Bhagavanth Kesari First Review: మరో వారం రోజుల్లో భగవంత్ కేసరి విడుదల కానుంది. దీంతో మూవీ సెన్సార్ పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో టాక్ బయటకు వచ్చింది. బాలకృష్ణ లేటెస్ట్ ఎమోషనల్ యాక్షన్ ఎంటర్టైనర్ భగవంత్ కేసరి చిత్ర నిడివి 2 గంటల 44 నిమిషాలు. ఇక సినిమాకు యూ/ఏ సర్టిఫికెట్ ఇచ్చారు. మూవీ చూసిన సెన్సార్ సభ్యులు పాజిటివ్ రిపోర్ట్స్ ఇచ్చినట్లు సమాచారం. దర్శకుడు అనిల్ రాఘవపూడి యాక్షన్, ఎమోషన్, కామెడీ కలగలిపి పక్కా కమర్షియల్ ఎంటర్టైనర్ గా రూపొందించారట.
ఫస్ట్ హాఫ్ మొత్తం బాలకృష్ణ-శ్రీలీల మధ్య కామెడీ, ఎమోషనల్ సన్నివేశాలతో మూవీ నడుస్తుందట . ఈ సన్నివేశాలు అలరించేలా ఉంటాయట. శ్రీలీల-బాలయ్య కాంబోలో తెరకెక్కిన గణపతి సాంగ్ హైలెట్ గా ఉంటుందని అంటున్నారు. అయితే కాజల్ తో పాటలు లేవట. కథ డిమాండ్ చేయకపోవడంతో ఆ తరహా సాంగ్స్ ఈ సినిమాలో పెట్టలేదట. అయితే విడుదల అనంతరం దసరా రోజు ఓ సాంగ్ విడుదల చేస్తారట.
ఇక ఇంటర్వెల్ బ్యాంగ్ అదిరిపోతుందట. బాలయ్య చేప్పే హిందీ డైలాగ్స్ కేక అంటున్నారు. విలన్ అర్జున్ రామ్ పాల్ తో బాలయ్య సన్నివేశాలు గూస్ బంప్స్ తెప్పించడం గ్యారెంటీ అన్నమాట వినిపిస్తోంది. ఇక సినిమాకే హైలెట్ గా మరో గెటప్ ఉందట. అది ట్రైలర్ లో కూడా చూపించలేదట. తెలంగాణ నేపథ్యంలో నడిచే ఈ స్టోరీ కొత్తగా ఉందట. భగవంత్ కేసరి చిత్రంలో మరో హైలెట్ థమన్ బీజీఎమ్ అంటున్నారు. విమర్శలకు చెక్ పెట్టేలా థమన్ దుమ్మురేపాడట.
మొత్తంగా భగవంత్ కేసరితో బాలయ్య మరో హిట్ కొట్టడం ఖాయం అంటున్నారు. దసరా కానుకగా అక్టోబర్ 19న వరల్డ్ వైడ్ విడుదల కానుంది. అడ్వాన్స్ బుకింగ్స్ యూఎస్లో మొదలయ్యాయి. అఖండ, వీరసింహారెడ్డి చిత్రాలతో బాలకృష్ణ బ్యాక్ టూ బ్యాక్ హిట్స్ కొట్టాడు. దాంతో భగవంత్ కేసరిపై అంచనాలు పెరిగిపోయాయి. బాలయ్య ఫ్యాన్స్ ఈ మూవీ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.