Chandrababu- KTR: చంద్రబాబు అరెస్ట్ పై కేటీఆర్ నిజంగా బాధపడుతున్నారా? లోకేష్ ట్విట్ పై ఆయన స్పందించడం దేనికి సంకేతం? సుమారు 35 రోజుల తర్వాత సానుభూతి ప్రకటించడం ఎందుకు? రెండు రాష్ట్రాల్లో ఇప్పుడు దీనిపైనే బలమైన చర్చ నడుస్తోంది. కేటీఆర్ ఇంతలా బాధపడడానికి కారణం ఏంటి? ఎక్కువమంది ఆరా తీస్తున్నారు. అయితే రాజకీయ ప్రయోజనాల కోసమే ఇలా స్పందించి ఉంటారని ఎక్కువమంది భావిస్తున్నారు.
గత నెల 10న నంద్యాలలో చంద్రబాబును సిఐడి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఏసీబీ కోర్టులో హాజరు పరిచారు. న్యాయస్థానం రిమాండ్ విధించింది. అయితే చంద్రబాబును అరెస్టు చేసిన కొద్ది సేపటికే కేటీఆర్ ఓ వివాదాస్పద ట్విట్ చేశారు. జగన్ ను అభినందించేలా ఆ ట్విట్ ఉంది. చంద్రబాబు అరెస్టును సమర్థిస్తూ.. జగన్ చర్యలను మెచ్చుకునేలా.. అర్థం వచ్చేలా కేటీఆర్ ట్విట్ పెట్టారు. అక్కడ కొద్ది రోజులకు హైదరాబాదులో చంద్రబాబు అరెస్టుకు నిరసనగా ఐటి ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. అటువంటి వారందరికీ తెలంగాణ సర్కార్ నియంత్రించినట్లు వార్తలు వచ్చాయి. ఐటీ యాజమాన్యాలకు తెలంగాణ ప్రభుత్వం నుంచి ఒత్తిళ్లు ఎదురయ్యాయని టాక్ నడిచింది.
అటువంటి పరిస్థితుల్లో చంద్రబాబు అరెస్టుపై కేటీఆర్ స్పందించారు. అక్రమ అరెస్టు అని కానీ.. బాధాకరం అని కానీ ప్రకటించలేదు. హైదరాబాద్లో నిరసన కార్యక్రమాల విషయంలో సహకరించాలని లోకేష్ కోరినట్లు కేటీఆర్ చెప్పుకొచ్చారు. అది రెండు పార్టీల మధ్య వివాదమని.. దానిని తెలంగాణతో ఎలా ముడి పెడతారని.. అలా చేస్తే హైదరాబాద్ ఐటి దెబ్బతింటుందని.. అందుకే సహకరించలేమని లోకేష్ కు తేల్చి చెప్పినట్లు కేటీఆర్ ప్రకటించారు. కానీ ఇప్పుడు భావోద్వేగ ప్రకటన చేశారు. చంద్రబాబు ఆరోగ్య పరిస్థితి పై పదేపదే బాధపడుతున్నారు.
అయితే కేటీఆర్ లో వచ్చిన ఈ మార్పు పై రకరకాల చర్చలు అవసరం లేదు. అది తెలంగాణ ఎన్నికలే అని అందరికీ తెలిసిన విషయమే. సాక్షాత్ బీజేపీ అగ్రనేత అమిత్ షా స్పందించారు. ఇప్పుడు గానీ తాను స్పందించకుంటే సెటిలర్స్ తో పాటు కమ్మ సామాజిక వర్గం దూరమవుతుందని కేటీఆర్ కు తెలుసు. తన మాటలతో ఇప్పటికే డ్యామేజ్ జరిగిపోయిందని.. ఇప్పటికైనా మేల్కొనకుంటే కష్టమని కేటీఆర్ ఒక నిర్ణయానికి వచ్చారు. ఇప్పటికే ఒక తప్పు జరిగిపోయింది అని.. కేవలం బాధను మాత్రమే వ్యక్తం చేయగలమని… సమర్థిస్తే వైసిపి అనుకూల బ్యాచ్ సైతం దూరమవుతుందని కేటీఆర్ భావిస్తున్నారు. అందుకే లోకేష్ ను చూసి బాధను వ్యక్తం చేయడం ద్వారా డ్యామేజ్ ను తగ్గించుకోవాలని చూస్తున్నారు.