వంగి దండాలు పెట్టినా.. కేసీఆర్ ను వదిలిపెట్టే సమస్యే లేదా?

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు రాజకీయాలు హిటెక్కాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించిన బీజేపీ.. ఆ వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తాచాటింది. దీంతో తెలంగాణలోని బీజేపీ శ్రేణులో ఫుల్ జోష్ నెలకొంది. దీంతో ఆ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు మొదలయ్యాయి. దుబ్బాక, గ్రేటర్ ఫలితాలతో అప్రమత్తమైన కేసీఆర్ బీజేపీని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈక్రమంలోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులతో వరుసగా భేటి అయి […]

Written By: Neelambaram, Updated On : December 14, 2020 5:58 pm
Follow us on

తెలంగాణలో టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లు రాజకీయాలు హిటెక్కాయి. దుబ్బాక ఉప ఎన్నికల్లో అధికార పార్టీని ఓడించిన బీజేపీ.. ఆ వెంటనే జీహెచ్ఎంసీ ఎన్నికల్లోనూ సత్తాచాటింది. దీంతో తెలంగాణలోని బీజేపీ శ్రేణులో ఫుల్ జోష్ నెలకొంది. దీంతో ఆ పార్టీలోకి ఇతర పార్టీల నుంచి వలసలు మొదలయ్యాయి.

దుబ్బాక, గ్రేటర్ ఫలితాలతో అప్రమత్తమైన కేసీఆర్ బీజేపీని ఇరుకున పెట్టేందుకు వ్యూహాలు రచిస్తున్నారు. ఈక్రమంలోనే కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి ప్రధాని మోదీ.. కేంద్ర మంత్రులతో వరుసగా భేటి అయి కేంద్రానికి రావాల్సిన నిధులపై చర్చించారు. సీఎం కేసీఆర్ ఇదే టూర్లో ఢిల్లీలోని రైతులకు సంఘీభావం తెలుపుతారని భావించగా అలాంటిదే జరుగలేదు.

దీంతో సీఎం కేసీఆర్.. బీజేపీ మధ్య లోపాయికారి ఒప్పందం జరిగిందనే టాక్ విన్పించింది. ఢిల్లీ నుంచి సీఎం కేసీఆర్ హైదరాబాద్ రాగానే తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఢిల్లీకి వెళ్లడం హాట్ టాపిక్ గా మారింది. తాజాగా ఆయన ఢిల్లీలో నిర్వహించిన సమావేశంలో మాట్లాడుతూ సీఎం కేసీఆర్ పై నిప్పులు చెరిగారు.

రాష్ట్రంలోని ప్రజల దృష్టిని మరల్చేందుకు కేసీఆర్ ఢిల్లీ టూర్ వెళ్లరని విమర్శించారు. టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఆరేళ్లలో ఎన్నో అవినీతి అక్రమాలకు పాల్పడ్డారని ఆరోపించారు. ప్రాజెక్టుల పేరుతో లక్షల కోట్ల ధనాన్ని లూటీ చేశారని ఆరోపించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పూర్తయినా నాటి నుంచి అదనంగా ఒక్క ఎకరానికి కూడా సాగునీరు అందించలేదని తెలిపారు.

కేసీఆర్ నోరు తెరిస్తే అన్ని అబద్ధాలే అని.. గత ఆరేళ్లలో కేసీఆర్‌ చెప్పేదొకటి.. చేసేంది.. మరోకటి అని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఢిల్లీకి వెళ్లి కేంద్ర నాయకుల వద్ద వంగివంగి దండాలు పెట్టినా వదిలిపెట్టేది లేదని.. కేసీఆర్ జైలుకెళ్లడం ఖాయమని హెచ్చరించారు. రైతుల పోరాటానికి మద్దతిచ్చిన కేసీఆర్ వారిని ఎందుకు కలువలేదని ప్రశ్నించారు.

పట్టభధ్రుల ఎమ్మెల్సీ ఎన్నికలు వస్తుండటంతో ఓట్ల కోసమే ఉద్యోగాల నోటిఫికేషన్ అంటూ కొత్త డ్రామాలకు తెరలేడని బండి సంజయ్ విమర్శించారు. కేసీఆర్ నిజంగా అన్ని శాఖల్లోని ఖాళీలను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. నోటిఫికేషన్ల పేరుతో నిరుద్యోగుల మోసం చేస్తే వారి కడుపుమంటల్లో కేసీఆర్ కాలిపోవడం ఖాయమని హెచ్చరించారు.

కేసీఆర్ పాలనకు సమయం దగ్గర పడిందన్నారు. అసలు కేసీఆర్ ఢిల్లీకి ఎందుకు వచ్చారు? ఢిల్లీలో ఎక్కడ యుద్ధం చేశారో తెలుపాలని లని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఢిల్లీ టూర్ కేవలం కేంద్రాన్ని అబాసుపాలు చేసేందుకే వెళ్లారంటూ విమర్శలు గుప్పించారు. బండి సంజయ్ వ్యాఖ్యల నేపథ్యంలో తెలంగాణలో మళ్లీ టీఆర్ఎస్ వర్సెస్ బీజేపీ అన్నట్లుగా రాజకీయాలు సాగడం ఖాయమనే టాక్ విన్పిస్తోంది.