కాంగ్రెస్ లో పదవుల కేటాయింపు అంటే.. అదో ఎడతెగని యవ్వారం. నాకు కావాలంటే.. నాకే కావాలంటూ పోటీ పడే వాళ్ళు కొందరైతే.. ఎవరికి ఇచ్చినా పర్లేదుగానీ, వాళ్లకు మాత్రం ఇవ్వొద్దు అనే బ్యాచ్ మరొకటి! ఇప్పుడు పీసీసీ ఎంపిక విషయంలోనూ ఈ రెండు బ్యాచీలు తమ తంతు కొనసాగించేందుకు ఢిల్లీ దాక వెళ్లాయి.
Also Read: టీ-కాంగ్రెస్ లో భస్మాసుర హస్తాలు..!
రేవంత్ వైపే మొగ్గు..
తెలంగాణ కాంగ్రెస్ ఇంచార్జి మాణిగం ఠాగూర్ హైదరాబాద్ వచ్చి మూడు రోజుల పాటు ఉండి అభిప్రాయాలు సేకరించి వెళ్లారు. అయితే.. మాణిగం ఠాగూర్ హైదరాబాద్‌లో ఉండగానే… పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డినే నియమించాలని మెజారిటీ అభిప్రాయం వినపడిందట. అయితే.. అంతకు ముందునుంచే చాలా మంది ఆశావహులు డైరెక్టుగానో.. ఇండైరెక్టుగానో తమ పేర్లు ప్రచారంలో పెట్టుకున్నారు. వారిలో కోమటిరెడ్డి నుంచి జగ్గా రెడ్డి వరకూ ఉన్నారు. కొంత మంది ఈ సారి పీసీసీ చీఫ్‌ను బీసీ వర్గం నుంచి నియమించాలని పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ లాంటి వారి పేర్లను వెలుగులోకి తెచ్చారు.
Also Read: పీసీసీ లొల్లి.. ఢిల్లీకి క్యూ కడుతున్న సీనియర్లు..!
షాడో హస్తం..?
ఆశలు.. ఆశావహుల సంగతి ఎలా ఉన్నా.. ప్రస్తుత పరిస్తితుల్లో కాంగ్రెస్ కు దూకుడైన నేత అవసరం చాలా ఉందన్నది వాస్తవం. సాంప్రదాయ కాంగ్రెస్ నేతల్లో అది ఎంతమేర ఉందో కూడా అందరికీ తెలుసు. కాబట్టి రేవంత్ అయితేనే బాగుంటుందని చాలా మంది కోరికట. కానీ.. సీనియర్లు మోకాలడ్డుతున్నారని టాక్. ఎప్పటినుంచో పార్టీలో ఉన్న సీనియర్లను కాదని, టీడీపీ నుంచి వచ్చిన వ్యక్తికి పీసీసీ ఎలా కట్టబెడతారని తెగ ఇదై పోతున్నారట.
మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్
ఢిల్లీలో లొల్లి..
ఇస్తే మా సీనియర్లకే ఇవ్వాలి తప్ప, జూనియర్లకీ.. బయటై నుంచి వచ్చిన వాళ్లకి ఇవ్వొద్దని నొక్కి వక్కాణించేందుకు ఢిల్లీ వెల్లిందట సీనియర్ బ్యాచ్. అయితే.. ఈ వ్యవహారం వెనుక.. ఓ అదృశ్య శక్తి ఉందన్న ప్రచారం కాంగ్రెస్‌లోనే ఉంది. అది ఎవరు..? ఆ శక్తి ప్రభావం ఎంత..? అనేది మాత్రం తెలియట్లేదు. రేవంత్ రెడ్డి మాత్రం.. హైకమాండ్ తనను గుర్తిస్తుందని, తను ప్రత్యేకంగా ప్రయత్నాలు చేయాల్సిన అవసరం లేదన్నట్లుగా ఉన్నారని సమాచారం. మరి, ఎవరికి పీసీసీ వస్తుందో..? లాబీయింగులు ఎంతమేర పనిచేస్తాయో చూడాలి.