https://oktelugu.com/

రిజిస్ట్రేషన్ చింత.. ప్రణాళిక లోపమేనా..?

అవినీతికి ఆస్కారం లేని రెవెన్యూ సంస్కరణలు తెస్తున్నామని, ధరణి పోర్టల్ ద్వారా జరగనున్న రిజిస్ట్రేషన్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ కొత్త విధానాన్ని అమలుచేసే ప్రక్రియలో భాగంగా.. మూడు నెలల కిందట ఆస్తుల రిజిస్ట్రేషన్ మొత్తం నిలిపివేశారు. అయితే.. నూతన విధానంలో తలెత్తిన పలు ఇబ్బందులతో రిజిస్ట్రేషన్ జాప్యమైంది. చివరికి ఎలాగోలా.. వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను ధరణి ద్వారా ప్రారంభించగలిగారు. Also Read: కేసీఆర్ సర్కారుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రాములమ్మ..! […]

Written By: , Updated On : December 14, 2020 / 05:03 PM IST
Follow us on

Dharani Portal
అవినీతికి ఆస్కారం లేని రెవెన్యూ సంస్కరణలు తెస్తున్నామని, ధరణి పోర్టల్ ద్వారా జరగనున్న రిజిస్ట్రేషన్లు దేశానికే ఆదర్శంగా నిలుస్తాయని కేసీఆర్ గతంలో ప్రకటించారు. ఈ కొత్త విధానాన్ని అమలుచేసే ప్రక్రియలో భాగంగా.. మూడు నెలల కిందట ఆస్తుల రిజిస్ట్రేషన్ మొత్తం నిలిపివేశారు. అయితే.. నూతన విధానంలో తలెత్తిన పలు ఇబ్బందులతో రిజిస్ట్రేషన్ జాప్యమైంది. చివరికి ఎలాగోలా.. వ్యవసాయ ఆస్తుల రిజిస్ట్రేషన్‌ను ధరణి ద్వారా ప్రారంభించగలిగారు.

Also Read: కేసీఆర్ సర్కారుపై మరోసారి సంచలన వ్యాఖ్యలు చేసిన రాములమ్మ..!

“వ్యవసాయేతర” చిక్కులు..
అయితే.. వ్యవసాయేతర ఆస్తుల రిజిస్ట్రేషన్ విషయానికి వచ్చే సరికి న్యాయపరమైన చిక్కులు ఎదురయ్యాయి. అసలు ధరణి వెబ్‌సైట్‌లో సమాచానికి ఎంత భద్రత ఉంది..? ఎలాంటి చట్ట బద్ధత ఉంది? అంటూ.. పలువురు కోర్టు మెట్లు ఎక్కారు. దీంతో పరిస్థితి మొత్తం మారిపోయింది. ఆ సమాచారానికి పూర్తి స్థాయి భద్రత, చట్టబద్ధత ఉందని ప్రభుత్వం హైకోర్టు ముందు బలంగా వాదించలేకపోయింది. కౌంటర్లు దాఖలు చేయడానికి అదే పనిగా సమయం కోరడంతో.. రిజిస్ట్రేషన్లపై స్టే కొనసాగుతూ వచ్చింది.

Also Read: దెబ్బపడితే కానీ కేసీఆర్ సార్ కు నిరుద్యోగులు గుర్తుకురాలేదన్న మాట!

తలొగ్గక తప్పలేదు..
రిజిస్ట్రేషన్లు మొదలు పెడితే.. ధరణిలోనే చేపట్టాలని సర్కారు భావించింది. కానీ.. కాలం గడిచిపోతుండటంతో అమ్మకాలు, కొనుగోళ్లు జరగక జనం ఇబ్బంది పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజల నుంచి వచ్చే ఒత్తిడికి సర్కారు తలొగ్గక తప్పలేదు. ఇంత కాలం.. రిజిస్ట్రేషన్లపై కోర్టు స్టే ఉందని చెబుతూ వచ్చినా… పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు చేపట్టడానికి ఎలాంటి స్టే లేదని కోర్టు స్పష్టం చేయడంతో ప్రారంభించక తప్పలేదు.

మరిన్ని తెలంగాణ రాజకీయ వార్తల కోసం తెలంగాణ పాలిటిక్స్

ఆలోచన మంచిదే అయినా..
నిజానికి రిజిస్ట్రేషన్, రెవెన్యూ విభాగాల్లో నెలకొన్న అవినీతి అందరికీ తెలిసిందే. దాన్ని ప్రక్షాళన చేయడానికి తీసుకున్న ఈ నిర్ణయం మంచిదే. కానీ.. తగిన ముందస్తు ప్రణాలిక లేకపోవడం వల్లే ఈ ఇబ్బందులు తలెత్తాయనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. కాగా.. ప్రస్తుతం పాత పద్ధతిలో రిజిస్ట్రేషన్లు కొనసాగించి, న్యాయపరమైన చిక్కులు తొలగిన తర్వాత పూర్తి స్థాయిలో ధరణి ద్వారానే రిజిస్ట్రేషన్లు కొనసాగించాలనే యోచనలో సర్కారు ఉందని సమాచారం.