితే ఆయా పార్టీల ఎన్నికలకు సిద్ధమేనని ఎన్నికల కమిషన్ కు వెల్లడించిన తరువాత నోటిఫికేషన్ జారీ అయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.