https://oktelugu.com/

నిమ్మగడ్డ పరిస్థితి ఏమైంది?

దేశంలో గతంలో జాతీయ ఎన్నికల కమిషనర్ గా టీఎన్ శేషన్ కొనసాగినప్పుడు రాజకీయ పార్టీలు గజగజ వణికాయి. నియమనిబంధనలు కఠినంగా అమలు చేయడంతో నివ్వెరపోయారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా కొనసాగిన రమేష్ కుమార్ అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టారు. దీంతో టీడీపీకి మద్దతుగా పనిచేశారని అపవాదును మూటగట్టుకున్నారు. దీంతో రమేష్ కుమార్ పై ప్రివిలేజ్ కమిటీలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టారు. గతంలోనే ఆయనకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. […]

Written By:
  • Srinivas
  • , Updated On : June 17, 2021 / 09:53 AM IST
    Follow us on

    దేశంలో గతంలో జాతీయ ఎన్నికల కమిషనర్ గా టీఎన్ శేషన్ కొనసాగినప్పుడు రాజకీయ పార్టీలు గజగజ వణికాయి. నియమనిబంధనలు కఠినంగా అమలు చేయడంతో నివ్వెరపోయారు. గత ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ఎన్నికల కమిషనర్ గా కొనసాగిన రమేష్ కుమార్ అధికార పార్టీని ముప్పతిప్పలు పెట్టారు. దీంతో టీడీపీకి మద్దతుగా పనిచేశారని అపవాదును మూటగట్టుకున్నారు. దీంతో రమేష్ కుమార్ పై ప్రివిలేజ్ కమిటీలో సభా హక్కుల ఉల్లంఘన తీర్మానం పెట్టారు. గతంలోనే ఆయనకు ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసింది. కరోనా తీవ్రత కారణంగా ఇప్పటి వరకు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయాన్ని పక్కన పెట్టారు. ప్రస్తుతం కరోనా తగ్గడంతో ఆయనపై మరోసారి నోటీసులు జారీ చేసేందకు అవకాశముంది.

    రమేష్ కుమార్ ఎన్నికల కమిషనర్ గా ఉన్న సమయంలో ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురి చేసిన విషయం తెలిసిందే. స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రభుత్వానికి వ్యతిరేకంగానే పని చేశారు.దీంతో వైసీపీ వర్గాలు ఆయనపై కోపంతో ఉన్నాయి. ఆయన తీరుపై పెద్ద ఎత్తున విమర్శలు వచ్చాయి. అయినా నిమ్మగడ్డ పట్టించుకోలేదు. అంతటితో ఆగకుండా నిమ్మగడ్డ హోంశాఖకు లేఖ రాయడం సంచలనం సృష్టించింది.

    నిమ్మగడ్డ రమేష్ కుమార్ హోంశాఖకు రాసిన లేఖలో జగన్ ను ఫ్యాక్షనిస్ట్ గా చిత్రీకరించారు. దీంతో వైసీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. దీని వెనుక టీడీపీ నేతలు ఉన్నారని వైసీపీ నేతలు ఆరోపించారు. దీనిపై సీఐడీ దర్యాప్తునకు ప్రభుత్వం ఆదేశించింది. ఏఢాదిన్నర పాటు రమేష్ కుమార్ ఉద్యోగంలో కొనసాగారు. ఈ కాలంలో వైసీపీ నేతలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు.

    ఇటీవల వైసీపీ నేతల్లో ఒకరు నిమ్మగడ్డ రమేష్ కుమార్ విషయంలో ప్రివిలేజ్ కమిటీలో కేసు పురోగతిని స్వయంగా పరిశీలించినట్లు తెలిసింది. ఆయన మరోసారి నిమ్మగడ్డకు నోటీసులు పంపాలని అధికారులను కోరినట్లు తెలిసింది. నిమ్మగడ్డరమేష్ కుమార్ ఉద్యోగ విరమణ చేసి హైదరాబాద్ లోనే ఉంటున్నారు. కరోనా తీవ్రత తగ్గుముఖం పట్టిన తరువాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ ప్రివిలేజ్ కమిటీ నోటీసులు జారీ చేసే అవకాశం ఉంది.