KCR
KCR: ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సాధనలో ముందడుగు వేసిన కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు(కేసీఆర్) ఆదివారం ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ జయకేతనం ఎగువేసిన తరువాత కేసీఆర్ వెంటనే ఫాం హౌస్ కు వెళ్లిపోయారు. ఈ క్రమంలో ఆయన గత పదేళ్లుగా ప్రగతి భవన్ వేదికగా ప్రజా పాలన నిర్వహించారు. టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ గా మార్చారు. తెలంగాణ రాష్ట్రం బంగారు తెలంగాణ గా మారిందని, ఇప్పుడిక దేశ రాజకీయాల్లోకి వెళ్లి దేశాన్ని బాగు చేద్దామని గతంలో పలుసార్లు చెప్పారు. కానీ తెలంగాణలో అధికారం రాకపోయేసరికి ఇప్పుడిక కేసీఆర్ ఏం చేస్తాడు? ఎలాంటి కార్యక్రమాల్లో పాల్గొంటారు? అని తెలంగాణ వ్యాప్తంగా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు.
రాజకీయ జీవితంలో ఇప్పటి వరకు ఓటమెరుగని కేసీఆర్ మొదటిసారి కామారెడ్డిలో ఓడిపోయారు. దీంతో కేసీఆర్ గురించి సర్వత్రా చర్చించుకుంటున్నారు.ఈ ఎన్నికల్లో హ్యాట్రిక్ కొడుతామనుకొని కనీస సీట్లు కూడా తెచ్చుకోలేకపోయారు. అయితే కేసీఆర్ ఇప్పుడు తెలంగాణలో కాకుండా దేశ రాజకీయాల్లో తనదైన ముద్ర వేయాలని అనుకుంటున్నట్లు సమాచారం. అందుకు ఎంపీగా పోటీ చేసిన జాతీయ రాజకీయాల్లోకి వెళ్లనున్నట్లు తెలుపుతున్నారు.
దేశ రాజకీయాల్లో ప్రవేశించడానికి టీఆర్ఎస్ గా ఉన్న పార్టీని బీఆర్ఎస్ గా మార్చిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఢిల్లీలో ప్రత్యేక కార్యాలయం ఏర్పాటు చేసి అక్కడికి వెళ్లినపపుడు పలువురు నాయకులతో సమావేశాలు నిర్వహిస్తూ వస్తున్నారు. అయితే ఇంతలో తెలంగాణలో ఎన్నికలు రావడంతో ఇక్కడ గెలిచిన తరువాత రాష్ట్ర బాధ్యతలను కుమారుడు కేటీఆర్ కు అప్పజెప్పనున్నట్లు అప్పట్లోప్రచారం జరిగింది. అయితే ఇప్పుడు అధికారం చేజారినా బీఆర్ఎస్ రాష్ట్ర బాధ్యతలు కేటీఆర్ కు ఇస్తారని అంటున్నారు. ఆయననే సీఎల్ పీ నేతగా ఎన్నుకొని శాసనసభకు పంపనున్నారు.
వచ్చే ఎంపీ ఎన్నికల్లో కేసీఆర్ పోటీ చేయనున్నట్లు సమాచారం. ఆ తరువాత పార్లమెంట్ లో అడుగుపెట్టి అక్కడి నుంచే రాజకీయాలను శాసించనున్నట్లు సమాచారం. ఇప్పటికే పలువురు జాతీయ నాయకులతో సంబంధాలు ఏర్పరుచుకున్న ఆయన ఇప్పుడు ప్రత్యేకంగా దేశ రాజకీయాలపైనే దృష్టి సారించనున్నట్లు తెలుస్తోంది. అలాగే వచ్చే ఎన్నికల్లో ఎక్కువ సీట్లు తెచ్చుకొని 2024లో ఏర్పడే ప్రభుత్వంలో కీలక ఉండేందుకు ప్రయత్నిస్తారని అంటున్నారు.
గతంలో వీలైనన్ని ఎంపీ సీట్లు తెచ్చుకుకొని ఒకవేళ సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడితే ప్రధాని పదవి కోరనున్నట్లు తెలుస్తోంది. గతంలో ఎన్నో సార్లు దేశంలో కూడా అధికారంలో ఉండి పలు సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టనున్నట్లు ప్రకటించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు కేసీఆర్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారోనని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.