Prakash Raj: తెలంగాణలో రాజ్యసభ సభ్యుల ఎంపిక వ్యవహారం కొలిక్కి రావడం లేదు. నామినేషన్లకు ఇవాళే ఆఖరు రోజు కావడంతో సందిగ్ధం ఏర్పడింది. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎటూ తేల్చుకోలేకపోతున్నారు. సామాజిక సమీకరణల దృష్ట్యా అభ్యర్థుల ఎంపికలో సమస్యలు వస్తున్నట్లు తెలుస్తోంది. మరోవైపు ఆంధ్రప్రదేశ్ లో జగన్ బీసీ కార్డు ఉపయోగించుకోవాలని చూస్తుండటంతో కేసీఆర్ కూడా బీసీల వైపు చూస్తున్నట్లు సమాచారం. దీంతో సభ్యుల ఎంపిక ప్రక్రియ వేగవంతం కావడం లేదు. ఈ నేపథ్యంలో ఆయన మదిలో ఇంకెవరు ఉన్నారో అనే అనుమానాలు అందరిలో వస్తున్నాయి.
సినీనటుడు ప్రకాశ్ రాజ్ సైతం రాజ్యసభ సభ్యుడిగా అరంగేట్రం చేయాలని ఉవ్విళ్లూరుతున్నా పరిస్థితులు కలిసి రావడం లేదు. ఆ మధ్య మహారాష్ట్ర పర్యటనలో సీఎం కేసీఆర్ తో ప్రత్యక్షమైన ప్రకాశ్ రాజ్ కు మంచి పదవే ఇస్తారనే ప్రచారం జోరుగా సాగింది. ఈ క్రమంలో వచ్చిన రాజ్యసభ ఎన్నికల్లో ప్రకాశ్ రాజ్ కు చోటు కచ్చితంగా దక్కుతుందనే ఆశించారు. కానీ మారుతున్న రాజకీయ పరిణామాల నేపథ్యంలో మరోసారి ప్రకాశ్ రాజ్ భవితవ్యం డోలాయమానంలో పడనుందని తెలుస్తోంది.
Also Read: Kiara Advani: ‘కియారా’కే ఓటు వేసిన కొరటాల.. సాయిపల్లవి కూడా
హెటిరో డ్రగ్స్ అధినేత పార్థసారధి రెడ్డి, నమస్తే తెలంగాణ ఎండీ దామోదర్ రావు, పెద్దిరాజు రవిచంద్ర లను ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ప్రకాశ్ రాజ్ కు మాత్రం చుక్కెదురు అయింది. రవిచంద్ర స్థానంలో ప్రకాశ్ రాజ్ కు అవకాశం ఇస్తారని భావించారు. కానీ ఏమైందో తెలియదు కానీ ప్రకాశ్ రాజ్ పేరు మాత్రం జాబితాలో లేదు. దీంతో ప్రకాశ్ రాజ్ ఇక టీఆర్ఎస్ కు దూరంగా ఉండనున్నట్లు చెబుతున్నారు. రాజ్యసభ సభ్యుడిగా అవకాశం వస్తుందని ఆశించినా అది సాధ్యం కాకపోవడంతో ఇప్పుడు ఆయన ఏం చేస్తారనే దానిపై ఆసక్తికర చర్చ సాగుతోంది.
కేసీఆర్ కు ఆప్తమిత్రుడిగా ప్రకాశ్ రాజ్ తో జాతీయ రాజకీయాల్లో రాణించాలని అనుకున్నారు. చివరకు రాజ్యసభ పదవి దక్కకపోవడంతో ఆయన అలక బూనినట్లు చెబుతున్నారు. అసలు కేసీఆర్ మదిలో ఏముందో తెలియడం లేదు. ప్రకాశ్ రాజ్ కు ఇంకా ఏదైనా పెద్ద పదవి ఇవ్వబోతున్నారా? లేక ఇంతటితో ఆయన సేవలకు ఫుల్ స్టాప్ పెట్టనున్నారా అనే కోణంలో ఆలోచనలు వస్తున్నాయి. ఏది ఏమైనా ప్రకాశ్ రాజ్ కోరిక మాత్రం తీరడం లేదు. తెలంగాణ ప్రభుత్వంలో ఏదో ఒక పదవి సాధించుకోవాలని చూసినా ఆయన ఆశలు నెరవేరేలా కనిపించడం లేదు.
ప్రకాశ్ రాజ్ కు ఇతర రాష్ట్రాల్లో ఉన్ పరిచయాలతో ఆయన సేవలు వినియోగించుకోవాలని కేసీఆర్ భావించినా ఎందుకో ఆయనకు రాజ్యసభ సభ్యత్వం మాత్రం ఇవ్వలేదు. ప్రకాశ్ రాజ్ రాజకీయ పరిస్థితి ఏమిటన్నది ఇప్పుడు ప్రశ్నార్థకంగా మారింది. మొత్తానికి ఆయన సేవలు వినియోగించుకుంటారా? లేక పక్కన పెడతారా అనేదే తేలాల్సి ఉంది. కేసీఆర్ మాత్రం తాను అనుకున్నది చేయడంలో దిట్ట. కానీ ప్రకాశ్ రాజ్ విషయంలో ఎందుకో పట్టించుకోవడం లేదనే తెలుస్తోంది.
తెలంగాణలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ఆర్. కృష్ణయ్యకు ఏపీ సీఎం జగన్ రాజ్యసభ పదవి ఇచ్చి కొత్త చర్చకు తెర లేపారు. దీంతో జగన్ వ్యూహంతో చంద్రబాబును ఇరుకున పెట్టాలని చూస్తున్నారని తెలుస్తోంది. ఇక్కడ మాత్రం కేసీఆర్ ఏ సమీకరణలు లెక్కలోకి తీసుకోనట్లు కనిపిస్తోంది. దీంతో భవిష్యత్ లో ఇంకా ఎలాంటి మార్పులు చోటుచేసుకుంటాయో వేచి చూడాల్సిందే.
Also Read:Balakrishna- Naveen Polisetty: బాలయ్యతో కుర్ర హీరో.. అనిల్ రావిపూడి ప్లానింగ్ సూపర్