TANA 2024 elections : తానా ఎన్నికల్లో కొడాలి టీం విజయం.. ‘కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ గా డా. ఉమా ఆరమండ్ల కటికి గెలుపు

ఇక ఈసారి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఆశ్రిత పక్షపాతానికి దూరంగా, పారదర్శకంగా జరిగిన ఈ ఎన్నికలు తానాలో నూతన శకమని అభివర్ణించారు.

Written By: Raj Shekar, Updated On : January 19, 2024 11:57 am
Follow us on

TANA 2024 elections : అమెరికాలోని తెలుగు అసోసియేషన్ ఆఫ్ నార్త్ అమెరికా (తానా) 2023 ఎన్నికల ఫలితాలు గురువారం వెలువడ్డాయి. ఎన్నికల కమిటీ అధ్యక్షుడు ఐనంపూడి కనకంబాబు ఫలితాలను ప్రకటించారు. తానా తదుపరి అధ్యక్షుడిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం కృష్ణా జిల్లాకు చెందిన వర్జీనియా ప్రవాసుడు డా. నరేన్ కొడాలి ఎన్నికయ్యారు. ఎన్నికల్లో నరేన్‌కు 13,225 ఓట్లు రాగా, ఆయన ప్రత్యర్థి వేమూరి సతీష్‌కు 10,362 ఓట్లు లభించాయి. 20ఏళ్లుగా తానాలో రాజ్యసభ పదవులే గానీ లోక్‌సభ పద్ధతిలో పదవి దక్కలేదని విమర్శించేవారు. కానీ 2023 ఎన్నికల్లో నరేన్‌ ను తొలిసారి విజయం వరించింది. గతంలో నిరంజన్ శృంగవరపు చేతిలో అధ్యక్ష ఎన్నికల్లో ఓడిపోయారు. అయితే 2023లో సెలక్షన్ పద్ధతిలో అధ్యక్షుడిగా నియమితులయ్యారు. కోర్టు కేసుల నేపథ్యంలో తానాకు మళ్లీ ఎన్నికలు నిర్వహించారు. ఎన్నికల్లో నరేన్ తన అస్త్రాలు అన్నింటినీ ఉపయోగించి సఫలీకృతం అయ్యారు. తన అధ్యక్ష పీఠం అధిరోహించబోతున్నారు.

ప్యానల్ సభ్యుల గెలుపు..
ఎన్నికల్లో నరేన్ విజయం సాధించడమే కాకుండా తన ప్యానెల్ సభ్యులను విజయతీరాలకు చేర్చారు. కోమటి, నాదెళ్ల, వేమన, నన్నపనేని, గోగినేని వంటి మాజీల నుంచి ఆయనకు మద్దతు లభించింది. దీంతో ఎన్నికల్లో విజయం నరేన్ ను వరించింది. నరేన్ ప్యానెల్ నుంచి కార్యదర్శిగా కసుకుర్తి రాజా గెలుపొందారు. ఈ ఎన్నికలకు కారణమైన వేమూరి ప్యానెల్ నుంచి కోశాధికారిగా పోటీ చేసిన తాళ్లూరి మురళీ నరేన్ ప్యానెల్ నుంచి పోటీలో ఉన్న మద్దినేని భరత్ చేతిలో 2,210 ఓట్ల తేడాతో ఓడిపోయారు.

– కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ గా డా.ఉమా ఆరమండ్ల కటికి గెలుపు
తానా ఎన్నికల్లో నరేన్ కొడాలి టీం తరఫున ‘కల్చరల్ సర్వీస్ కోఆర్డినేటర్ గా పోటీ చేసిన డా. ఉమా ఆరమండ్ల కటికి ఘన విజయం సాధించారు. ఉమా గారికి 12638 ఓట్లు రాగా.. ప్రత్యర్థి రజినీకాంత్ కక్కెర్లకు 10854 ఓట్లు వచ్చాయి.

-ప్రజాస్వామ్య పద్ధతిలో ఎన్నికల కోసం..
ప్రజాస్వామ్యానికి దాని ఆధారభూతమైన ఎన్నికలకు తాను ఎప్పుడూ వ్యతిరేకిని కానని “విధేయత-విశ్వసనీయత-ప్రభావవంతమైన సేవ” అనే నినాదంతో నరేన్ ఎన్నికల బరిలో నిలిచి విజయ శంఖారావం పూరించారు. ఎన్నికల సందర్భంగా తానాకు అమెరికాలో శాశ్వత భవనం నిర్మించేందుకు తన సొంత నిధులు లక్ష డాలర్లు విరాళంగా అందించారు. రెండున్నర లక్షల డాలర్లు విరాళాలు సమీకరించి నిర్మాణాన్ని పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. తానాలో ఎక్కువగా F1-H1 వీసాలపై అమెరికాకు వలస వచ్చినవారు ఉన్నారని తెలిపారు. వీరికి ప్రత్యేకంగా లాయర్లను నియమించే శాశ్వత న్యాయసేవల విభాగాన్ని ప్రారంభిస్తామని తెలిపారు. దీనికి తన సొంత నిధులు $50వేల డాలర్లు విరాళంగా అందిస్తానని వెల్లడించారు.

-అమెరికాలో పుట్టిన యువతకు..
అమెరికాలోనే పుట్టి పెరిగిన యువతకు కూడా తానాకు చేరువ చేసే ప్రణాళికలో భాగంగా పోటీ పరీక్షలకు మార్గనిర్దేశకత్వం, శిక్షణ, సన్నద్ధత వంటి కార్యక్రమాలను ఏర్పాటు చేస్తామని తెలిపారు. దీనికి తన సొంత నిధులు $50వేల డాలర్లను మూలధనంగా విరాళం రూపంలో అందజేస్తానని, ఆచార్యుడిగా తన అనుభవంతో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేస్తానని పేర్కొన్నారు. ఇక ఈసారి మధ్యవర్తుల ప్రమేయం లేకుండా, ఆశ్రిత పక్షపాతానికి దూరంగా, పారదర్శకంగా జరిగిన ఈ ఎన్నికలు తానాలో నూతన శకమని అభివర్ణించారు.

-విజేతల వీరే..

ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌ – నరేన్‌ కొడాలి
కార్యదర్శి – రాజా కసుకుర్తి
ట్రెజరర్‌ – భరత్‌ మద్దినేని
జాయింట్‌ సెక్రటరీ…వెంకట్‌ కోగంటి
జాయింట్‌ ట్రెజరర్‌…సునీల్‌ పాంట్ర
కమ్యూనిటీ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌…లోకేష్‌ నాయుడు కొణిదెల
కల్చరల్‌ సర్వీస్‌ కో ఆర్డినేటర్‌….ఉమా ఆరమండ్ల కటికి
ఉమెన్‌ సర్వీసెస్‌ కో ఆర్డినేటర్‌…సోహ్ని అయినాల
కౌన్సిలర్‌ ఎట్‌ లార్జ్‌….సతీష్‌ కొమ్మన
ఇంటర్నేషనల్‌ కో ఆర్డినేటర్‌….టాగూర్‌ మల్లినేని
స్పోర్ట్స్‌ కో ఆర్డినేటర్‌…నాగ పంచుమర్తి

– రీజినల్‌ రిప్రజెంటేటివ్‌లు..

సౌత్‌ ఈస్ట్‌ …మధుకర్‌ యార్లగడ్డ
అప్పలాచియాన్‌…రాజేష్‌ యార్లగడ్డ
న్యూఇంగ్లాండ్‌…కృష్ణ ప్రసాద్‌ సోంపల్లి
నార్త్‌…నీలిమ మన్నె
నార్త్‌ సెంట్రల్‌…శ్రీమాన్‌ యార్లగడ్డ
సదరన్‌ కాలిఫోర్నియా….హేమ కుమార్‌ గొట్టి
నార్త్‌ కాలిఫోర్నియా….వెంకట్‌ అడుసుమిల్లి
నార్త్‌ వెస్ట్‌…. సురేష్‌ పాటిబండ్ల
క్యాపిటల్‌…సతీష్‌ చింత
మిడ్‌ అట్లాంటిక్‌…వెంకట్‌ సింగు
సౌత్‌ వెస్ట్‌….సుమంత్‌ పుసులూరి
డిఎఫ్‌డబ్ల్యు…పరమేష్‌ దేవినేని
న్యూజెర్సి….రామకృష్ణ వాసిరెడ్డి
న్యూయార్క్‌…దీపిక సమ్మెట
ఓహాయోవ్యాలీ…శివ చావా

బోర్డ్‌ డైరెక్టర్స్‌..

శ్రీనివాస్‌ లావు
రవి పొట్లూరి
మల్లిఖార్జున వేమన

ఫౌండేషన్‌ ట్రస్టీస్‌..

రామకృష్ణ చౌదరి అల్లు
భక్త బల్ల
శ్రీనివాస్‌ కూకట్ల
రాజా సూరపనేని
శ్రీనివాస్‌ ఎండూరి