AP Three Capitals: ఆంధ్రప్రదేశ్ లో మూడు రాజధానుల వ్యవహారంపై ప్రభుత్వం వెనుకడుగు వేయడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కొద్ది రోజులుగా మూడు రాజధానుల వ్యవహారం రాష్ర్టంలో హాట్ టాపిక్ గా మారిన నేపథ్యంలో ప్రజల నుంచి అనూహ్య వ్యతిరేకత వచ్చింది. అమరావతి ప్రజలు అప్పటి నుంచి ఉద్యమం చేస్తున్నారు. ఇటీవల న్యాయస్థానం టు దేవస్థానం పేరుతో మహాపాదయాత్ర చేపట్టడంతో దానికి కూడా అనూహ్య స్పందన రావడంతో ప్రభుత్వం ఇక ఏం చేయాలనే దానిపై దృష్టి సారించింది. ప్రజల్లో చులకన అయిపోతామనే భావంతోనే మూడు రాజధానుల బిల్లు రద్దు చేయడం గమనార్హం.

మరోవైపు రాబోయే ఎన్నికల్లో కూడా మూడు రాజధానుల వ్యవహారం ప్రభుత్వానికి గుదిబండగా మారే అవకాశాలున్నాయని గ్రహించింది. ఇలాగైతే అధికారం దూరమవుతుందనే భయం నేతల్లో పట్టుకున్నట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి వస్తున్న స్పందన చూస్తుంటే కూడా ప్రభుత్వానికి ఏదో జరుగుతుందనే ఆందోళన నెలకొంది. ఈ నేపథ్యంలో మూడు రాజధానుల రద్దుకు నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం.
దీంతోపాటు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సైతం మూడు రాజధానుల రద్దుకే మొగ్గు చూపిన క్రమంలో ఒంటరై పోతామనే ఉద్దేశంతోనే ఈ మేరకు నిర్ణయించినట్లు తెలుస్తోంది. ప్రజల నుంచి వస్తున్న వ్యతిరేకతకు కూడా తలొగ్గే పరిస్థితి ఏర్పడుతోంది. వికేంద్రీకరణ బిల్లును ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంపై రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read: Sai Pallavi: హీరోయిన్గా సాయిపల్లవి చెల్లెలు ఎంట్రీ.. ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది
అమరావతి పాదయాత్రకు బీజేపీ నుంచి కూడా మద్దతు ప్రకటించడంతో వైసీపీలో ఆందోళన పెరిగినట్లు తెలుస్తోంది. దీంతో జగన్ భవిష్యత్ కార్యాచరణ దృష్ట్యా ప్రజల కోసం వెనక్కి తలొగ్గక తప్పలేదని తెలుస్తోంది. ఏది ఏమైనా జగన్ తీసుకున్న మూడు రాజధానుల బిల్లుపై ఇంకా స్పష్టత ఇచ్చి ప్రజల డిమాండ్లు నెరవేర్చే క్రమంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని కోరుతున్నారు.
Also Read: Rajamouli: పవన్ కళ్యాణ్‌తో రాజమౌళి భేటీ.. ఆ విషయంపైనే చర్చించనున్నారా?