Modugula Venugopala Reddy: మాజీ క్రికెటర్ అంబటి రాయుడు సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. వైసీపీలోకి పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు.జగన్ గుంటూరు ఎంపీ స్థానం నుంచి అంబటి రాయుడు తో పోటీ చేయిస్తారని ప్రచారం జరుగుతోంది. పార్టీ ఆవిర్భావం నుంచి గుంటూరు పార్లమెంట్ స్థానం వైసీపీకి చిక్కడం లేదు. గత రెండు ఎన్నికల్లో టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన గల్లా జయదేవ్ విజయం సాధించారు. అయితే ఆయన మూడోసారి బరిలో దిగుతారా? లేదా?అన్న చర్చ సాగుతోంది.ఇటీవల టిడిపి కార్యక్రమాల్లో ఆయన పెద్దగా కనిపించకపోవడంతో.. కొత్త వ్యక్తి పరిధిలో దిగే ఛాన్స్ కనిపిస్తోంది.
ఇప్పటివరకు గుంటూరు పార్లమెంట్ స్థానం వైసీపీ అభ్యర్థిగా మోదుగుల వేణుగోపాల్ రెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరిగింది. అయితే ఆయనకు టిక్కెట్ ఇచ్చే ఛాన్స్ లేదని టాక్ వినిపిస్తోంది. గత ఎన్నికలకు ముందు టిడిపి నుంచి ఆయన వైసీపీలో చేరారు. రెడ్డి సామాజిక వర్గం ఒత్తిడి మేరకు ఆయన అప్పట్లో నిర్ణయం తీసుకున్నారు. గత ఎన్నికల్లో ఎంపీగా పోటీ చేశారు. కానీ ఓడిపోయారు. అప్పటినుంచి ఆయన పెద్దగా కనిపించిన దాఖలాలు లేవు. ఇప్పుడు ఏకంగా ఆయన స్థానంలో అంబటి రాయుడిని తెచ్చారు. ఇప్పుడు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి నిర్ణయం ఎలా ఉంటుందో చూడాలి.
ఆళ్ల అయోధ్య రామిరెడ్డి కి మోదుగుల వేణుగోపాల్ రెడ్డి సమీప బంధువు. అయోధ్య రామిరెడ్డి సోదరుడు ఆళ్ళ రామకృష్ణారెడ్డి. గత రెండు ఎన్నికల్లో మంగళగిరి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఇటీవల ఆయనకు సాగనంపారు. వైసీపీ నియోజకవర్గ ఇన్చార్జిగా గంజి చిరంజీవిని నియమించారు. ఇప్పుడు మరో బంధువు మోదుగుల వేణుగోపాల్ రెడ్డి కి ఝలక్ ఇచ్చారు. దీంతో అయోధ్య రామిరెడ్డి విషయం ఏంటన్నది తెలియడం లేదు. నరసరావుపేట ఎంపీ స్థానానికి అయోధ్య రామిరెడ్డి పేరు వినిపిస్తోంది. గతంలో ఆయన పోటీ చేసి ఓడిపోయారు.అటు వేణుగోపాల్ రెడ్డి ప్రజారాజ్యంలో పొలిటికల్ ఎంట్రీ ఇచ్చారు. అటు తర్వాత టిడిపిలో చేరి కీలక పదవులు చేపట్టారు. గుంటూరు ఎంపీ తో పాటు నగరంలోని పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యేగా గెలిచారు. వైసీపీ లోకి అడుగుపెట్టిన తర్వాత పవర్ పాలిటిక్స్ కు దూరమయ్యారు. ఇప్పుడు వైసీపీ హై కమాండ్ ఆయన్ను పక్కన పెట్టినట్లు తెలుస్తోంది. దీంతో మోదుగుల రాజకీయ భవిష్యత్తు కోసం ఎటువైపు అడుగులు వేస్తారో చూడాలి.