https://oktelugu.com/

Shraddha Kapoor : ఎవరు ఈ శ్రద్దా కపూర్.. మోడీనే మించిపోయేంత క్రేజ్ రావడానికి ఈ హీరోయిన్ లో ఏముంది..? బ్యాక్ గ్రౌండ్ చూస్తే ఆశ్చర్యపోతారు!

దేశంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగియున్న మూడవ సెలబ్రిటీ గా శ్రద్దా కపూర్ నిల్చింది. మొదటి స్థానంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉండగా, రెండవ స్థానంలో ప్రియాంక చోప్రా కొనసాగుతుంది.

Written By:
  • Vicky
  • , Updated On : August 31, 2024 / 09:24 PM IST

    What is special about Shraddha Kapoor to get craze more than Narendra Modi

    Follow us on

    Shraddha Kapoor : లేడీ ఓరియెంటెడ్ సినిమాలు మన ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ లో భారీ బ్లాక్ బస్టర్స్ అవ్వడం కొత్తేమి కాదు. ఇది వరకు ఎన్నో లేడీ ఓరియెంటెడ్ సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద సత్తా చాటాయి. కానీ ఏ చిత్రం కూడా స్టార్ హీరోల ఇండస్ట్రీ రికార్డ్స్ ని బద్దలు కొట్టి ఆల్ టైం నెంబర్ 1 గా నిలబడలేదు. ప్రస్తుతం బాలీవుడ్ బాక్స్ ఆఫీస్ ని షేక్ చేస్తున్న ‘స్త్రీ2’ చిత్రం అలాంటి అరుదైన రికార్డుని నెలకొల్పబోతుందా?, త్వరలోనే 500 కోట్ల రూపాయిల నెట్ వసూళ్లను రాబట్టిన సినిమాల లిస్ట్ లోకి చేరబోతున్న ఈ సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ చిత్రం వెయ్యి కోట్ల రూపాయిల గ్రాస్ ని కొల్లగొట్టిన మొట్టమొదటి ప్రాంతీయ బాషా చిత్రంగా నిలబడబోతుందా అంటే అవుననే అంటున్నారు ట్రేడ్ పండితులు.

    ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమాకి ఈ స్థాయి వసూళ్లు ఏంటి?, అసలు ఎవరు ఈ శ్రద్దా కపూర్, ప్రభాస్ పక్క హీరోయిన్ గా చేసిన ఈమెకు ఇంతటి స్టామినా ఉందా?, అసలు ఈమె బ్యాక్ గ్రౌండ్ ఏమిటి అనేది ఇప్పుడు మనం ఈ కథనంలో చూడబోతున్నాం. శ్రద్దా కపూర్ ప్రముఖ బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కుమార్తె. ఈమె 2010 వ సంవత్సరం లో ‘టీన్ పట్టి’ అనే సినిమా ద్వారా వెండితెర అరంగేట్రం చేసింది. ఇందులో అమితాబ్ బచ్చన్, మాధవన్ వంటి వారు ప్రధాన పాత్రలు పోషించారు. అప్పట్లో మంచి అంచనాల నడుమ విడుదలైన ఈ చిత్రానికి నెగెటివ్ రివ్యూస్ మొదటి ఆట నుండే వచ్చాయి. కానీ శ్రద్దా కపూర్ కి మాత్రం పాజిటివ్ రివ్యూస్ వచ్చాయి. ఈమెకి మంచి భవిష్యత్తు ఉంది. నటిగా ఈమెలో ఎంతో పొటెన్షియల్ దాగుంది అని ఆ రివ్యూస్ లో రాసారు. ఈ చిత్రం తర్వాత ఆమె ‘లవ్ కా ది ఎండ్’ అనే చిత్రం చేసింది. అది కూడా ఆశించిన స్థాయిలో విజయం సాధించలేదు.

    ఈ రెండు సినిమాల తర్వాత విడుదలైన ‘ఆషీకీ 2 ‘ చిత్రం ఈమె కెరీర్ ని ఒక మలుపు తిప్పింది అనే చెప్పాలి. నేడు మీరంతా ఈ హీరోయిన్ కి ఇంత స్టామినా ఎలా వచ్చింది అని ఆశ్చర్యపోతున్నారు కదా?, ఈ సినిమాలో ఆమె నటన చూస్తే ఇంత ఫాలోయింగ్ రావడంలో ఆశ్చర్యమే లేదు అని మీకు అనిపిస్తాది. ఈ చిత్రం తర్వాత ఆమె వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం రాలేదు. ‘ఏక్ విలన్’, ‘హైడెర్’, ‘ఓకే జాను’, ‘భాగీ’ ఇలా ఒక్కటా రెండా ఎన్నో సూపర్ హిట్లు, బ్లాక్ బస్టర్లు అందుకొని యూత్ లో కల్ట్ ఫ్యాన్ బేస్ ని సంపాదించుకుంది. ముఖ్యంగా సోషల్ మీడియా లో ఈమెకి ఉన్నటువంటి ఫాలోయింగ్ చూస్తే ఎవరికైనా మతిపోక తప్పదు. ఒక్క ఇంస్టాగ్రామ్ లోనే ఈమెకి 92 మిలియన్ల ఫాలోవర్లు ఉన్నారు. మన భారత ప్రధాని నరేంద్ర మోడీ కి కూడా అంత ఫాలోయింగ్ లేకపోవడం గమనార్హం.

    మోడీకి కేవలం 91 మిలియన్ల ఫాలోవర్లు మాత్రమే ఉన్నారు. శ్రద్దా కపూర్ కి ఆ స్థాయి లో రీచ్ రావడానికి కారణం ఆమె తనకి సంబంధించిన రోజువారీ విశేషాలను అభిమానులతో పంచుకోవడమే కాకుండా, హాట్ ఫోటోలు, వీడియోలు అప్లోడ్ చేస్తూ ఉండడం వల్ల ఆమెకి ఈ స్థాయి ఫాలోవర్లు వచ్చారు. అంతే కాకుండా ఆమె వద్ద శైలు అనే క్యూట్ పప్పీ ఉంది. ఈ పప్పీ తో ఆమె గడిపే మధుర క్షణాల గురించి అభిమానులతో పంచుకోవడం చాలా బాగా అనిపిస్తూ ఉంటుంది. అలాంటి వీడియోలకు, ఫోటోలకు మిలియన్ల సంఖ్యలో లైక్స్ కూడా వచ్చాయి. ఆమెకు ఆ స్థాయి ఫాలోవర్లు రావడానికి ఇది కూడా ఒక కారణం. దేశంలోనే అత్యధిక ఫాలోవర్లు కలిగియున్న మూడవ సెలబ్రిటీ గా శ్రద్దా కపూర్ నిల్చింది. మొదటి స్థానంలో క్రికెటర్ విరాట్ కోహ్లీ ఉండగా, రెండవ స్థానంలో ప్రియాంక చోప్రా కొనసాగుతుంది.