సలహాదారు విధులేమిటి: హైకోర్టు సూటి ప్రశ్న

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వ సలహాదారులుగా ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వైనంపై సాక్షాత్తు రాష్ర్ట హైకోర్టు ఆశ్చర్యపోయింది. నీలం సాహ్నివిని సలహాదారుగా నియమించడంపై దాఖలైన పిటిషన్ పై విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంలో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చక్రం తిప్పుతున్నారు. ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ప్రతి విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు చెబుతూ తానే సర్వస్వం అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలను సైతం విమర్శిస్తూ […]

Written By: Srinivas, Updated On : July 9, 2021 6:58 pm
Follow us on

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు కొత్త మలుపులు తిరుగుతున్నాయి. ప్రభుత్వ సలహాదారులుగా ఉండి ప్రభుత్వాన్ని నడిపిస్తున్న వైనంపై సాక్షాత్తు రాష్ర్ట హైకోర్టు ఆశ్చర్యపోయింది. నీలం సాహ్నివిని సలహాదారుగా నియమించడంపై దాఖలైన పిటిషన్ పై విచారణలో కీలక వ్యాఖ్యలు చేసింది. ప్రభుత్వంలో సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి చక్రం తిప్పుతున్నారు.

ప్రభుత్వాన్ని తన కనుసన్నల్లో నడిపిస్తూ అందరిని ఆశ్చర్యానికి గురి చేస్తున్నారు. ప్రతి విషయాన్ని ఆయనే స్వయంగా మీడియాకు చెబుతూ తానే సర్వస్వం అనే ధోరణిలో వ్యవహరిస్తున్నారు. ప్రతిపక్షాలను సైతం విమర్శిస్తూ తన పంతం నెగ్గించుకుంటున్నారు. దీనిపై అన్ని వర్గాల నుంచి విమర్శలే వస్తున్నాయి. కోర్టులో వాదనలు వినిపిస్తున్న ప్రభుత్వ న్యాయవాది సీవీ మోహన్ రెడ్డి గతంలో ఏజీగా పనిచేశారు.

ప్రభుత్వ సలహాదారుగా ఉండి రాజకీయాలు మాట్లాడొచ్చా అని అందరిలో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. సలహాదారు అంటే ఎవరు? అతని విధులేంటి అనే విషయాలు చెప్పాలని హైకోర్టు సూచించింది. ప్రస్తుతం ప్రభుత్వానికి పెద్ద ఎత్తున సలహాదారులు ఉన్నారు. సొంత మీడియాలో వేతనాలు తగ్గించుకోవాలనే నెపంతో కొందరిని సలహాదారులుగా నియమించుకున్న విధానంపై కూడా ఆశ్చర్యం వ్యక్తం చేసింది.

సజ్జల ఆదేశిస్తే మొత్తం ప్రభుత్వమే ఆయన కనుసస్నల్లో పని చేస్తుంది. దీంతో అసలు సలహాదారులు ఏం చేస్తారనే అనుమానం అందరిలో కలుగుతోంది. ప్రజాధనాన్ని జీతంగా తీసుకుంటూ పెద్దరికం చేస్తుండడాన్ని తప్పు పడుతున్నారు. మంత్రుల శాఖలపై సైతం అజమాయిషీ చేయడంపై పలువరు మంత్రులు కూడా సందేహాలు వ్యక్తం చేస్తున్నారు.