Bigg Boss Telugu 7: బిగ్ బాస్ తెలుగు 7 చివరి దశకు చేరింది. మరో రెండు వారాల షో మాత్రమే మిగిలి ఉంది. టాప్ 7 నుండి గౌతమ్ తప్పుకున్నాడు. ఆదివారం గౌతమ్ ఎలిమినేట్ అయ్యాడు. అర్జున్ ఫినాలే అస్త్ర గెలుచుకున్న నేపథ్యంలో ఎలిమినేషన్ నుండి మినహాయింపు దక్కింది. అర్జున్ అందరికంటే తక్కువ ఓట్లు తెచ్చుకున్నాడు. ఫినాలే అస్త్ర గెలవకపోతే అర్జున్ ఎలిమినేట్ అయ్యేవాడని నాగార్జున చెప్పడంతో అందరూ షాక్ అయ్యారు.
ఇక ఒక్కొక్కరు సేవ్ అవుతూ వచ్చారు. ప్రశాంత్, శోభ, గౌతమ్ మిగిలారు. ప్రశాంత్ వద్ద అవిక్షన్ పాస్ ఉంది. అది వాడుకుని నామినేషన్స్ నుండి బయటపడవచ్చని ప్రశాంత్ కి నాగార్జున సూచించాడు. నేను అవిక్షన్ పాస్ వాడుకోను, ప్రజలు ఓట్లు వేస్తే ఉంటా లేదంటే వెళ్ళిపోతే అన్నాడు ప్రశాంత్. ప్రశాంత్ అవిక్షన్ పాస్ ని తిరస్కరించిన నేపథ్యంలో శోభ, గౌతమ్ లు ప్రశాంత్ ని కన్విన్స్ చేసి పాస్ వాడుకోవచ్చని అన్నారు.
అయితే శోభ, గౌతమ్ కూడా అవిక్షన్ పాస్ ఉపయోగించుకునేందుకు నిరాకరించారు. తర్వాత గౌతమ్ ఎలిమినేట్ అయినట్లు నాగార్జున ప్రకటించారు. బిగ్ బాస్ హౌస్లో గౌతమ్ జర్నీ ముగిసింది. యాక్టర్ కమ్ డాక్టర్ అయిన గౌతమ్ స్ట్రాంగ్ ప్లేయర్ గా పేరు తెచ్చుకున్నాడు. సీరియల్ బ్యాచ్ తో సన్నిహితంగా ఉండేవాడు. ప్రియాంకతో సిస్టర్ రిలేషన్ మైంటైన్ చేశాడు.
ప్రియాంక కారణంగా గౌతమ్ గేమ్ దెబ్బతింది. గ్రూప్ గేమ్ ఆడుతున్నారని నాగార్జున ఏకి పారేశారు. గౌతమ్ 5వ వారం ఎలిమినేట్ అయ్యాడు. నాగార్జున సెకండ్ ఛాన్స్ ఇచ్చాడు. సీక్రెట్ రూమ్ కి పంపాడు. రీఎంట్రీ తర్వాత మరో 8 వారాలు గౌతమ్ హౌస్లో ఉన్నాడు. ఇక గౌతమ్ రెమ్యూనరేషన్ పరిశీలిస్తే… అతడు వారానికి రూ. 1.5 ఒప్పందం మీద హౌస్లో అడుగుపెట్టాడట. 13 వారాలకు రూ. 19.50 లక్షలు అందుకున్నాడట. గౌతమ్ ఫేమ్ తో పోల్చితే ఇది పెద్ద మొత్తమే. అలాగే సిల్వర్ స్క్రీన్ పై గౌతమ్ బిజీ అయ్యే సూచనలు కలవు.